vote against BJP : నందిగ్రామ్ “మహాపంచాయత్”కి బయల్దేరిన రైతు నేత టికాయత్

శ్చిమబెంగాల్‌లో ఎన్నికల నేపథ్యంలో అధికార టీఎంసీ-బీజేపీ, ఆసక్తికర పోరు కొనసాగుతోంది. ఇటీవల మమత గాయపడి హాస్పిటల్ లో చేరడం, నందిగ్రామ్‌లో సువేందు అధికారి Vs మమత మధ్య జరగబోయే రసవత్తర పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.

vote against BJP : నందిగ్రామ్ “మహాపంచాయత్”కి బయల్దేరిన రైతు నేత టికాయత్

Vote Against Bjp

Rakesh Tikait పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల నేపథ్యంలో అధికార టీఎంసీ-బీజేపీ, ఆసక్తికర పోరు కొనసాగుతోంది. ఇటీవల మమత గాయపడి హాస్పిటల్ లో చేరడం, నందిగ్రామ్‌లో సువేందు అధికారి Vs మమత మధ్య జరగబోయే రసవత్తర పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్‌ టికాయత్‌ శనివారం సాయంత్రం నందిగ్రామ్ కు బయలుదేరడం ఆసక్తికరంగా మారింది.

ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని ఇటీవల రైతు సంఘాల నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టికాయత్‌,సంయుక్త కిసాన్ మోర్చా నేత యధువీర్ సింగ్ సహా మరికొందరు రైతు నేతలుశనివారం కోల్‌కతా చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ (మహా పంచాయత్‌)లో పాల్గొన్నారు. హక్కుల కార్యకర్త మేధా పాట్కర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీకి ఓటు వేయోద్దని కిసాన్ మహాపంచాయత్ వేదికగా మద్దతుదారులకు టికాయత్ పిలుపునిచ్చారు. మమత కాలికి గాయమవడానికి కారణం బీజేపీనేనని టికాయత్ ఆరోపించారు. నందిగ్రామ్ లో కూడా కిసాన్ మహాపంచాయత్ నిర్వహించేందుకు కోల్ కతా నుంచి బయల్దేరి వెళ్లారు టికాయత్. కనీస మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేయట్లేదని తాము నందిగ్రామ్ ప్రజలకు చెబుతామని, మొత్తం దేశాన్ని బీజేపీ వాళ్లు దోచేశారని,వారికి ఓటు వేయొద్దని ప్రజలకు విజ్ణప్తి చేస్తామని టికాయత్ అన్నారు. నందిగ్రామ్ వెళ్లే ముందు మాయో రోడ్డులో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలను టికాయత్ కలిశారు. అలాగే, టికాయత్‌ ఆదివారం సింగూరు,అసన్ సోల్ కూడా ఇదే విధంగా పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించనున్నట్లు సమాచారం.

మరోవైపు, కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు నాలుగు నెలలుగా రైతులు ఉద్యమిస్తున్నారు. కేంద్రంతో 11 దఫాలుగా చర్చలు జరిపినా ఎలాంటి పరిష్కారం లభించకపోవడంతో ఈ అంశంపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీంతో వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోనే టెంట్‌లు వేసుకొని నిరసనలు కొనసాగిస్తున్నారు. అయితే, తమ ఆందోళనలపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి వెళ్లి తమ ఉద్యమ గొంతుకను వినిపించి, బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నేతలు నిర్ణయించిన విషయం తెలిసిందే.