Sandal Stolen: రూ.180 విలువైన చెప్పులు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు: అందులో పెద్ద ట్విస్ట్

ఒక వ్యక్తి రూ. 180 విలువైన చెప్పులు పోయాయని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా ఖచ్రోడ్ పోలీస్ స్టేషన్‌లో ఈ వింత కేసు నమోదైంది.

Sandal Stolen: రూ.180 విలువైన చెప్పులు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు: అందులో పెద్ద ట్విస్ట్

Sandal

Sandal Stolen: చెప్పులు చోరీకి గురయ్యాయంటూ ఓ రైతు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన అందరిని అవాక్కయ్యేలా చేసింది. సాధారణంగా డబ్బు బంగారం దొంగతనాలు, ఇతర నేరాలకు సంబంధించి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వస్తుంటారు బాధితులు. అయితే నిత్యం బిజీబిజీగా ఉండే పోలీసులకు అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన కేసులు వస్తుంటాయి. తాజాగా అలాంటి మరో వింత కేసు పోలీసుల దృష్టికి వచ్చింది. ఒక వ్యక్తి రూ. 180 విలువైన చెప్పులు పోయాయని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా ఖచ్రోడ్ పోలీస్ స్టేషన్‌లో ఈ వింత కేసు నమోదైంది. అయితే మొదట్లో రైతు చెప్పిన మాటలు విన్న కొందరు పోలీసులు నవ్వుకున్నారు. చెప్పుల గురించి ఎవరైనా పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? అంటూ పోలీసులు ఆ రైతుకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే చివరకు ఆ రైతు చెప్పిన లాజిక్ విన్న పోలీసులు చివరకు కంప్లైంట్ తీసుకోలేక తప్పలేదు.

Also Read:Haryana: తవ్వకాల్లో బయటపడ్డ 5వేళ ఏళ్ల నాటి బంగారం తయారీ ఫ్యాక్టరీ

ఉజ్జయిని జిల్లా ఖచ్రోడ్ ప్రాంతానికి చెందిన జితేంద్ర అనే రైతు తన స్నేహితుడితో కలిసి శనివారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రూ.180 విలువైన తన నల్ల చెప్పులను దొంగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారు. తన చెప్పుల చోరీ వెనుక కుట్ర ఉందని జితేంద్ర పోలీసులకు తెలిపాడు. “దొంగ నా చెప్పులను మరొక నేర స్థలంలో వదిలేస్తే ఆ నేరం రైతు అయిన నాపై పడుతుంది, ఎవరో నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారని” రైతు జితేంద్ర అనుమానం వ్యక్తం చేశారు. అందుకు బలం చేకూర్చేలా తన వద్ద ఉన్న కొన్ని ఆధారాలను కూడా పోలీసులకు అందజేశాడు జితేంద్ర. అయితే రైతు చెప్పిన “లాజిక్” పాయింట్ విన్న పోలీసులు మొదట నవ్వుకున్నా, అతడి ఆలోచనాలోతునూ గ్రహించి అతడి నుంచి ఆధారాలు తీసుకుని.. ఫిర్యాదు స్వీకరించారు. చెప్పులు చోరీకి గురవడంపై విచారణ జరుపుతారని పోలీసులు స్పష్టం చేశారు.

Also read:Pawan Kalyan Slams Government : వైసీపీ మళ్లీ వస్తే అంధకారమే-పవన్ కళ్యాణ్