కేంద్ర బడ్జెట్ : మధ్య తరగతికి బంపర్ ఆఫర్స్

కేంద్రం ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్ లో మధ్య తరగతి ప్రజలకు బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ నుండి అందిన సమాచారం ప్రకారం రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. 

  • Published By: veegamteam ,Published On : January 22, 2019 / 04:51 AM IST
కేంద్ర బడ్జెట్ : మధ్య తరగతికి బంపర్ ఆఫర్స్

కేంద్రం ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్ లో మధ్య తరగతి ప్రజలకు బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ నుండి అందిన సమాచారం ప్రకారం రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఫిబ్రవరి 1న కేంద్రం తాత్కాలిక బడ్జెట్‌
మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తుందని అంచనా 
రూ. 2.5 లక్షల ఆదాయం పన్ను  రూ. 5 లక్షల పెంచే అవకాశాలు

పార్లమెంట్ సమావేశాలలో కేంద్రం ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్ లో మధ్య తరగతి ప్రజలకు బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో  ఈ బడ్జెట్ కేవలం కొన్ని మార్గదర్శకాలకు మాత్రమే పరిమితమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల అనంతరం పూర్తి స్థాయి బడ్జెట్‌లో పన్ను రాయితీ ప్రతిపాదనలను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఇందులో భాగంగా..ప్రస్తుతం ఉన్న  రూ. 2.5 లక్షల వరకు వ్యక్తిగత పన్ను మినహాయింపును రూ. 5 లక్షల వరకు పెంచే దిశగా ప్రతిపాదనలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్‌లో ఇన్ కమ్ ట్యాక్స్ మినహాయింపు పరిమితి పెంచే ఉద్దేశ్యాలను మాత్రమే ఆర్థిక మంత్రి ప్రస్తావించనున్నారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తే ప్రత్యక్ష పన్ను రాయితీలను అమలు చేస్తామని చెప్పనున్నారు. 

జూలైలో ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్‌లోనే వాటిని అమలు చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం NDA ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉంది. చట్టానికి సవరణ అవకాశం ఉంది. అలాంటిది.. ఎలక్షన్ తర్వాత అమలు చేస్తాం అని చెప్పటంపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. పన్ను చట్టాలకు సవరణలు లేకుండా బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదాన్ని కోరవచ్చు. ఇతర మనీ బిల్లుల మాదిరిగానే ఫైనాన్స్ బిల్లును కూడా చర్చ తర్వాత లోక్‌సభ ఆమోదాన్ని పొంది ఆ తర్వాత రాజ్యసభలో చర్చ జరగవచ్చు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. సంప్రదాయం ప్రకారం తాత్కాలిక బడ్జెట్‌లో పార్ట్ బీ ఉండదు. 

గతంలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో పరోక్ష పన్నుల ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం జీఎస్టీ అమలు జరుగుతున్నందున కేవలం కస్టమ్స్ సుంకాలకు మాత్రమే సవరణలు చేయగలరు. నిజానికి చట్ట ప్రకారంగా చూస్తే ప్రత్యక్ష పన్నులకు తాత్కాలిక బడ్జెట్‌లో సవరణలు చేయరాదన్న నిబంధన ఏదీ లేదు. ఈ క్రమంలోనే అరుణ్ జైట్లీ తన బడ్జెట్ లో మధ్యతరగతి ప్రజలకు భారీ హామీలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని ప్రకటించనున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ఆర్థికవేత్తల సమావేశంలో లీక్ కూడా ఇచ్చారు. తాత్కాలిక బడ్జెట్‌ను దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలను దృష్టితో ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు.  ఈ అంచనాలన్నీ నిజమై మిడిల్ క్లాస్ ప్రజలకు ఈ బడ్జెట్ మేలు కలిగించాలని కోరుకుందాం..