NHRC : రైతుల ఆందోళన..కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేంద్రంతోపాటు యూపీ, రాజస్థాన్,ఢిల్లీ, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలకు మంగళవారం నోటీసులు జారీ చేసిం

10TV Telugu News

NHRC నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేంద్రంతోపాటు యూపీ, రాజస్థాన్,ఢిల్లీ, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. రైతుల నిరసనలపై జాతీయ మానవహక్కుల కమిషన్ కు పలు ఫిర్యాదులు రావడంతో దీనిపై తగు చర్యలు తీసుకొని నివేదికలు సమర్పించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ జారీ చేసిన నోటీసుల్లో ఆదేశించింది.

యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ ప్రభుత్వ ఎన్‌సిటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు డైరెక్టర్లు, యూపీ, హర్యానా, రాజస్థాన్ కమిషనర్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది.

రైతుల ఆందోళనల కారణంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి చాలాదూరం ప్రయాణించాల్సి వస్తుందని ప్రజలు ఆరోపించారు. రాష్ట్ర సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు ప్రయాణికులు, రోగులు, దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. రైతుల నిరసనలతో 9వేల కంటే ఎక్కవ చిన్న, మధ్యతరహా, పెద్ద కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది.

READ Mamata Banerjee : హిందీలో మమత ట్వీట్..మండిపడుతున్న అభిమానులు

10TV Telugu News