Ajit Pandurang Balwadkar : మనవరాలికి హెలికాప్టర్ ద్వారా స్వాగతం.. రిచ్ పర్సన్ అనుకుంటున్నారా

పుణెలోని బాలువాడి ప్రాంతానికి చెందిన అజిత్ పాండురంగ్ ఓ రైతు. పొలంలో పంటలు పండించుకుంటూ కుటుంబాన్ని పోషించుకొనే వాడు. ఇటీవలే మనవరాలు జన్మించింది. ఈ విషయం తెలుసుకున్న అజిత్ సంతోషం వ్యక్తం చేశాడు...

Ajit Pandurang Balwadkar : మనవరాలికి హెలికాప్టర్ ద్వారా స్వాగతం.. రిచ్ పర్సన్ అనుకుంటున్నారా

Helicopter

Farmer From Balewadi Hired A Helicopter : ఈరోజుల్లో ఆడపిల్ల పుడితే ‘మా ఇంట్లో మహాలక్ష్మి’ పుట్టిందని పండుగ చేసుకునేవారు గతంలో. కానీ ఇప్పుడు అలా కాదు ఏంటీ ఆడపిల్లా? అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. చాలా మంది ఆడపిల్లలు పుట్టకూడదని కోరుకుంటుంటారు.. ఆడపిల్ల పుట్టిందనే నెపంతో కొంతమంది భర్తలు ఆకృత్యాలకు పాల్పడిన ఘటనలు చూస్తూనే ఉంటాం. కానీ..ఓ వ్యక్తి మాత్రం తనకు ఆడపిల్ల పుట్టిందని మురిసిపోయాడు. ఆ ఆనందాన్ని తన కుటుంబసభ్యులతో పంచుకున్నాడు. ఏకంగా హెలికాప్టర్ ద్వారా మనవరాలికి ఘన స్వాగతం పలికాడు. కుటంబసభ్యుల మధ్య తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు. అయితే.. ఆ వ్యక్తి ఏదో బడాబాబో.. ధనవంతుడు అని మాత్రం అనుకొనేరు. కానే కాదు.. పొలంలో నాగలి పట్టి పొలం దున్నే ఓ సామాన్య రైతు. ఈ ఘటన పుణెలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Read More : PM Modi : మోడీజీ మౌనం వీడండీ..ద్వేష రాజకీయాలకు ముగింపు పలకండీ : ప్రధానికి 100కిపైగా మాజీ బ్యూరోక్రాట్ల లేఖ

పుణెలోని బాలువాడి ప్రాంతానికి చెందిన అజిత్ పాండురంగ్ ఓ రైతు. పొలంలో పంటలు పండించుకుంటూ కుటుంబాన్ని పోషించుకొనే వాడు. ఇటీవలే మనవరాలు జన్మించింది. ఈ విషయం తెలుసుకున్న అజిత్ సంతోషం వ్యక్తం చేశాడు. వినూత్నంగా మనవరాలికి స్వాగతం పలకాలని నిర్ణయించుకున్నాడు. అమ్మమ్మ వాళ్లింటి నుంచి తీసుకరావడానికి ఏకంగా హెలికాప్టర్ బుక్ చేయించాడు. అందులో కోడలు, కొడుకు, మనవరాలిని ఇంటికి తీసుకొచ్చాడు. మనవరాలికి ఘన స్వాగతం పలికి.. తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు. ఈ సందర్భంగా అతను మీడియాతో మాట్లాడాడు. కుటుంబంలోకి ఆడపిల్ల రావడం తమకెంతో సంతోషంగా ఉందని, కృషికాకు తామంతా ఘన స్వాగతం పలకాలని నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మనవరాలితో కుటుంబసభ్యులు హెలికాప్టర్ వద్ద ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. రైతు అజిత్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.