Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఫారూఖ్ అబ్దుల్లా.. రాహుల్‭తో కలిసి నడక

రాహుల్ చేపట్టిన ఈ యాత్ర మొత్తానికి 3,000 కిలోమీటర్ల మైలు రాయిని ఈరోజే చేరుకుంది. దేశంలో కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టడంతోనే ఈ ఘనత సాధించారు రాహుల్. భారత్ జోడో యాత్ర మొదటి విడతగా చెప్తున్న ప్రస్తుత యాత్ర దాదాపు ముగింపుకు వచ్చినట్టే కనిపిస్తోంది. జమ్మూ కశ్మీర్‭లో సాగే పర్యటన వివరాలు సైతం మంగళవారం విడుదలయ్యాయి. ఇక రెండవ విడత గురించిన వివరాలు ఇది ముగియగానే విడుదల చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఫారూఖ్ అబ్దుల్లా.. రాహుల్‭తో కలిసి నడక

Farooq Abdullah joins Rahul Gandhi's Bharat Jodo Yatra

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ ఫారూఖ్ అబ్దుల్లా పాల్గొన్నారు. మంగళవారం ఈ యాత్ర ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించిన సందర్భంలోనే ఫారూఖ్ పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఈ యాత్రలో కొంత దూరం పాటు రాహుల్‭తో ఫారూఖ్ కలిసి నడిచారు. యాత్రలోకి ప్రవేశించగానే కౌగిళించుకుని స్వాగతం పలికారు రాహుల్. ప్రియాంక గాంధీ వాద్రా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సహా పలువురు విపక్ష నేతలు భారత్ జోడో యాత్రకు సంఘీభావం పలుకుతున్నారు. వాస్తవానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సాగే యాత్రలో పాల్గొనాల్సిందిగా బీఎస్పీ సుప్రెమో మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‫‭లకు రాహుల్ లేఖ ద్వారా ఆహ్వానం పంపినప్పటికీ, వారు సముఖంగా స్పందించలేదు.


Supreme Court: సినిమా హాళ్లకు బయటి ఫుడ్ తీసుకెళ్లొచ్చా.. సుప్రీం కోర్టు తీర్పు ఇదే!

ఇక రాహుల్ చేపట్టిన ఈ యాత్ర మొత్తానికి 3,000 కిలోమీటర్ల మైలు రాయిని ఈరోజే చేరుకుంది. దేశంలో కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టడంతోనే ఈ ఘనత సాధించారు రాహుల్. భారత్ జోడో యాత్ర మొదటి విడతగా చెప్తున్న ప్రస్తుత యాత్ర దాదాపు ముగింపుకు వచ్చినట్టే కనిపిస్తోంది. జమ్మూ కశ్మీర్‭లో సాగే పర్యటన వివరాలు సైతం మంగళవారం విడుదలయ్యాయి. ఇక రెండవ విడత గురించిన వివరాలు ఇది ముగియగానే విడుదల చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

Karnataka: ఎన్నికలలోపు మాజీ సీఎం జైలుకు వెళ్తారంటూ హెచ్చరించిన బీజేపీ చీఫ్