మోడీ రైతుల పాలిట రావణుడంటూ.. ప్రధాని బొమ్మకు నిప్పంటించిన రైతులు

మోడీ రైతుల పాలిట రావణుడంటూ.. ప్రధాని బొమ్మకు నిప్పంటించిన రైతులు

కేంద్రం ప్రవేశపెట్టిన Farm Billsకు వ్యతిరేకంగా రైతులు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఉత్తర భారతంలో దసరా రోజున కేంద్రంపై ఆగ్రహం మరింత వేడెక్కింది. రావణుడికి బదులుగా ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మకు నిప్పంటించి దగ్ధం చేశారు.

పంజాబ్, హర్యానా రైతులు పీఎం మోడీని “కిసాన్ కా రావణ” (రైతుల పాలిట రావణుడు అని అభివర్ణిస్తూ.. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.



పంజాబ్ లోని బతిందాలో రైతులు రావణుడు బొమ్మను తయారుచేసి మోడీ మొహాన్ని అంటించి మిగిలిన తొమ్మిది మొహాలను ఇండియాలోని బడా వ్యాపారులైన ముఖేశ్ అంబానీ, గౌతం అదానీలవి అంటించిం దగ్ధం చేశారు.

బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా.. చేసిన కామెంట్ల తర్వాత రైతులు మరింత కోపోద్రిక్తులైయ్యారు. ఇటీవల ఆమోదం పొందిన మూడు వ్యవసాయ బిల్లులను వెనక్కు తీసుకోవాలంటూ నినాదాలతో డిమాండ్ నిప్పంటించారు.