Farmer Hires Helicopter: కుమారుడి పెళ్లి కోసం హెలికాప్టర్ అద్దెకు తీసుకున్న రైతు

ఓ రైతు తన కుమారుడి పెళ్లి కోసం ఏకంగా హెలికాఫ్టర్ నే అద్దెకు తీసుకున్నాడు. హెలికాప్టర్లో పెళ్లి కూతురిని తీసుకువచ్చి కుమారుడి పెళ్లిని ఘనంగా జరిపించి రైతు సత్త ఏంటో చూపించాడు.

Farmer Hires Helicopter: కుమారుడి పెళ్లి కోసం హెలికాప్టర్ అద్దెకు తీసుకున్న రైతు

Farmer

Farmer Hires Helicopter: రైతులంటే నేటికీ సమాజంలో ఎక్కడోచోట చిన్న చూపు ఉంది. రైతన్న రెక్కల కష్టాన్ని గుర్తించని కొందరు వ్యక్తులు రైతు కుటుంబంతో పెళ్లి సంబంధం అంటేనే వెనకడుగు వేస్తున్నారు. అటువంటి వారి కళ్లు తెరిపించేలా ఓ రైతు తన కుమారుడి పెళ్లి కోసం ఏకంగా హెలికాఫ్టర్ నే అద్దెకు తీసుకున్నాడు. హెలికాప్టర్లో పెళ్లి కూతురిని తీసుకువచ్చి కుమారుడి పెళ్లిని ఘనంగా జరిపించి రైతు సత్త ఏంటో చూపించాడు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లా అరాండియా గ్రామానికి చెందిన రైతు సజ్జన్ సింగ్ కుష్వాహా.. తన కుమారుడు జై సింగ్ కుష్వాహా పెళ్లిని రాజస్థాన్ కు చెందిన యువతితో నిశ్చయించాడు. పెళ్లి కోసం మధ్యప్రదేశ్ లోని అరాండియా నుంచి రాజస్థాన్ లోని బుధనియా గ్రామానికి వరుడిని తరలించాల్సి ఉంది.

Also read:India Border: పాకిస్తాన్ నుంచి వచ్చిన ‘మేడ్ ఇన్ చైనా’ డ్రోన్ కూల్చివేసిన భారత భద్రతా దళాలు

దీంతో రైతు సజ్జన్ సింగ్..ఏకంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్నాడు. కుటుంబ సభ్యులకు చెప్పకుండా..వారిని ఆశ్చర్యానికి గురిచేసేందుకు..రైతు సజ్జన్ సింగ్ కుష్వాహా ఈ ఏర్పాట్లు చేశాడు. పెళ్లి అనంతరం వధువును కూడా అత్తారింటికి అదే హెలికాప్టర్లో తీసుకువచ్చారు. కుమారుడి పెళ్లి చూసి ఆ తల్లిదండ్రులు ఎంతో ఉప్పొంగిపోగా..తండ్రి ఇచ్చిన ఆ మధురానుభూతి చూసి నవ వరుడు ఎంతో మురిసిపోయాడు. తండ్రి నుంచి ఇటువంటి బహుమతి ఊహించలేదని..తన పెళ్లి సందర్భంగా హెలికాప్టర్ లో వెళ్లడం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిందని రైతు కుమారుడు, నవ వరుడు జై సింగ్ కుష్వాహా ఆనందం వ్యక్తం చేశాడు. ఇటీవల పుణేలోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. మనవరాలు పుట్టిందంటూ ఓ రైతు హెలికాప్టర్ లో మనవరాలిని ఇంటికి తీసుకువచ్చాడు.

Also read:Elephant Viral Video: దురదపెట్టిన ఏనుగు ఏం చేసిందో చూడండి: వైరల్ వీడియో