New Political Party : కొత్త పార్టీ పెట్టిన రైతు ఉద్యమనేత..117 స్థానాల్లో పోటీ

రైతు సంఘం నేత గుర్నామ్‌ సింగ్‌ కొత్త పార్టీ పెట్టారు.. వచ్చే ఏడాది పంజాబ్‌లో జరగనున్న పంజాబ్ ఎన్నికల్లో తమ పార్టీ బరిలో ఉంటుందని ఆయన తెలిపారు.

New Political Party : కొత్త పార్టీ పెట్టిన రైతు ఉద్యమనేత..117 స్థానాల్లో పోటీ

New Political Party

New Political Party : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదికి పైగా ఉద్యమం కొనసాగిన విషయం తెలిసిందే. రైతు ఉద్యమానికి దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం చట్టాలను వెనక్కు తీసుకుంది. అయితే ఈ రైతు ఉద్యమానికి వెన్నుకుక్కగా ఉంది రైతు సంఘాలే. రైతులకు వసతులు ఏర్పాటు చేయడం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ర్యాలీలు, ఎర్రకోట ముట్టడి వంటి కార్యక్రమాలను రైతు సంఘాల నేతలు ముందుండి నడిపారు.

చదవండి :  Farm Laws Repeal : సాగు చట్టాల రద్దు బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం

ఏడాదికి పైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులతోనే ఉంటూ వారిలో ఉద్యమ స్ఫూర్తి తగ్గకుండా కేంద్రప్రభుత్వం దిగొచ్చేలా చేయడంలో రైతు సంఘాల పాత్ర కీలకం. రైతు ఉద్యమ ముఖ్య నేతల్లో ఒకరైన గుర్నామ్‌ సింగ్‌ చదుని.. కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు.. ‘సంయుక్త సంఘర్షణ మోర్చా’ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు గుర్నామ్‌ సింగ్‌ ప్రకటించారు.

చదవండి : Farm Laws Repeal bill : 750 మంది రైతులకు నివాళి..రాకేష్ టికాయత్

వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ అన్ని స్థానాల్లో బరిలోకి దిగనుంది. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన గుర్నామ్‌ సింగ్‌ చదుని స్వచ్ఛ రాజకీయాలు, మంచినేతలను ప్రోత్సహించడమే తమ పార్టీ లక్ష్యమని వెల్లడించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మత్తు పదార్థం ఓపియం తయారీలో వాడే గసగసాల సాగును ప్రోత్సహిస్తామన్నారు. ఈ పంట సాగుతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాల్లో పోటీకి సిద్ధమని ప్రకటించారు గుర్నామ్‌ సింగ్‌ చదుని.

చదవండి : New Farm Laws: కేంద్రంపై రైతుల ఉద్యమానికి ఏడాది పూర్తి