Farmers Protest : ఇళ్లకు తిరిగి వెళ్లే ఏర్పాట్లలో రైతులు..ఉద్యమం ముగిసినట్లేనా!

రైతుల ఉద్యమం భవిష్యత్‌ కార్యాచరణపై మంగళవారం ఉదయం 11గంటలకు సంయుక్త కిసాన్ మోర్చా(SKM)కీలక సమావేశం నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ కీలక సమావేశానికి ముందే ఇవాళ

Farmers Protest : ఇళ్లకు తిరిగి వెళ్లే ఏర్పాట్లలో రైతులు..ఉద్యమం ముగిసినట్లేనా!

Farmers Protest :  రైతుల ఉద్యమం భవిష్యత్‌ కార్యాచరణపై మంగళవారం ఉదయం 11గంటలకు సంయుక్త కిసాన్ మోర్చా(SKM)కీలక సమావేశం నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ కీలక సమావేశానికి ముందే ఇవాళ సింఘా బోర్డర్ లో ఏడాదికిపైగా ఆందోళన చేస్తోన్న రైతులు తమ తమ ఇళ్లకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో పంజాబ్ రైతులు ఇళ్లకు తిరిగివెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.

కాగా,నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన రైతులు వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో గత ఏడాది నవంబర్‌ 26 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. డిమాండ్లలో ప్రధానమైన మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసింది. పార్లమెంట్ వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుని ఆమోదించిన మరుసటి రోజే రాష్ట్రపతి కూడా ఆ బిల్లుపై సంతకం చేశారు.

అయితే తమ మిగతా డిమాండ్లను సైతం నెరవేర్చాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. తమ డిమాండ్లను కేంద్రం నెరవేర్చేవరకు ఉద్యమం ఆపేది లేదని రైతు సంఘాల నేతలు ఇప్పటికే తేల్చి చెప్పారు. కేసుల ఉపసంహరణ, ఎంఎస్‌పీపై చట్టపరమైన హామీతో సహా సమస్యల పరిష్కారానికి రాతపూర్వక హామీ కోరుకుంటున్నట్లు రైతు నాయకులు చెబుతున్నారు.

ఈ క్రమంలో శనివారం(డిసెంబర్-4,2021) సంయుక్త కిసాన్ మోర్చా(SKM).. ఎంఎస్‌పీ, వ్యవసాయ చట్టాల రద్దుకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై కేసుల ఉపసంహరణ సహా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రైతు నాయకులు- బల్బీర్‌సింగ్‌ రాజేవాల్‌, అశోక్‌ ధావ్లే, శివకుమార్‌ కక్కా, గుర్నామ్‌ సింగ్‌, యుధ్వీర్‌ సింగ్‌లను కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వంతో అనధికారిక చర్చలు జరిగాయని..ఆందోళన ముగింపుకు పరిష్కారం కోసం ఇకపై అధికారికంగా ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయని ఓ రైతు నేత తెలిపారు.

ALSO READ Nagaland Encounter : పౌరులపై ఆర్మీ కాల్పులకు కారణాలేంటో చెప్పిన అమిత్ షా