పెళ్లి పార్టీ చేసుకుందామని ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఢిల్లీ ఆందోళనల్లో చనిపోయాడు

పెళ్లి పార్టీ చేసుకుందామని ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఢిల్లీ ఆందోళనల్లో చనిపోయాడు

Farmer who died at ITO మంగళవారం ఢిల్లీలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఉత్తరాఖండ్ కి చెందిన నవ్రీత్ అనే ఓ రైతు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. రైతు మృతిపై తీవ్ర దుమారం చెలరేగింది. పోలీసుల కాల్పుల్లోనే అతడు మరణించాడని రైతు సంఘాలు ఆరోపించగా… ట్రాక్టర్ బోల్తాపడడంతోనే రైతు మరణించాడని ఢిల్లీ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ వీడియో విడుదల చేశారు. అతివేగంతో బారికేడ్లను ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని.. ఈ విషయంలో పోలీసులపై ఆరోపణలు చేయడం తగదని అన్నారు.

అయితే, ట్రాక్టర్ బోల్తాపడి మరణించిన 27 ఏళ్ల నవ్రీత్ సింగ్ కుటుంబ నేపథ్యం గురించి పోలీసులు ఆరాతీయగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నవ్రీత్ సింగ్ స్వస్థలం..యూపీలోని రామ్‌పూర్ జిల్లాలోని దిబ్డిబా గ్రామం. ఆస్ట్రేలియాలో ఉంటున్న నవ్రీత్ కి కొన్నాళ్ల క్రితం ఆస్ట్రేలియాలోనే పెళ్లి అయింది. అయితే తన పెళ్లి వేడుకను సెలబ్రేట్ చేసుకునేందుకు కొద్ది రోజుల క్రితం నవ్రీత్ స్వస్థలానికి వచ్చాడు.

అయితే తన బంధువులు రైతుల ఆందోళనల్లో పాల్గొనడంతో తాను కూడా వారి వెంట వెళ్లాలి అని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నాడు. కానీ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి మరణించాడు. నవ్రీత్ సింగ్ హుందాల్ మృతితో అతడి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నవ్రీత్ పొరుగింటి వ్యక్తి మాట్లాడుతూ.. ట్రాక్టర్ పరేడ్ లో పాల్గొందామని మేమిద్దం కలిసి వచ్చాం..కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు