Updated On - 10:18 am, Mon, 30 November 20
By
sreehariFarmers continue protest for 5th day : సెప్టెంబరులో అమల్లోకి వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఐదవ రోజు నిరసనలు చేస్తున్నారు.
రెండవ రోజు ఢిల్లీ సరిహద్దుల చుట్టూ బురారీ గ్రౌండ్‌కు వెళ్లాలనే కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించారు.
ఢిల్లీలోని బురారి మైదానానికి వెళ్లాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన తరువాత రైతులు ఢిల్లీ-ఖాజీపూర్ సరిహద్దులో ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానాకు చెందిన అన్నదాతలు చేపట్టిన చలో ఢిల్లీ నిరసన కార్యక్రమాలు ఐదో రోజు కూడా హోరెత్తాయి.
రెండవ రోజు ఢిల్లీ సరిహద్దుల చుట్టూ బురారీ గ్రౌండ్‌కు వెళ్లాలనే కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించారు.
ఢిల్లీలోని బురారి మైదానానికి వెళ్లాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన తరువాత రైతులు ఢిల్లీ-ఖాజీపూర్ సరిహద్దులో నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, టిక్రి వద్ద ఆందోళన చేస్తున్న రైతులు అక్కడి నుంచి కదిలేందుకు నిరాకరించారు.
చర్చలకు కేంద్ర ప్రభుత్వం పలు షరతులు విధించడంపై మండిపడ్డారు. ఇలాంటి షరతులతో కేంద్రం రైతులను అవమానిస్తోందన్నారు.
సరిహద్దుల నుంచే తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని, హస్తినకు వెళ్లే ఐదు ప్రధాన మార్గాలను మూసివేస్తామని హెచ్చరించారు.
కేంద్రం వైఖరిని నిరసిస్తూ టైర్లను తగులబెట్టారు. డిసెంబరు 3న షరతుల్లేకుండా తమతో చర్చలకు రావాలని రైతు సంఘాల నేతలు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు.
నిరసన చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించిన బురారీ మైదానాన్ని ఓపెన్ ఎయిర్ జైలుతో పోల్చారు రైతులు.
ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఢిల్లీకి నలువైపులా ఉన్న రోడ్లను ముట్టడిస్తామని ప్రకటించి అమల్లో పెట్టారు.
రోడ్లపైనే ఉండి నిరనస తెలిపేందుకు వీలుగా ఎక్కడిక్కడ బస, వంట ఏర్పాట్లు చేసుకుంటున్నారు రైతులు. చలో ఢిల్లీ నిరసనల కోసం జంతర్‌మంతర్ మైదానాన్ని కేంద్రం కేటాయించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో అధికారులు కేటాయించిన బురారీలోని సంత్ నిరంకారీ మైదానంలో శాంతియుత నిరసనలు చేపట్టాలని, ఉద్యమకారులు మైదానానికి చేరుకోగానే ప్రభుత్వం వారితో చర్చలు జరుపుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రైతులకు విజ్ఞప్తి చేశారు.
దీనిపై రైతు సంఘాల నాయకులు భగ్గుమన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని… అయితే షరతులు పెట్టడాన్ని మాత్రం అంగీకరించే ప్రసక్తే లేదని రైతు సంఘాల నాయకులు తేల్చి చెప్పారు.
రైతుల డిమాండ్లను ప్రభుత్వం నిజంగా నెరవేర్చాలనుకుంటే షరతులు పెట్టడమేంటని ప్రశ్నించారు. ఉద్యమకారులు బురారీ మైదానానికి వెళ్లాలని కేంద్రం మరోసారి కోరింది.
కేంద్రమంత్రులతో కూడిన ఉన్నతస్థాయి బృందం రైతు సంఘాల నాయకులతో విజ్ఞాన్‌భవన్‌లో చర్చిస్తుందని తెలిపింది.
రైతులు బురారీ మైదానానికి వెళ్లడానికి ససేమిరా అంటుండడంతో… కేంద్ర మంత్రులు రాత్రి కీలక సమావేశం నిర్వహించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో సమావేశమయ్యారు. కేంద్రహోంమంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తోపాటు ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు.
సమస్య మరింత తీవ్రం కాకుండా ఏం చేయాలనే అంశంపై చర్చించారు. డిసెంబరు 3 వరకు వేచి ఉండాలా లేక అంతకంటే ముందుగానే రైతులతో సంప్రదింపులు జరపాలా అనే అంశంపై మంత్రుల సమావేశంలో చర్చించారు.
ఆందోళన ఎక్కువ కాలం కొనసాగడం వల్ల శాంతిభధ్రత సమస్య తలెత్తే అవకాశం ఉండటం వల్ల హోం, రక్షణ మంత్రులు ఈ భేటీలో కీలక సూచనలు చేశారు.
దీంతో పాటు రైతులు కోరుతున్న విధంగా నూతన చట్టంలో ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉందా అనే అంశాలను పరిశీలించారు
YSR Sunna Vaddi : రైతుల ఖాతాల్లోకి రూ.128కోట్లు.. సున్నా వడ్డీ రాయితీని జమ చేసిన సీఎం జగన్
Heavy Rains : రైతన్నను ముంచిన అకాల వర్షాలు
ఒక్కొక్కరికి రూ.7,500.. మే 13న వారి ఖాతాల్లోకి డబ్బులు
Parabolic Solar Dryer : ఇక పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎంచక్కా ఎండబెట్టుకుని తినొచ్చు.. సోలార్ డ్రయ్యర్ వచ్చేసింది..
Lemon Crop : కరోనా ఎఫెక్ట్.. 100 కిలోలకు రూ.12వేలు, ఆనందంలో నిమ్మ రైతులు
PM Kisan : రైతులకు ఖాతాల్లోకి పీఎం కిసాన్ 8వ విడత డబ్బులు.. డేట్ పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం