వామ్మో..బామ్మా..ఏమి నీ ధైర్యం !..భారీ తాచుపాముని చేత్తో పట్టుకెళ్లి అవతలపారేసిందో చూడండీ..

  • Published By: nagamani ,Published On : May 26, 2020 / 09:27 AM IST
వామ్మో..బామ్మా..ఏమి నీ ధైర్యం !..భారీ తాచుపాముని చేత్తో పట్టుకెళ్లి అవతలపారేసిందో చూడండీ..

చిన్న బొద్దింక కనిపించినా..బల్లి కనిపించినా స్తేచాలు..ఏదో పేద్ద త్రాచుపాము ఇంట్లోకొచ్చినట్లుగా భయపడిపోతాం. కానీ ఓ బామ్మగారు మాత్రం ఏకంగా 10 అడుగులకు పైనే ఉన్న ఓ త్రాచుపాముని చక్కగా ఏదో ఎలుకని పట్టుకున్నట్లుగా పట్టుకుని తీసుకెళ్లి అవతల పారేసింది. 

ఆ..ఇటువంటివి ఎన్ని చూశాం అన్నట్లుగా ఉంది ఆ బామ్మ పాముని పట్టుకెళ్లి పడేసిన విధానం చూస్తే. హా..బామ్మా ఏమి నీధైర్యం అన్నట్లుగా ఉంది ఆ పాముని పారేసిన పద్ధతి చూస్తే..

చూట్టూ అడవిలా ఉన్న ప్రాంతంలో..మధ్యలో ఉన్న చిన్నచిన్న ఇళ్లు..ఆ ఇళ్లలో నివసిస్తున్న ప్రజలకు ఇటువంటివి సర్వసాధారణమే అన్నట్లుగా ఉంటారు. అలా ఇళ్లల్లోకి పురుగూ..పుట్రా వస్తుంటాయి. అలాగే పాములు కూడా వస్తుంటాయి. అలా ఇంటిలోకి వచ్చిన ఓ పెద్ద భారీ త్రాచుపాముని..మారాం చేసే పిల్లాడిని  చేత్తో బరబరా లాక్కుంటూ..వెళ్లినట్లుగా లాక్కు వెళ్లి దూరంగా పడేసింది. తరువాత చేతులు దులుపుకుని చక్కా వచ్చేసింది. 

అలా పాముని పడేస్తున్న సమయంలో అక్కడే ఓ పిల్లాడు కుక్కతో ఆడుకుంటున్నాడు. కానీ అంత పెద్ద పాముని బామ్మ పట్టుకెళ్లటం ఆ పిల్లాడు చూశాడు. కానీ ఏమాత్రం ఆశ్చర్యపడలేదు. భయపడలేదు. ఇటువంటివి మామూలే అన్నట్లుగా కుక్కతో ఆడుకుంటున్నాడు. ఈ వీడియోను భారతీయ అటవీశాఖా అధికారి సుశాంతనంద తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసినవారంతా వామ్మో..బామ్మా..ఏమీ నీధైర్యం అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియోలో ఉన్న బామ్మ ఎవరు? ఎక్కడివారు? అనే వివరాలు అనవసరం..బామ్మగారి ధైర్యం..అంతే అవునూ..ఈ వీడియో వైరల్ గా మారిందనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కదూ..

Read:  నీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్, 14 అడుగులున్న కింగ్ కోబ్రాకు స్నానం చేయించాడు