Farmer Protest: ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమానికి 8నెలలు

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన ఉద్యమం 2021 జులై 26కు ఎనిమిది నెలలు పూర్తి చేసుకుంది. గతేడాది నవంబర్ 26న మొదలుపెట్టిన ఉద్యమం 240 రోజులుగా సింఘూ, టిక్రీ, ఘాజీపూర్‌, షాజహాన్‌ పూర్‌, పల్వాల్‌ సరిహద్దుల్లో కొనసాగుతూనే ఉంది.

Farmer Protest: ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమానికి 8నెలలు

Farmer Protest

Farmer protest: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన ఉద్యమం 2021 జులై 26కు ఎనిమిది నెలలు పూర్తి చేసుకుంది. గతేడాది నవంబర్ 26న మొదలుపెట్టిన ఉద్యమం 240 రోజులుగా సింఘూ, టిక్రీ, ఘాజీపూర్‌, షాజహాన్‌ పూర్‌, పల్వాల్‌ సరిహద్దుల్లో కొనసాగుతూనే ఉంది. కొత్తగా ఆమోదం పొందిన మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కు చట్టబద్ధత కల్పించాలని, విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలంటూ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ సందర్భంగా జంతర్‌మంతర్‌ వద్ద సోమవారం మహిళా రైతుల ‘కిసాన్‌ సంసద్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దులో అన్నదాతలు చేపట్టిన నిరసనకు 8 నెలలు పూర్తయిన నేపథ్యంలో మహిళా రైతులకు మద్దతు తెలియజేయనుంది సంయుక్త కిసాన్ మోర్చా.

ఈ సందర్భంగా మాట్లాడిన భారతీయ కిశాన్ యూనియన్.. ప్రతినిధి రాకేశ్ తికైట్ మరోసారి ట్రాక్టర్ ర్యాలీ చేపట్టాలని పిలుపునిచ్చారు. ట్రాక్టర్ ర్యాలీ అనేది తప్పుడు విషయమేమీ కాదు. హర్యానాలోని జింద్ వాసులు సరైన నిర్ణయమే తీసుకున్నారు. ఆగష్టు 15న మరోసారి చేపట్టాలనుకుంటున్నా. సంయుక్త్ కిశాన్ మోర్చా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. జాతీయ జెండాలను పెట్టుకుని ర్యాలీలో పాల్గొనాలి. అని ఆయన అన్నారు.