కరోనా వేళ..కడుపు నింపుకోవడానికి చిన్నారిని అమ్ముకున్న తండ్రి

  • Published By: madhu ,Published On : July 25, 2020 / 06:29 AM IST
కరోనా వేళ..కడుపు నింపుకోవడానికి చిన్నారిని అమ్ముకున్న తండ్రి

కరోనా వైరస్ కష్టాలు అన్ని ఇన్ని కావు.. ఓ వైపు ప్రాణాలు తీస్తూనే ప్రజలను ఆర్థికంగా తీవ్రంగా దెబ్బ తీస్తోంది. పేద, సామాన్య, మధ్య తరగతి వారు ఇబ్బందులు పడుతున్నారు. పనులు లేక..చేతిలో డబ్బులు లేపోవడంతో పేద వారు అష్టకష్టాలు పడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో కడుపు నింపు కోవడం కోసం చేయని ప్రయత్నం లేదు. కానీ ఓ తండ్రి చేసిన పని..అందర్నీ కదిలించి వేస్తోంది.

తిండి లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాన్ని ఆదుకోవడం కోసం తన నాలుగు నెలల కుమార్తెను అమ్ముకున్నాడు. ఈ ఘటన అసోంలో చోటు చేసుకుంది.

అసోం రాష్ట్రంలోని కొక్రాబజార్ జిల్లాలోని అటవీ గ్రామమైన ధంటోలా మాండరియాలో దీపక్ బ్రహ్మ గుజరాత్ లో కూలీ పనులు చేసుకుని జీవనం సాగించేవాడు. ఇతనికి భార్య పిల్లలున్నారు. కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తుండడంతో కేంద్రం లాక్ డౌన్ విధించింది.

దీంతో పనులు లేకపోవడంతో సొంత ఊరికి వెళ్లిపోయాడు దీపక్. పని లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ..దీపక్ భార్య గర్భం దాల్చింది. రెండో సంతానంగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటికే వారికి ఏడాది వయస్సున్న కుమార్తె ఉంది. మళ్లీ ఆడపిల్ల జన్మనివ్వడంతో దీపక్ నిరుత్సాహానికి గురయ్యాడు.

చేతిలో పైసా లేకపోవడంతో ఓ ఆలోచన మదిలో మెదిలింది. మళ్లీ ఆడ పిల్ల జన్మించడం, చేతిలో పైసా లేకపోవడంతో నాలుగు నెలల పసికందును 45 వేల రూపాయలకు విక్రయించాడు. ఈ విషయం భార్యకు చెప్పలేదు. కూతురు కనిపించకపోవడంతో భర్తను నిలదీసింది.

విక్రయించానని తెలిపాడు. వెంటనే గ్రామస్తుల సహాయంతో భార్య కొచ్చుగావ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి బిడ్డను కొన్న మహిళల నుంచి శిశువును రక్షించి తల్లి ఒడికి చేర్చారు. అనంతరం బ్రహ్మను అరెస్టు చేశారు.