IPL 2021 Fever : IPL మ్యాచ్ లు చూపించాలంటూ జైల్లో ఖైదీలు నిరాహార దీక్ష

IPL 2021 Fever  : IPL మ్యాచ్ లు చూపించాలంటూ జైల్లో ఖైదీలు నిరాహార దీక్ష

Ipl Fever

IPL Fever : IPL మొదలైందంటే క్రికెట్ ప్రేమికులకు ఇంకేమీ పట్టదు. ఎంత ఇంపార్టెంట్ పనులు ఉన్నా మానేసి మరీ టీవీలకు అతుక్కుపోతుంటారు. రెప్ప వేస్తే ఏం మిస్ అవుతామోనని ఉత్కంఠగా చూస్తుంటారు. కరోనా కూడా IPLను అడ్డుకోలేకపోయింది. ప్రపంచానికే స్టాప్ బోర్డు చూపించిన కరోనా మహమ్మారి పప్పులు IPL ముందు ఉడకలేదు. ప్రేక్షకులు స్టేడియంకు వెళ్లి మ్యాచ్ లు చూడకపోయినా చక్కగా ఇంట్లో కూర్చునే IPLను ఎంజాయ్ చేస్తున్నారు. ఆఫీసులకు సెలవులు పెట్టి..ఆఖరికి ఓట్లు వేయటానికి కూడా వెళ్లకుండా IPL మ్యాచ్ లు చూడటానికి టీవీలకు అతుక్కుపోయి కూర్చుంటున్నారు. ఈ IPL Fever ఎంతగా ఉందంటే జైల్లో ఖదీలు కూడా IPL మ్యాచ్ చూడాల్సిందే..మాకు చూపించాల్సిందని డిమాండ్ చేసేంత..!! IPL మ్యాచ్ లకు చూపించాలంటూ జైల్లో ఖైదీలు నిరాహార దీక్షకు దిగారంటూ IPL Fever ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచ క్రికెట్ ప్రేమికులకు అత్యంత ఇష్టమైన లీగ్. మ్యాచ్ లు స్టేడియంలోని చూడక్కర్లేదు.. ఇంట్లో కూచుని చూడొచ్చు అనే పాయింట్ మీద ప్రత్యక్ష ప్రేక్షకులు లేకుండా..లైవ్ తో ఐపీఎల్ అదరగొట్టేస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ లు మొదలయ్యాయంటే అన్ని టీవీ ప్రోగ్రామ్ ల కార్యక్రమాలు, సీరియల్స్ రేటింగ్స్ పడిపోవాల్సిందే. ఐపీఎల్ ఫీవర్ ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్ని పట్టి కుదిపేస్తోంది.

ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ లో ఓ జైలులో ఖైదీలు తమకు ఐపీఎల్ మ్యాచ్ లు చూసేలా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫతేగడ్ కేంద్ర కారాగారంలో ఖైదీలు నిరాహార దీక్షకు దిగారు. ఈ డిమాండ్ తో ఉదయం టిఫిన్ చేయకుండా జైలు ఆవరణలో బైఠాయించారు. దీంతో ఏం చేయాలో తెలీక జైలు సిబ్బంది బుర్రలు గోక్కుంటున్నారు. ఖైదీలు చేసే నిరాహార దీక్షతోను..వాళ్లు చేసే స్లోగన్స్ తో జైల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సరిగ్గా ఇదే సమయానికి జైలు సూపరింటెండెంట్ ప్రహ్లాద్ శుక్లా లక్నోలో అధికారులతో సమావేశంలో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఆయన వెంటనే జైలు వద్దకు చేరుకుని ఖైదీలతో చర్చలు జరిపారు. మొత్తమ్మీద వారితో జరిగిన చర్చల్లో ఒక పరిష్కారం దొరికింది. ఖైదీల డిమాండ్లకు జైలు అధికారులు అంగీకరించారు. దీంతో ఖైదీలు తమ దీక్షను విరమించారు. అంటే జైల్లో ఖైదీలు కూడా IPL మ్యాచ్ లు చూస్తారన్నమాట..! అదీ IPL కు ఉండే క్రేజ్, అదీ IPL Fever అంటే..!!