Walking Naked : ఒంటిపై నూలుపోగు లేకుండా నగ్నంగా నామినేషన్‌ వేసేందుకు వచ్చారు… ఆ తర్వాత ఏం జరిగిందంటే..

కేంద్ర ప్రభుత్వం తీరుని ఖండిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఒంటిపై నూలిపోగు లేకుండా నగ్నంగా వచ్చి నామినేషన్ వేసేందుకు ప్రయత్నించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు...

Walking Naked : ఒంటిపై నూలుపోగు లేకుండా నగ్నంగా నామినేషన్‌ వేసేందుకు వచ్చారు… ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Farmers Detained After Walking Naked To File Nomination Papers

Farmers detained after walking naked : కేంద్ర ప్రభుత్వం తీరుని ఖండిస్తూ ఇద్దరు రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఒంటిపై నూలిపోగు లేకుండా నగ్నంగా వచ్చి నామినేషన్ వేసేందుకు ప్రయత్నించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వారిపై దుస్తులు కప్పేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైలో జరిగింది.

దక్షిణ భారత నదుల అనుసంధానం రైతు సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను ఆధ్వర్యంలో వందవాసికి చెందిన కొందరు రైతులు తిరువణ్ణామలై అసెంబ్లీకి పోటీ చేసేందుకు తిరువణ్ణామలై వచ్చారు. తిరువణ్ణామలై తాలుకా కార్యాలయంలో నామినేషన్‌ వేసేందుకు పెరియార్‌ విగ్రహం నుంచి కాలి నడకన బయలుదేరారు. అయితే నామినేషన్ వేసేందుకు వచ్చిన ఇద్దరు రైతులు వారు ఒంటిపై ఉన్న దుస్తులు తీసేశారు. నగ్నంగా రోడ్డుపై పయనం అయ్యారు. ఇది గమనించిన బందోబస్తులో ఉన్న పోలీసులు వెంటనే వారికి దుస్తులు కప్పారు. నామినేషన్‌ దాఖలు చేయకుండా వారిని నిలిపేశారు. దీంతో ఆ ఇద్దరు రైతులతో పాటు మరికొందరు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.

ధర్నాలో పాల్గొన్న 16 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నగ్నంగా వచ్చిన ఇద్దరు రైతు నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా, కేంద్రం తీరుపై రైతు నాయకుడు అయ్యాకన్ను మండిపడ్డారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో కేంద్ర మంత్రి అమిత్‌షా రైతుల సంఘాలను ఢిల్లీకి పిలిపించి రూ.6 వేలు పింఛన్‌ రైతులందరికీ ఇస్తామని, రైతులు పండించే పంటలకు రెండింతలు ఇస్తామని, గోదావరి-కావేరి నదులను అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.

అయితే ఇంతవరకు అవేవీ అమలు కాలేదన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించలేదన్నారు. దీనికి తోడు రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ తిరువణ్ణామలైలో బీజేపీ పోటీ చేసే నియోజకవర్గంలో పోటీచేయాలని నిర్ణయించుకున్నామని రైతులు తెలిపారు. ఇందులో భాగంగానే నగ్నంగా నామినేషన్‌ వేసేందుకు వచ్చినట్లు వివరించారు. కాగా, నామినేషన్ వేయకుండా తమను అడ్డుకోవడం కరెక్ట్ కాదని అయ్యాకన్ను అన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతుల డిమాండ్లను నెరవేర్చడంలో విఫలమైందన్నారు.