Farmers protest: సెప్టెంబర్ 25న భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన సంయుక్త కిసాన్ మోర్చా

వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు జరుపుతున్న ఆందోళన.. సెప్టెంబర్ 25తో పది నెలలు పూర్తి కావొస్తుంది.

Farmers protest: సెప్టెంబర్ 25న భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన సంయుక్త కిసాన్ మోర్చా

Farmer Protests

Farmers protest: వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు జరుపుతున్న ఆందోళన.. సెప్టెంబర్ 25తో పది నెలలు పూర్తి కావొస్తుంది. ఈ మేరకు ఆదివారం కీలక ప్రకటనలో సంయుక్త కిసాన్ మోర్చా సెప్టెంబర్ 25న భారత్ బంద్ నిర్వహించాలంటూ పిలుపునిచ్చింది.

హర్యానా వేదికగా జరిగిన కిసాన్ మహాసభలో ఎస్కేఎమ్ లీడర్ దర్శన్ పాల్ సింగ్.. దక్షిణ హర్యానా-మేవట్ రైతులంతా ఢిల్లీని బ్లాక్ చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఎస్కేఎమ్ త్వరలోనే ఢిల్లీని చుట్టుముట్టేందుకు పిలుపునిస్తుంది. సెప్టెంబర్ 5న మిషన్ యూపీని కూడా ప్రకటిస్తాం. ప్రతి తహసీల్, గ్రామ పరిధిలో ఎస్కేఎమ్ యూనిట్లు ఏర్పాట్లు చేయాలి’ అన్నారు.

రైతు నాయకుడు యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 5న జరిగే ముజఫర్ నగర్ మహాపంచాయత్ దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఒక పరీక్షలాంటిది అన్నారు. దాంతో పాటు మేవట్ రైతులంతా ఉత్తరప్రదేశ్ చేరుకుని కావాల్సిన ఏర్పాట్లు చూడాలని కోరారు.