వీడెక్కడి దొంగరా బాబూ…: COVID-19 పేషెంట్ ఇంట్లో మటన్ వండుకుని తిని డబ్బు దోచుకెళ్లాడు

వీడెక్కడి దొంగరా బాబూ…: COVID-19 పేషెంట్ ఇంట్లో మటన్ వండుకుని తిని  డబ్బు దోచుకెళ్లాడు

జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఓ వ్యక్తి దొంగతనానికి వచ్చి దర్జాగా COVID-19 పేషెంట్ ఇంటికి వచ్చి మటన్ వండుకుని రైస్, చపాతీలు చేసుకుని తిని డబ్బు దోచుకెళ్లాడు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పర్సుది పోలీస్ స్టేషన్‌లో శనివారం కేసు ఫైల్ చేశారు. జుగ్సలై నగర్ పరిషత్ సర్వేలెన్స్ టీమ్ లో పనిచేసే వ్యక్తికి కొవిడ్ 19 ఇన్ఫెక్షన్ సోకింది. దాంతో ఆ వ్యక్తి టాటా మెయిన్ హాస్పిటల్ లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు.

ముందస్తు జాగ్రత్తగా అతని ఇంటికి సీల్ వేసేశారు పోలీసులు. వెనుక డోర్ బద్దలు కొట్టుకుని దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు. పక్కింట్లో ఉండే వ్యక్తులు కొవిడ్ పేషెంట్ సోదరుడికి సమాచారం ఇచ్చారు. తర్వాతి రోజు శుక్రవారం చెక్ చేసేందుకు వెళ్లడంతో నిజమని తెలిసింది. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ‘దొంగలు ఇంట్లోకి చొరబడి మటన్ వండుకుని తినడమే కాకుండా చపాతీలు చేసుకుని, అన్నం వండుకుని పార్టీ చేసుకుని వెళ్లారు’ అని కంప్లైంట్ లో పేర్కొన్నాడు.

అతనికి జులై 8న ఇన్ఫెక్షన్ సోకి కొవిడ్ పాజిటివ్ అని తేలింది. అతని ఇంటిని అధికారులు సీల్ చేసి, డిక్లేర్ చేసేశారు. పొరుగిళ్లను కూడా కలిపి కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించేశారు. నెలరోజులుగా భార్య, పిల్లలు సొంతూళ్లోనే ఉంటున్నారు.

దొంగలు రూ.50వేల డబ్బుతో పాటు మరో 50వేలు విలువ చేసే నగలు దోచుకెళ్లారు. కొవిడ్ 19 పేషెంట్ కు టాటా మెయిన్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్నాడు. అని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అలోక్ రంజన్ అన్నారు. ఆ ప్రాంతంలో గార్డ్స్ ను పంపించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు వివరించారు.