Cycling For Medicine: కుమారుడి మందులకోసం 280 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కిన తండ్రి

కరోనా కట్టడికి దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ కారణంగా దూరప్రాంతాలకు వెళ్లే ప్రజా రవాణా నిలిచిపోయింది. దూరప్రాంతాలకు వెళ్ళాలి అంటే సొంతవాహనాల్లోనే వెళ్తున్నారు.

Cycling For Medicine: కుమారుడి మందులకోసం 280 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కిన తండ్రి

Father Cycled 280 Kilometers For His Sons Medicine

Cycling For Medicine: కరోనా కట్టడికి దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ కారణంగా దూరప్రాంతాలకు వెళ్లే ప్రజా రవాణా నిలిచిపోయింది. దూరప్రాంతాలకు వెళ్ళాలి అంటే సొంతవాహనాల్లోనే వెళ్తున్నారు. సొంత వాహనాలు లేని వారి పరిస్థితి దారుణంగా ఉంది. ప్రైవేట్ వాహనాల్లో వెళ్ళాలి అనుకుంటే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కిరాయిలు కూడా అధికంగానే ఉన్నాయి.. దీంతో పేదవారు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లేందుకు జంకుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రైవేట్ వాహనం తీసుకోని వెళ్లేందుకు డబ్బు లేక, రైల్లో వెళదామంటే లాక్ డౌన్ లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఓ వ్యక్తి పెద్ద సాహసమే చేశారు.

కన్నకొడుకుకి మందుల కోసం ఓ తండ్రి 280 కిలోమోటర్ల మేర సైకిల్ పై ప్రయాణం చేశాడో తండ్రి. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రము మైసూర్ జిల్లాలో చోటుచేసుకుంది. మానసిక వికలాంగుడైన పదేళ్ల కుమారుడికి మందులు తెచ్చేందుకు ఆనంద్ అనే వ్యక్తి మైసూర్ జిల్లా టీ నరసీపుర తాలూకా గణిగన కొప్పళ నుంచి బెంగళూరు వరకు సైకిల్ పై వెళ్లారు. అక్కడి నిమ్హాన్స్ ఆసుపత్రిలో తన కుమారుడికి కావలసిన మందులు తీసుకోని తిరిగి గ్రామానికి వెళ్లారు. ఆనంద్ 280 కిలోమీటర్ల ప్రయాణానికి నాలుగు రోజులు పట్టింది. గత ఆదివారం సైకిల్ పై సొంత గ్రామం నుంచి బయలుదేరిన ఆనంద్ మొదటి రోజు కనకపురకు చేరుకొని అక్కడ బస చేశాడు.

మరుసటి రోజు బెంగళూరులోని నిమ్హాన్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో డాక్టర్లు సూచించిన మందులను తీసుకోని తిరుగు పయనమయ్యారు. రెండు రోజుల్లో ఇంటికి చేరుకున్నారు. ఇలా నాలుగు రోజులపాటు సైకిల్ పై పయనించి కుమారుడికి మందులు తెచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.