భారత్‌లో వేగంగా విస్తరిస్తోన్న కరోనా…15 రాష్ట్రాల్లో 114 కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకు  పెరుగుతోంది. ప్రస్తుతం ఈ సంఖ్య 114కి పెరిగింది.

  • Published By: veegamteam ,Published On : March 17, 2020 / 02:16 AM IST
భారత్‌లో వేగంగా విస్తరిస్తోన్న కరోనా…15 రాష్ట్రాల్లో 114 కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకు  పెరుగుతోంది. ప్రస్తుతం ఈ సంఖ్య 114కి పెరిగింది.

భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకు  పెరుగుతోంది. ప్రస్తుతం ఈ సంఖ్య 114కి పెరిగింది. ఇప్పటివరకు దేశంలోని 15 రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, హర్యాణా, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, జమ్మూకశ్మీర్, లడాఖ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి.  ఇప్పటివరకు నమోదైన కేసుల్లో మహారాష్ట్రకు చెందినవే అధికంగా ఉన్నాయి. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్టం మహారాష్ట్ర కాగా… 22 కేసులతో కేరళ రెండో స్థానంలో ఉంది.

మహారాష్ట్రలో 38 కేసులు 
మహారాష్ట్రలో తాజాగా మరో నలుగురికి కరోనా సోకడంతో అక్కడ 38 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు… అధిక సంఖ్యలో భక్తులు సందర్శించుకునే  ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్‌ బోర్డు సభ్యులు ప్రకటించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆలయం మూసివేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఆలయ వైద్య ఆరోగ్య కేంద్రం మాత్రం తెరిచే ఉంటుందని తెలిపారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర సీఎం కూడా ప్రకటించారు.

ఒడిశాలో తొలి కరోనా కేసు
ఒడిశాలో తొలి కరోనా కేసు నమోదైంది. ఇటీవల ఇటలీ నుంచి రాష్ట్రానికి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా ఢిల్లీలోని జేఎన్‌యూ యూనివర్సిటీ విద్యార్థులను ఇంటికి వెళ్లాల్సిందిగా యూనివర్సిటీ అధికారులు సూచించారు. ఇరాన్‌ నుంచి 53 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు. వారిని జైసల్మేర్‌లోని క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. 
 
కరోనా కట్టడికి కేంద్రం పకడ్బందీగా చర్యలు
కరోనా కట్టడికి కేంద్రం పకడ్బందీగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో కీలక ప్రకటన చేసింది. ఈ నెలాఖరు వరకు  దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. స్విమ్మింగ్ పూల్స్, జిమ్స్, మ్యూజియమ్స్, థియేటర్లు, మాల్స్ ను కూడా మూసివేయాలని స్పష్టం చేసింది. ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే సదుపాయాన్ని ఆయా సంస్థలు కల్పించాలని తెలిపింది. విద్యార్థులంతా ఇళ్లలోనే ఉండాలని.. ఆన్‌లైన్ తరగతులను ప్రోత్సహించాలని సూచించింది. రోడ్లు, ఇతర ప్రాంతాల్లో ప్రజలు ఒకరికొకరు కనీసం మీటర్ మేర దూరంగా ఉండాలని తెలిపింది. 

ప్రయాణం ఆంక్షలు మరింత కఠినతరం
కరోనా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ప్రయాణ ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. కొన్ని దేశాల నుంచి భారత్ కు వచ్చేవారికి నిబంధనలు తప్పనిసరి చేసింది. యూఏఈ, ఖతార్, ఒమన్, కువైట్ నుంచి విమాన, నౌకాయానాల ద్వారా వచ్చే ప్రయాణికులకు 14 రోజుల నిర్బంధ చికిత్స అందించాలని  కేంద్రం నిర్ణయించింది. రేపట్నంచి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

Also Read | ఇంట్లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. తల్లీకొడుకు సజీవదహనం