డిసెంబర్ 1 నుంచి టోల్ ప్లాజాల మోత : FASTags ఛార్జీలు, ప్రయోజనాలివే?

  • Published By: sreehari ,Published On : November 19, 2019 / 11:58 AM IST
డిసెంబర్ 1 నుంచి టోల్ ప్లాజాల మోత : FASTags ఛార్జీలు, ప్రయోజనాలివే?

దేశంలో జాతీయ రహదారుల్లో టోల్ ప్లాజాలపై డిజిటల్ మోత మోగనుంది. డిసెంబర్ 1 నుంచి FASTags (ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్) కొత్త విధానం అమల్లోకి వస్తోంది. ఇప్పుడంతా అంతా డిజిటల్ మయం కానుంది. నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (NETC) ప్రొగ్రామ్ కింద డిజిటల్ పేమెంట్స్ జరుగనున్నాయి.

ఇక నుంచి FASTags ద్వారా మాత్రమే టోల్ పేమెంట్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇతర మోడ్ ద్వారా టోల్ పేమెంట్ చేస్తే మాత్రం రెట్టింపు టోల్ ఫీజులు చెల్లించాల్సి వస్తుంది జాగ్రత్త. అన్ని జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల దగ్గర FASTags ద్వారా పేమెంట్స్ జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

వాహనాల రద్దీని నియంత్రించడమే కాకుండా నగదురహిత చెల్లింపులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. రాష్ట్రాల వ్యాప్తిగా అన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టోల్ ప్లాజాల్లో ఈ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ మెథడ్ త్వరలో అమలు చేయాలని ప్రతినిధి అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

FASTags యాక్సస్ చేసేందుకు వీలుగా హైబ్రిడ్ లేన్ ఒకటి అన్ని టోల్ ప్లాజాల్లో ఉంచనుంది. FASTagsతో ఇతర పేమెంట్స్ మోడ్ ద్వారా టోల్ ఫీజులు చెల్లించవచ్చు. కానీ ఒక షరతు.. ఇలా పేమెంట్స్ చేస్తే.. అసలు టోల్ ఫీజు కంటే రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది. 

1. FASTag అంటే ఏంటి? :
FASTag అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) ద్వారా పనిచేస్తుంది. NHAI టోల్ ప్లాజాలకు అనుసంధానమై ఉండి ఆటోమాటిక్ టోల్ ఛార్జీలు విధించేలా సెట్ చేస్తారు. ఈ ట్యాగ్.. మీ వాహనం ప్రీపెయిడ్ లేదా సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంటుకు అనుసంధానమై ఉంటుంది. కానీ, ఒకవేళ ప్రీపెయిడ్ అకౌంటుకు లింక్ అయితే.. అవసరాన్ని బట్టి వాహనదారులు రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకసారి Tag అకౌంట్ యాక్టివేట్ అయ్యాక మీ వాహనం వైడ్ స్ర్కీన్ పై ఒక ట్యాగ్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా టోల్ ప్లాజాల మీదుగా వెళ్లే సమయంలో ఎక్కడా ఆగాల్సిన అవసరం ఉండదు. 

2. FASTag ఎందుకంత ముఖ్యమంటే? :
* డిసెంబర్ 1, 2019 నుంచి అన్ని వాహనాలకు FASTags తప్పనిసరి చేసింది ప్రభుత్వం. 
* FASTag మెథడ్ అనుసరించని వాహనదారులు టోల్ ఫీజు డబుల్ చెల్లించాల్సి ఉంటుంది.
* మీ ట్యాగ్ లో తగినంత అమౌంట్ లేకున్నా.. మీ వాహనం బ్లాక్ లిస్టులోకి వెళ్తుంది. 
* మళ్లీ అదే చేస్తే.. వాహనం ట్యాగ్ నెంబర్‌పై డబుల్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. 

3. మీ వాహనానికి FASTag ఎలా పొందాలంటే?
* రాష్టాల్లో లేదా ఏజెన్సీలు నుంచి అయినా FASTag పొందవచ్చు.
* మీ వాహనానికి  ఏదైనా టోల్ ప్లాజాల నుంచి FASTag రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
* నేషనల్ ఎలక్ట్రానిక్ టోల కలెక్షన్ మెంబర్ బ్యాంకు నుంచి కూడా ఈ ట్యాగ్ పొందవచ్చు.
* మీ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. 
* మీ పాస్‌పోర్టు సైజు ఫొటో, అడ్రస్ ప్రూఫ్, ఒరిజినల్, KYC డాక్యుమెంట్లు ఉండాలి.
* అన్ని వివరాలతో POS (పాయింట్ ఆఫ్ సేల్/ సేల్స్ ఆఫీసు) సిద్ధంగా ఉండాలి.

4. FASTags ఛార్జీలు ఎలా?
* జారీ చేసిన బ్యాంకు / ఏజెన్సీ వన్ టైం జాయినింగ్ ఫీజు కింద రూ.200 చెల్లించాలి. 
* మీ వాహనం రకాన్ని బట్టి FASTags ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్ రిఫండ్ నిర్ణయిస్తారు.
* ఏజెన్సీల అధికారిక వెబ్ సైట్లో ఫీజు వివరాలను వాహనదారులు చెక్ చేసుకోవచ్చు.

5. FASTagsతో ప్రయోజనాలేంటి? : 
* FASTags ద్వారా టోల్ ప్లాజాల దగ్గర టోల్ పేమెంట్స్ చేస్తే ఆఫర్లు పొందవచ్చు.
* FASTags పేమెంట్స్ చేసే వాహనదారులకు ప్రభుత్వం 2.5 శాతం Cash Back ఆఫర్లు.
* FASTagsతో వాహన రద్దీని తగ్గించడం.. గంటల కొద్ది నిలపాల్సిన అవసరం లేదు. 

6. రెండు వాహనాలకు ఒక FASTag వాడొచ్చా? :
* లేదు.. FASTags మెథడ్.. వాహనాలకు ప్రత్యేకం.
* ఒకసారి వాహనానికి ట్యాగ్ ఫిక్స్ చేస్తే మరో వాహనానికి బదిలీ కుదరదు.
* ఒకవేళ వాహనం కోల్పోతే.. కస్టమర్ కేర్ నెంబర్ కు కాల్ చేయాల్సి ఉంటుంది.
* FASTag జారీ చేసిన ఏజెన్సీ ద్వారా బ్లాక్ చేయాల్సి ఉంటుంది.