Ghazipur Border : సుప్రీం సూచనతో రహదారులు ఖాళీ చేస్తున్న రైతులు

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా మరియు పశ్చిమ ఉత్తర ప్రదేశ్ కు చెందిన వేలాది మంది రైతులు

Ghazipur Border : సుప్రీం సూచనతో రహదారులు ఖాళీ చేస్తున్న రైతులు

Farmers (1)

Ghazipur Border  కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా మరియు పశ్చిమ ఉత్తర ప్రదేశ్ కు చెందిన వేలాది మంది రైతులు గతేడాది నవంబర్ నుండి ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు,టిక్రి మరియు ఘజిపూర్ వద్ద ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఇవాళ ఘాజీపూర్ సరిహద్దు వద్ద నిరసన తెలుపుతున్న రైతులు..పబ్లిక్ వెహికల్స్ రాకపోకలను అనుమతిస్తూ ఫ్లైఓవర్ క్రింద సర్వీస్ రోడ్డులోని ఒక భాగాన్ని ఖాళీ చేస్తున్నారు. ఘజియాబాద్ నుండి ఢిల్లీకి కలిపే ఈ సర్వీస్ లేన్ భాగంపై రైతులు మీడియా సెంటర్‌ను రైతులు నిర్మించిన విషయం తెలిసిందే. అయితే రైతులు ఇప్పుడు ఈ సర్వీస్ రోడ్డుని ఖాళీ చేసిన నేపథ్యంలో ఇకపై రైతులు ఫ్లైఓవర్ ఎగువ భాగంలో మాత్రమే కూర్చొని తమ ధర్నాను కొనసాగించనున్నారు.

అంతకుముందు, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న నిరసనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు అక్కడి నుంచి వెళ్లేలా చేయాలని దాఖలైన పిటిషన్​పై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు…దీనిపై స్పందించాలని రైతు సంఘాలకు మూడు వారాల సమయమిచ్చింది. ఈ సందర్భంగా రైతులకు నిరసన తెలిపే హక్కు ఉందని, కానీ నిరవధికంగా రోడ్లను నిర్బంధించకూడదని కోర్టు స్పష్టం చేసింది.

నిరసన తెలిపే హక్కుకు తాము వ్యతిరేకం కాదని పేర్కొన్న న్యాయస్థానం.. కోర్టులో సమస్య పెండింగ్​లో ఉన్నప్పటికీ, రహదారులను నిరవధికంగా నిర్బంధించడం సరికాదని వ్యాఖ్యానించింది. రోడ్లపై వెళ్లే హక్కు ప్రజలకూ ఉంటుందని ధర్మాసనం సృష్టం చేసింది. అనంతరం విచారణను డిసెంబర్ 7కు వాయిదా వేసింది. కాగా,వ్యవసాయ చట్టాలకు సంబంధించి రైతులు మరియు ప్రభుత్వం మధ్య 10 రౌండ్లకు పైగా చర్చలు ప్రతిష్టంభనను తొలగించడంలో విఫలమయ్యాయి.

ALSO READ Mirage-2000 Crash..కుప్పకూలిన శిక్షణ విమానం