మార్చి-26న “భారత్ బంద్” కు రైతు సంఘాలు పిలుపు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. మార్చి-26న పూర్తి స్థాయిలో "భారత్ బంద్"కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి

మార్చి-26న “భారత్ బంద్” కు రైతు సంఘాలు పిలుపు

-complete-bharat-bandh-on-march-26

Bharat bandh నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. మార్చి-26న పూర్తి స్థాయిలో “భారత్ బంద్”కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. మార్చి-26నాటికి తమ ఉద్యమానికి నాలుగు నెలలు పూర్తయిన నేపథ్యంలో భారత్ బంద్ కు పిలుపునిచ్చారు రైతు నేతలు. అయితే అసోం,వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ప్రారంభం కానున్న ముందు రోజే భారత్ బంద్ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.

మరోవైపు, మార్చి-15న ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ మరియు ఆయిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ రైతు సంఘాలు,ట్రేడ్ యూనియన్లు ఆందోళన చేయనున్నట్లు రైతు సంఘం సన్కుక్త్ కిసాన్ మోర్చా తెలిపింది. ఇక, మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు తాము ఆందోళన విరమించబోమని రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ గతవారం సృష్టం చేసిన విషయం తెలిసిందే. కొత్త చట్టలవల్ల కార్పొరేట్ల దయతో తాము బతికే పరిస్థితి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవితాలను కొత్త చట్టాలు నాశనం చేస్తాయని వారు ఆందోళన చెందుతున్నారు.

అయితే వ్యవసాయ చట్టాల విషయంపై కేంద్రప్రభుత్వం ఇప్పటివరకు 11సార్లు రైతు నేతలతో చర్చలు జరిపింది. అయితే,చట్టాలు రద్దు చేయాలని రైతులు పట్టుబడుతుండగా..రద్దు చేసే ప్రశక్తే లేదని కేంద్రం చెబుతుండటంతో 11రౌండ్ల చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. ఈ చట్టాలతో రైతులకు వచ్చిన నష్టం ఏమీ లేదని.ఇంకా రైతులకు లాభమే కలుగుతుందని కేంద్రం చెబుతోంది.