రైతుల ఉద్యమం, 100వ రోజు

రైతుల ఉద్యమం, 100వ రోజు

Farmer Leaders Protest : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ..రైతన్నలు చేస్తున్న ఉద్యమం 100వ రోజుకు చేరుకుంది. చట్టాలను వెనక్కి తీసుకోనంత వరకు తమ ఉద్యమం ఆపేది లేదని రైతు సంఘాలు తేల్చిచెబుతున్నాయి. గతేడాది నవంబర్‌ 26న ఉద్యమాన్ని ప్రారంభించిన రైతు సంఘాలు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, టిక్రి, ఘాజిపూర్‌ వద్ద గత మూడు నెలలుగా నిరసనలు చేపడుతున్నారు.

చలికాలంలో చలికి వణుకుతూ..వానకు తడుస్తూ..ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఉద్యమం వంద రోజులకు చేరుకున్న సందర్భంగా..2021, మార్చి 06వ తేదీ శనివారం బ్లాక్ డేగా పాటించనున్నారు. కుండ్లి – మానేసర్ పల్వాల్ ఎక్స్ ప్రెస్ వేను 5 గంటల పాటు దిగ్భందించనున్నారు. గణతంత్ర దినోత్సవం రోజు రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీలో హింసాత్మకంగా మారింది. అనూహ్యంగా కొందరు ఎర్రకోటపై దాడి చేశారు. ఆ ఘటనలో కొందరు నిరసనకారులు, పోలీసులు గాయపడ్డారు. మరోవైపు..కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాలు పలు దఫాలు చర్చలు జరిపినా ఏకాభిప్రాయం కుదరలేదు.