చర్చలు విఫలమైతే 8న భారత్ బంద్ : రైతు సంఘాలు

  • Published By: murthy ,Published On : December 5, 2020 / 04:39 AM IST
చర్చలు విఫలమైతే 8న భారత్ బంద్ : రైతు సంఘాలు

Farmer leaders call for Bharat Bandh on December 8 if demands not met : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళన మరింత తీవ్రం చేయనున్నారు. ఈ నెల 8వ తేదీన భారత్‌ బంద్‌ పిలుపు నిచ్చారు రైతు సంఘ నాయకుడు హర్వీదర్‌ సింగ్‌ లడ్క్‌వాల్‌. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరాము. ఈ రోజు (డిసెంబర్ 5) దేశవ్యాప్తంగా ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేస్తాము.

డిసెంబర్‌ 8వ తేదీన భారత్‌ బంద్‌ పాటించాలని పిలుపునిస్తున్నాము’’ అని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు లోఖోవాల్‌ జనరల్‌ సెక్రటరీ హర్వీదర్‌ సింగ్‌ చెప్పారు. అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే టోల్ ప్లాజాలను ఆక్రమించుకుంటామని వారు హెచ్చరించారు. ఢిల్లీకి వెళ్లే అన్ని రహదారులను దిగ్భందం చేస్తామని రైతు నాయకుడుహర్విందర్ సింగ్ లడ్క్ వాల్ అన్నారు


దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేపట్టిన ఆందోళన వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. రైతుల నిరసనతో కొవిడ్‌ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున వారిని వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. న్యాయవాది ఓం ప్రకాశ్‌ పరిహార్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.


వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హస్తిన సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన నేటితో తొమ్మిదో రోజుకు చేరింది. కొత్త చట్టాలపై రైతు సంఘాలు, కేంద్రం ఇప్పటికే రెండు విడతల్లో చర్చలు జరిపినప్పటికీ అవి కొలిక్కిరాలేదు. దీంతో చర్చలను ఈరోజుకు వాయిదా వేశారు. రాజధాని సరిహద్దుల్లోనే రైతులను నిరోధించటంతో ఢిల్లీకి వచ్చేమార్గాలలో ఇప్పటికే ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది.

ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్ లనుకలిపే కీలక మార్గాల్లో పోలీసులు పహరా కాస్తున్నారు. ఢిల్లీ ఘజియాబాద్ ను కలిపే ఎన్ హెచ్ -24ను ఉత్తర ప్రదేశ్ కు చెందిన రైతులు శుక్రవారం దిగ్బధించారు.