జనవరి 01 నుంచి ఫోర్ వీలర్లకు FASTags తప్పనిసరి

  • Published By: madhu ,Published On : November 9, 2020 / 11:48 AM IST
జనవరి 01 నుంచి ఫోర్ వీలర్లకు FASTags తప్పనిసరి

FASTags mandatory for all four-wheelers : దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఫాస్టాగ్‌ అమల్లోకి రానుంది. అన్ని రకాల ఫోర్‌ వీలర్లకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేయడంతో మరోసారి పొడిగింపు కోసం ఎదురుచూసిన వాహనదారులు నిరాశకు గురయ్యారు. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో గతంలో మినహాయింపు పొందిన పాత వాహనాలు కూడా తప్పనిసరిగా ఫాస్టాగ్‌ తీసుకోవాల్సిందే. రవాణా వాహనాలకు ఫాస్టాగ్‌ పునరుద్దరించిన తర్వాతే ఫిట్‌మెంట్‌ సర్టిఫికెట్‌ జారీ చేయడం తప్పనిసరి చేసింది. కాబట్టి ఇకపై ప్రతి నాలుగు చక్రాల వాహనం ఫాస్టాగ్ చేయించుకోవాల్సిందే.



ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేసిన అనంతరం వాహనానికి సంబంధించిన వివరాలను ఎంట్రీ చేయాలి. ఇందుకోసం ఫాస్ట్ ట్యాగ్ యాప్‌ని డౌన్ లోడ్ చేసుకోవాలి.
ఫాస్టాగ్ అనేది వాహనం ముందట అద్దంపై అతికించబడుతుంది. ఇది RFID టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది.
మీ బ్యాంకు ఖాతా నుంచి నేరుగా లేదా ఫాస్ట్ ట్యాగ్ లింక్డ్ వాలెట్ నుంచి నగదు రహిత చెల్లింపులు జరుగుతాయి.



https://10tv.in/fastags-mandatory-to-all-four-wheeler-from-next-year-of-1-january-2021/
టోల్ గేట్ దాటిన అనంతరం సంబంధిత ఫోన్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది.
ఫాస్ట్ ట్యాగ్ కొనసడానికి బ్యాంకు శాఖకు వెళ్లవచ్చు. రోడ్ ట్రాన్స్ పోర్టు కార్యాలయాలు, బ్యాంకులు ఏర్పాటు చేసిన స్టాల్స్, ఇతర ప్రాంతాల్లో ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్, పేటీఎం ఆన్ లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. అది మీ బ్యాంక్ ఖాతాకు అనుసంధానించబడుతుంది. బ్యాంకు ఖాతాలో సరిపడ బ్యాలెన్స్ మాత్రం మెయింటేన్ చేయాల్సి ఉంటుంది.



ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేయడానికి రూ. 250 సెక్యూర్టీ డిపాజిట్, రూ. 100 వన్ టైమ్ ట్యాగ్ జాయినింగ్ ఫీజు వర్తిస్తుంది.
ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేసిన అనంతరం వాహనానికి సంబంధించిన వివరాలను ఎంట్రీ చేయాలి. ఇందుకోసం ఫాస్ట్ ట్యాగ్ యాప్‌ని డౌన్ లోడ్ చేసుకోవాలి.
టోల్ ఫీజు వేర్వేరు వాహనాలకు భిన్నంగా ఉంటుంది.
వాలెడిటీ ఐదేళ్లు ఉంటుంది. ఒక్కసారి తీసుకుంటే..ఐదు సంవత్సరాలు బేఫికర్.
బ్యాంకు ఖాతాకు బదులుగా డిజిటల్ వాలెట్‌ను ఉపయోగించుకొనే స్వేచ్చ ఉంటుంది.