Farmers Protests : యథావిధిగా రైతు నిరసనలు..పలు డిమాండ్లతో మోదీకి లేఖ

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయనున్నట్లు శుక్రవారం ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఇవాళ(నవంబర్-21,2021) సింఘు సరిహద్దులో సంయుక్త కిసాన్​ మోర్చా నేతలు

Farmers Protests : యథావిధిగా రైతు నిరసనలు..పలు డిమాండ్లతో మోదీకి లేఖ

Rajewal

Farmers Protests  నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయనున్నట్లు శుక్రవారం ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఇవాళ(నవంబర్-21,2021) సింఘు సరిహద్దులో సంయుక్త కిసాన్​ మోర్చా నేతలు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. గతంలో నిర్ణయించిన కార్యక్రమాలు, ఆందోళనలు యథావిధిగా కొనసాగించాలని ఈ సమావేశంలో రైతు నేతలు నిర్ణయించారు.

ఈనెల 22న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కిసాన్​ పంచాయత్​, 26న అన్ని సరిహద్దుల్లో రైతుల సమావేశం, 29న పార్లమెంట్​కు ట్రాక్టర్లలో ర్యాలీగా తరలివెళ్లటం యథావిధిగా కొనసాగుతుందని రైతు నేత బల్బీర్​ సింగ్​ రజెవాల్​ స్పష్టం చేశారు. సాగు చట్టాల రద్దును స్వాగతిస్తున్నామని, అయితే చాలా విషయాలు పెండింగ్​లో ఉన్నాయని బల్బీర్​ సింగ్​ అన్నారు.

పెండింగ్​లో ఉన్న రైతుల డిమాండ్లపై మోదీకి బహిరంగ లేఖ రాయనున్నట్లు బల్బీర్​ సింగ్​ చెప్పారు. MSP కమిటీ, విద్యుత్తు బిల్లు 2020, రైతులపై కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లతో మోదీకి లేఖ రాయనున్నట్లు చెప్పారు. లఖింపుర్​ ఖేరి హింస కేసులో భాగంగా కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్​ చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఈనెల 27న మరోమారు సమావేశం అవుతామని ఆయన తెలిపారు.

కనీస మద్దతు ధర(MSP)​ చట్టం కోసం మహాపంచాయత్​లో పాల్గొనేందుకు ఛలో లక్నో చేపడుతున్నట్లు భారతీయ కిసాన్​ యూనియన్​ జాతీయ ప్రతినిధి రాకేశ్​ టికాయత్ తెలిపారు. వ్యవసాయ సంస్కరణలపై కేంద్రం చెప్పేవన్నీ ఉట్టి మాటలే.. వాటి వల్ల రైతుల పరిస్థితి ఏమి మారదు.. కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టం తీసుకొచ్చినప్పుడే అతిపెద్ద సంస్కరణ అని టికాయత్ అన్నారు.

ALSO READ Fire Accident : పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు