Latest News India | National News in Telugu | Breaking News in India | India News Headlines | జాతీయ వార్తలు

Niger Desert Tragedy: సహారా ఎడారిలో మృత్యుఘోష.. దాహంతో 49 మంది మృతి.. గుండెలను పిండేసే నైగర్ ఎడారి విషాద కథ
దాహంతో 49 మంది ప్రయాణికులు మృతి

నడి ఎడారిలో విరిగిపోయిన ట్రక్కు

పండుగ పూట తీరని ఘోర విషాదం

Niger Desert Tragedy: కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకోవాలనే ఆరాటం, ఎన్నాళ్లకో కలుసుకోబోతున్నామనే ఆనందం.. కానీ, విధి ఆ కాసేపటి సంతోషాన్ని కూడా ఓర్వలేకపోయింది. ఈద్ అల్-అధా (బక్రీద్) పండుగ వేడుకల కోసం మాలీ దేశం నుండి నైగర్‌లోని తమ స్వగ్రామాలకు ట్రక్కులో బయలుదేరిన ఆ ప్రయాణికులను మృత్యువు సహారా ఎడారి రూపంలో వెంటాడింది. ఎండ తీవ్రతకు అల్లాడిపోతూ, తాగడానికి చుక్క నీరు కూడా దొరకని స్థితిలో, కళ్లముందే ప్రాణాలు విడిచిన ఆ 49 మంది అమాయకుల గాధ వింటే ఎవరి గుండెలైనా పగిలిపోవాల్సిందే.

నడి ఎడారిలో విరిగిపోయిన ట్రక్కు.. ప్రాణాలు తీసిన దాహం!

నైగర్ సరిహద్దు(Niger Desert Tragedy)కు సమీపంలోని అస్సామక ప్రాంతానికి పశ్చిమంగా ప్రయాణిస్తున్న సమయంలో వారి ట్రక్కు అకస్మాత్తుగా చెడిపోయింది. చుట్టూ కిలోమీటర్ల మేర ఇసుక తిన్నెలు తప్ప మనుషుల జాడ లేని నిర్జన ప్రదేశం అది. కనీసం మొబైల్ సిగ్నల్స్ కూడా లేకపోవడంతో వారు ఎవరికీ సమాచారం అందించలేకపోయారు. డ్రైవర్, ప్రయాణికులు కలిసి వాహనాన్ని బాగు చేయడానికి రోజుల తరబడి శతవిధాలా ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. కాలం గడుస్తున్న కొద్దీ వెంట తెచ్చుకున్న నీరు అయిపోయింది. సహారా ఎడారిలోని అత్యంత భయంకరమైన ఉష్ణోగ్రతల మధ్య, నిలువునా నకనకలాడుతూ నీటి కోసం వారు చేసిన ఆర్తనాదాలు ఆ ఎడారి ఇసుకలోనే కలిసిపోయాయి.

ఇద్దరు ప్రాణాలతో పోరాడి.. మిగిలిన వారు మాస్ గ్రేవ్స్‌లోకి..:

రోజుల తరబడి నరకయాతన అనుభవించిన తర్వాత, ఇద్దరు ప్రయాణికులు ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలనే పట్టుదలతో సుమారు 50 కిలోమీటర్లకు పైగా కాలినడకన ఎడారిలో ప్రయాణించారు. ఎట్టకేలకు ఒక నీటి వనరును కనుగొని, అస్సామక పట్టణానికి చేరుకుని అధికారులకు ఈ ఘోర విషాదాన్ని వివరించారు. వెంటనే స్పందించిన రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకునే సరికి ఘటనా స్థలంలో భయానక దృశ్యాలు కనిపించాయి. ట్రక్కు కింద, దాని చుట్టుపక్కల 49 మంది మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సుదూర ప్రాంతం కావడం, మృతదేహాలు కుళ్ళిపోయే స్థితికి చేరడంతో అధికారులకు వేరే దారి లేక, గుండె నిబ్బరం చేసుకుని వారందరినీ అక్కడికక్కడే ఒకే భారీ సామూహిక సమాధిలో (Mass Grave) అంత్యక్రియలు నిర్వహించారు. పండుగ పూట ఇళ్లకు చేరాల్సిన ప్రాణాలు ఇలా ఎడారిలోనే కలిసిపోవడం అంతర్జాతీయంగా తీవ్ర శోకాన్ని మిగిల్చింది.

Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీ మరో ధర్నా.. డేట్, ప్లేస్ ఇదే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే!
పేపర్ లీక్‌లపై విద్యామంత్రి రాజీనామా డిమాండ్

ఆందోళనలో పాల్గొన్న సామాజికవేత్త సోనమ్ వాంగ్చుక్

జూన్ 23న రాంలీలా మైదాన్ చలో

Cockroach Janata Party: ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ (Cockroach Janata Party) నిర్వహించిన తొలి భారీ ప్రత్యక్ష నిరసన ప్రదర్శన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నీట్, యూపీఎస్‌సీ వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల పేపర్ లీకేజీలు, సీబీఎస్ఈ మార్కింగ్ అవకతవకలపై దేశ యువత రోడ్డుపైకి వచ్చింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టినందుకు నైతిక బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని నిరసనకారులు తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు. “మేము పన్నులు కడితేనే విద్యామంత్రికి జీతం వస్తోంది, కానీ మా భవిష్యత్తుకే దిక్కులేదు” అంటూ విద్యార్థులు తమ ఆవేదనను వెళ్లగక్కారు.

APSRTC Bus Fire: రన్నింగ్‌ బస్సులో చెలరేగిన మంటలు.. ఎన్టీఆర్ జిల్లాలో తృటిలో తప్పిన పెను ప్రమాదం

నిరసన క్షేత్రంలో సోనమ్ వాంగ్చుక్: గాంధేయ మార్గంలో పోరాటం:

ఈ ఆందోళనకు ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ మద్దతుగా నిలిచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. “నాకు నిరసనలు చేయడం నచ్చదు, కానీ న్యాయం కోసం రాక తప్పలేదు” అని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు ఆయనను దేశ విద్యామంత్రి కావాలని కోరగా.. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని, యువతే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. పొలిటీషియన్లు, ఐఏఎస్ అధికారుల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలని ఆయన డిమాండ్ చేశారు. నిరసనకారులు చేతుల్లో జాతీయ జెండాలు, పుస్తకాలు పట్టుకుని, భద్రతా సిబ్బందికి గులాబీ పూలు అందిస్తూ శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేశారు.

భయపడేది లేదు.. జూన్ 23న రాంలీలా మైదాన్ చలో!

అమెరికా నుండి నేరుగా నిరసన స్థలానికి చేరుకున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. ప్రభుత్వంపై గళం విప్పితే ఎక్కడ జైల్లో పెడతారోనని దేశంలో ప్రతి తల్లి భయపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేయగలదేమో కానీ, తమ గొంతుకను నొక్కలేదని స్పష్టం చేశారు. “దేశ యువత ఇక భయపడదు, పోరాడుతుంది.. బొద్దింకలు ఎప్పటికీ చావవు” అని ఆయన గర్జించారు. పేపర్ లీకేజీల కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు నివాళులర్పించిన అనంతరం, ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తూ జూన్ 23న న్యూఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో మరో భారీ నిరసన చేపట్టనున్నట్లు సీజేపీ ప్రకటించింది.

IRCTC: ఇకపై ఇంటి నుంచి రైలు టికెట్లు బుక్ చేసుకోలేరా.. IRCTC సంచలన నిర్ణయం.. ఒకేసారి 9 కోట్ల అకౌంట్లు బ్లాక్
9 కోట్ల ఖాతాలపై రైల్వే నిఘా

3 కోట్ల అకౌంట్లు శాశ్వతంగా బ్లాక్

కేవైసీ చేస్తేనే ఖాతాలు యాక్టివేట్

IRCTC: ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి ఐఆర్‌సీటీసీ (IRCTC) షాకిచ్చింది. దళారుల సమస్యలను అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను రంగంలోకి దంపింది. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా, అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న దాదాపు 9 కోట్ల (90 మిలియన్ల) యూజర్ అకౌంట్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తించింది.

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో తరహాలో సిటీ బస్సు ట్రావెల్.. ట్రాఫిక్ కు చెక్..

3 కోట్ల అకౌంట్లు పర్మినెంట్ బ్లాక్:

ఐఐ అందించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా ఐఆర్‌సీటీసీ అధికారులు లోతైన సమీక్ష నిర్వహించారు. ఇందులో అత్యంత అనుమానాస్పదంగా తేలిన 3 కోట్ల (30 మిలియన్ల) అకౌంట్లను శాశ్వతంగా బ్లాక్ చేశారు. ఈ ఖాతాలు భవిష్యత్తులో మళ్లీ యాక్టివేట్ అయ్యే అవకాశం కూడా లేదు. టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకోవడంలో భాగంగానే ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు ఐఆర్‌సీటీసీ సీఎండీ సంజయ్ జైన్ వెల్లడించారు.

6 కోట్ల అకౌంట్లు నిష్క్రియం: పునరుద్ధరణ ఎలా?

మరో 6 కోట్ల (60 మిలియన్ల) అకౌంట్లను తాత్కాలికంగా నిష్క్రియం చేశారు. వీటి ద్వారా ప్రస్తుతానికి వందే భారత్, రాజధానితో సహా ఏ రైలుకూ టిక్కెట్లు బుక్ చేయడం సాధ్యం కాదు. అయితే, ఈ 6 కోట్ల మందిలో నిజమైన ప్రయాణికులు కూడా ఉండే అవకాశం ఉంది.

అయితే, తాత్కాలికంగా నిలిచిపోయిన ఖాతాదారులు కంగారు పడాల్సిన పనిలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవైసీ (KYC) ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా తమ అకౌంట్లను తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు. కేవైసీ పూర్తయిన వెంటనే యధావిధిగా టికెట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి.

E85 Fuel: పండుగ చేసుకోండి.. ఆ రకం పెట్రోల్ పై లీటర్ కి రూ.20 తగ్గింపు
E85 Fuel: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుదల మీద జనం గగ్గోలు పెడుతున్నారు. ఆయిల్ కంపెనీలు మెల్ల మెల్లగా రేట్లు పెంచుకుంటూ పోవడంతో వాహనదారుల జేబులకు చిల్లు పడుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. E85 పెట్రోల్ మీద లీటర్ కు రూ.20 తగ్గిస్తున్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ప్రకటించారు.

E85 అంటే ఏంటి?

ప్రస్తుతం మార్కెట్లో E20 పెట్రోల్ అందుబాటులో ఉంది. అంటే 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అన్నమాట. అయితే, ఈ E85 అనేది ఇంకా అడ్వాన్స్ డ్ పెట్రోల్. ఇందులో 85 శాతం ఇథనాల్ ఉంటుంది. కేవలం 15 శాతం మాత్రమే పెట్రోల్ ఉంటుంది. దీని రేటు చూస్తే సుమారు రూ.82 ఉంటుంది. అందులో ఇప్పుడు రూ.20 తగ్గిస్తారు. ఆ లెక్కన లీటర్ E85 పెట్రోల్ కేవలం రూ.62కి లభిస్తుంది.

అన్ని వాహనాలకి సెట్ అవుతుందా?

మామూలు పెట్రోల్, E20 అయితే దాదాపు అన్ని వాహనాలకు పనిచేస్తుంది. అయితే, E20 వల్ల మైలేజ్ సమస్యలు, ఇంజిన్ సమస్యలు వస్తున్నాయని కంప్లెయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా 85 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అన్ని వాహనాలకు సెట్ అవుతుందా అంటే.. కాదు. అది కేవలం ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ కి మాత్రమే సెట్ అవుతుంది.

Also Read: గోల్డ్ ప్రియులకు పండగలాంటి వార్త.. భారీగా పడిపోతున్న బంగారం ధర.. వెండి రేటుకూడా.. నేటి ధరలు ఇవే..

ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ ఏమేం ఉన్నాయి?

ద్విచక్ర వాహనాల్లో అయితే…

హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ప్యూయల్

హీరో HF డీల్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్

సుజుకి జిక్సర్ ఎస్ ఎఫ్ ఫ్లెక్స్ ఫ్యూయల్

కార్లలో అయితే..

మారుతీ సుజుకీ వాగనార్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఒక్కటే అందుబాటులో ఉంది. టొయోటా, టాటా, మహీంద్రా, హుందై లాంటి కంపెనీలు కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లను తీసుకొస్తున్నాయి.

Living Will: నచ్చినట్టు ‘చచ్చిపోవడానికి’ ఓ వీలునామా..
Living Will: వీలునామా. ఈ పేరు వినగానే అందరికీ ఒకటే గుర్తుకొస్తుంది. ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత తన తదనంతరం స్థిర చరాస్తులు, వ్యాపారాలు, ఇతరత్రా నగదు, బంగారం ఎవరికి చెందాలని రాస్తారు కదా. అదే. అని చాలా మంది అనుకుంటారు. కానీ, ఈ వీలునామా వేరు. ఓ వ్యక్తి తన జీవిత చరమాంకంలో ఉండగా, ఆస్పత్రిలో తనకు ‘నచ్చినట్టు చనిపోవడానికి’ (Living Will) రాసుకునే పత్రం. ఇది కూడా వీలునామానే. దీన్నే డై విత్ డిగ్నిటీ. అంటే గౌరవంగా మరణించే హక్కుగా చెబుతారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వీలునామాను తీసుకొచ్చింది.

ఎవరు రాస్తారు? ఏం రాస్తారు?

ఒక వ్యక్తి క్యాన్సర్ వల్లో, ప్రమాదాల వల్లో, ఇతరత్రా తీవ్ర అనారోగ్య సమస్యల వల్లో ఆస్పత్రి పాలయ్యారు. ఇంక వాళ్లు కోలుకునే అవకాశం లేదు. అలాంటప్పుడు వాళ్లు తాము ఎలా చనిపోవాలని కోరుకుంటే ఆ రకంగా చనిపోవచ్చు. అయితే, ఇంజెక్షన్ ఇచ్చి చంపేయండి అని కోరడానికి వీల్లేదు. యుథెన్సియా అనేది భారతదేశంలో అమలులో లేదు. కారుణ్యమరణం లాంటివి లేవు. కానీ ఈ వీలునామాలో కొన్ని అంశాలు రాయవచ్చు. అవేంటో చూద్దాం.

ఒక వ్యక్తి తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధి, లివర్, కిడ్నీ లేదా ఊపిరితిత్తుల ఫెయిల్యూర్ తో ఆస్పత్రిలో చేరేరనుకుందాం.. ఆ పరిస్థితి నుంచి వాళ్లు కోరుకునే అవకాశం లేకపోతే.. అలాంటప్పుడు వాళ్లు ‘నాకు ఈ వెంటిలేటర్లు వద్దు. ఏం వద్దు. ప్రతి సారీ ఈ నరకం నేను భరించలేకపోతున్నా. నా మానాన నన్ను వదిలేయండి. ఇలాంటివేం వద్దు. బతికినంతకాలం బతుకుతా. పోయినప్పుడు పోతా. అంతే కానీ ఇవేం వద్దు.’ అని కోరుకుంటే.. వాళ్లు వీలునామాలో ‘వెంటిలేటర్లు వద్దు. ట్యూబ్ లు పెట్టొద్దు. ఇతరత్రా ట్రీట్ మెంట్ వద్దు.’ అని రాయొచ్చు.

Also Read: కాక్రోచ్ జనతా పార్టీకి భారీ ఊరట.. ధర్నాకు అనుమతి.. ఢిల్లీలో అడుగుపెట్టిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే..

లీగల్ గా రిజిస్ట్రేషన్ అవసరం

ఈ లివింగ్ విల్ అనేది మాటలతో సరిపోదు. దీన్ని రిజిస్ట్రేషన్ చేయించాలి. తనపై ఎలాంటి ఒత్తిడి లేకుండా రాయాలి. దానిపై ఆ వ్యక్తి సంతకం చేయాలి. మరో ఇద్దరు సాక్షి సంతకాలు చేయాలి. దాన్ని మళ్లీ డాక్టర్లు సమీక్ష చేస్తారు.

తాను వీలునామాలో రాసినట్టు జరుగుతుందా లేదా అని చెక్ చేయడానికి ఆ వ్యక్తి ఒక ప్రతినిధిని కూడా నియమిస్తారు. ఒకసారి పేపర్లు రెడీ అయ్యాక ఆ వీలునామాను రిజిస్ట్రేషన్ చేయించాలి. అది ఆన్ లైన్ లో అయినా కావొచ్చు. లేకపోతే లోకల్ మున్సిపాలిటీలో కూడా కావొచ్చు. దాన్ని పరిశీలించిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారు. దాని స్టాంప్ కాపీ వీలునామా రాసిన వ్యక్తికి అందుతుంది.

ఇది ప్రస్తుతం మహారాష్ట్రలోనే అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 17 నుంచి ఈ లివింగ్ విల్ ను అమల్లోకి తెచ్చింది అక్కడి ప్రభుత్వం. దీన్ని అన్ని రాష్ట్రాలు అమల్లోకి తేవాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఈ లివింగ్ విల్ అనేది కచ్చితంగా అమలవుతుందా అంటే కూడా ఒక్కోసారి కాకకపోవచ్చు. ఎందుకంటే ఒక డాక్టర్ గా పేషెంట్ ను బ్రతికించడానికి ప్రయత్నించేక్రమంలో కొన్ని టెస్టులు చేస్తారు. కొంత లైఫ్ సపోర్ట్ అందిస్తారు. అది వాళ్ల వృత్తి ధర్మం. దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా వాళ్లపై ఉంటుంది.

Cockroach Janta Party protest : కాక్రోచ్ జనతా పార్టీకి భారీ ఊరట.. ధర్నాకు అనుమతి.. ఢిల్లీలో అడుగుపెట్టిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే..
Cockroach Janta Party protest : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి భారీ ఊరట లభించింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ, ధర్నాను శాంతియుతంగా నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు. ఎలాంటి ఉద్రిక్తతలకు దారితీయకుండా శాంతియుత వాతావరణంలో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు తమ నిరసన తెలుపుకోవచ్చునని పోలీసులు అనుమతి ఇచ్చారు. జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమానికి ఢిల్లీ పోలీసుల నుంచి అనుమతి లభించిందని సీజేపీ వెల్లడించింది.

Also Read : Sahara Desert Tragedy : ఘోర విషాదం.. ఎడారిలో చెడిపోయిన ట్రక్కు.. నీరు దొరక్క 49 మంది మృతి..

నీట్, సీబీఎస్ఈ, సీయూఈటీ, ఎస్ఎస్సీ వంటి పరీక్షలలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ నిరసన తెలిపేందుకు శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా నిర్వహించేందుకు ఆ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నిర్ణయించారు. తొలుత నిరసనకు అనుమతి లభించకపోయినా.. తాజాగా. ఢిల్లీ పోలీసుల నుంచి సీజేపీ నిరసనకు అనుమతి లభించింది.

పోలీసుల అనుమతి అనంతరం సీజేపీ అధికారిక ట్విటర్ (ఎక్స్) ఖాతాలో పోస్టు చేసింది. ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ నిరసనకు అనుమతి ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నేరుగా జంతర్ మంతర్ వద్దే తమ నిరసన చేపట్టొచ్చు. బొద్దింకలు వస్తున్నాయి.. ధర్మేంద్ర ప్రధాన్ వెళ్తున్నారు’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. అమెరికాలో ఉంటున్న సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నాడు. ఎయిర్ పోర్టులో అభిజిత్ దీప్కేకు సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. అయితే, విమానాశ్రయంలో అభిజిత్ దీప్కే మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రి కచ్చితంగా రాజీనామా చేయాలి. అయిదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముఖచిత్రం ఉన్న పుస్తకాన్ని పట్టుకొని ఆయన ఎయిర్ పోర్టులో నుంచి బయటకు వచ్చారు.

మరోవైపు.. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేయాలని మద్దతుదారులకు సీజేపీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. తమతోపాటు జాతీయ జెండా, పూలు, పుస్తకాలు తీసుకురావాలని కోరారు. ఎలాంటి హింసకు తావులేకుండా కేవలం శాంతిపూర్వకంగానే నిరసన చేపట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా సాధించుకుందామని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

సీజేపీ నిరసన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని నిరసన ప్రదేశంలో, దాని సమీప ప్రాంతాల్లో సుమారు 2వేల మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. మరోవైపు.. నిరసన ప్రదర్శనకు వేదికైన జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులు దాదాపు 150మంది ఫొటోగ్రాఫర్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రాళ్లు రువ్వడం వంటి ఉద్రిక్తతలు, ఇతర గొడవలకు కారణమయ్యే వ్యక్తుల ఫొటోలను తీసేపనిని వీరికి అప్పగించినట్లు సమాచారం. మరోవైపు.. పెద్ద ఎత్తున యువత నిరసనలో పాల్గొనేందుకు కాక్రోచ్ మాస్కులు ధరించి వచ్చారు.

Pawan Kalyan : ‘ఉచిత పథకం’ రాజకీయాలకు యువత ఎందుకు దూరమవుతోంది? పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్
ఉచితాలు కాదు.. యువత కోరేది అవకాశాలా?

ఉచిత పథకాలిచ్చే రాజకీయాల పట్ల యువత అసంతృప్తి..

యువతను ఆకట్టుకోవాలంటే ఉచితాలు సరిపోవు..

దేశీయ రాజకీయాలపై యువత ఎందుకు ఆగ్రహంగా ఉంది?

పథకాలు ఇచ్చి ఓట్లు అడిగే విధానాన్ని యువత గట్టిగా ప్రశ్నిస్తోంది

దేశ రాజకీయ భవిష్యత్తును యువత పునర్నిర్మించబోతోంది

Pawan Kalyan : దేశ రాజకీయాలపై యువత ధోరణి ఎలా మారుతుందో క్లియర్ కట్‌గా వివరించారు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎన్డీటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. యువత దేశ రాజకీయ భవిష్యత్తును పునర్నిర్మించబోతున్నారని తాను ఎందుకు నమ్ముతున్నారో కూడా వివరించారు.

ఉచితాల పట్ల యువత ఆగ్రహం :

నేటి యువత, ముఖ్యంగా జెన్ జెడ్ జనరేషన్ గురించి ఆయన తన అద్భుతమైన ఆలోచనలను పంచుకున్నారు. “నేటి యువతను చూస్తే చాలా మార్పు కనిపిస్తోంది. వారు ఉచిత పథకాల రాజకీయాల పట్ల ఆగ్రహంగా ఉన్నారు. అలాగే, వాటిపై ఎక్కువగా సంతృప్తి చెందడం లేదు. కేవలం పథకాలు ఇచ్చి ఓట్లు అడిగే విధానాన్ని యువత గట్టిగా ప్రశ్నిస్తున్నారు” అని పవన్ తెలిపారు.

నేటి యువత కోరుకునేది ఇదే :

ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలపై యువత ఆలోచనా ధోరణి పూర్తిగా మారుతోందని వివరించారు. “ఈ తరం భవిష్యత్తు గురించి ఆలోచిస్తోంది. దేశంలో వారికి స్థిరత్వం కావాలి. మంచి అవకాశాలు కావాలి. సమాజంలో సామరస్యం పెంపొందించాలి. దీర్ఘకాలిక అభివృద్ధి దిశగా దేశం వెళ్లాలని నేటి యువత కోరుకుంటున్నారు” అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

Read Also : Pawan Kalyan- Modi : మోదీ 12 ఏళ్ల పాలన అద్భుతం.. కష్టసుఖాల్లో ఆయనకు అండగా ఉంటాను : పవన్ కళ్యాణ్

సాంప్రదాయ రాజకీయాలకు అతీతంగా యువత ముందుకు నడుస్తోందని, స్థిరత్వం, అవకాశాలు, సామాజిక సామరస్యం, దీర్ఘకాలిక అభివృద్ధిపైనే ఎక్కువ దృష్టిసారిస్తోందని పవన్ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. చరిత్రలో జరిగిన అద్భుతమైన ఘట్టాలను కూడా పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతి తరం కూడా అప్పటి రాజకీయ మార్పులో కీలక పాత్ర పోషించిందని చెప్పారు.

భవిష్యత్తు రాజకీయాలను రూపుదిద్దే శక్తి :

“స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఒక తరం తీసుకువచ్చింది. ఆ తర్వాత వచ్చిన తరం సైద్ధాంతిక, సామ్యవాద ఉద్యమాల ద్వారా దేశీయ సాంప్రదాయ రాజకీయాలను ప్రభావితం చేసింది. ఇప్పుడు అలాగే నేటి యువత కూడా తమ ఆలోచనలతో కొత్త దిశను తీసుకురాబోతోంది” అని పవన్ అభిప్రాయపడ్డారు.

చివరగా పవన్ మాటల్లో యూత్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ తరం కేవలం ప్రేక్షకులుగా ఉండదన్నారు. భవిష్యత్తు రాజకీయాలను రూపుదిద్దే శక్తిగా మారుతుందని జనసేనాని వ్యాఖ్యానించారు.

Pawan Kalyan- Modi : మోదీ 12 ఏళ్ల పాలన అద్భుతం.. కష్టసుఖాల్లో ఆయనకు అండగా ఉంటా : పవన్ కళ్యాణ్
దేశానికి మోదీ అవసరం ఉంది

కష్టసుఖాల్లో నేను ఆయనకు అండగా ఉంటాను

ఏ ప్రధానికి కూడా ప్రజలతో ఇలాంటి అనుబంధం లేదు

ఈయనే మన దేశ భవిష్యత్తు, ఆయన మనకు కావాలి

Pawan Kalyan- Modi : ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన అద్భుతమైన విజయంగా అభివర్ణించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఆయన ఎన్డీటీవీకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ పట్ల తనకు ఉండే గౌరవం, వ్యక్తిగత అభిమానం, సంపూర్ణ మద్దతు గురించి అనేక విషయాలను పంచుకున్నారు.

అంతేకాదు.. తన రాజకీయ ప్రయాణంలో అత్యంత కీలకమైన సంఘటనలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు పవన్. అలాగే, మోదీతో ఏర్పడిన అనుబంధాన్ని కూడా ప్రస్తావిస్తూ.. ఎలా మొదలైంది? ఎలా విశ్వాసంగా మారిందో చెప్పుకొచ్చారు జనసేనాని.

మోదీ మనకు కావాలి :

గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్న రోజుల్లో ఆయన చేసిన పనులు, రాజకీయ సంకల్పం, ప్రత్యేక ప్రసంగాలు తనపై చెరగని ముద్ర వేశాయన్నారు. ముఖ్యంగా భారత్–పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో మోదీ ప్రసంగం తననెంతో ప్రత్యేకంగా ఆకట్టుకుందని పవన్ చెప్పారు.

అలాగే, స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంలో కూడా మోదీ ప్రసంగం దేశాన్ని నడిపించేందుకు అవసరమైన లక్షణాలు ఉన్న నాయకుడని ఆ క్షణంలోనే తనకు అనిపించిందన్నారు. “ఈయనే మన దేశ భవిష్యత్తు, ఆయన మనకు కావాలి. ఎందుకంటే.. మోదీ తన మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు.” అని పవన్ చెప్పుకొచ్చారు.

కష్టసుఖాల్లో మోదీకి అండగా ఉంటా :

జనసేన పార్టీని స్థాపించిన తర్వాత పవన్ ప్రధాని మోదీని కలవాలని భావించారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీని అధికారికంగా ప్రకటించకముందే ఆ సమావేశం జరిగిందన్నారు. అప్పుడు ఆ సమావేశంలో పవన్ స్పష్టంగా మోదీకి తన పట్ల విశ్వాసాన్ని తెలియజేశారు.

దేశానికి ప్రధానమంత్రి మోదీ అవుతారని విశ్వసిస్తున్నని, ఆయన నాయకత్వాన్ని బలోపేతం చేయడంతో తన సంపూర్ణ మద్దతు ఉంటుందని పవన్ చెప్పారు. “కష్టసుఖాల్లో నేను ఆయనకు అండగా నిలబడాలనుకుంటున్నాను. దేశానికి ఆయన అవసరం ఉంది” అని పవన్ ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో తెలిపారు.

Read Also : Lingamaneni Ramesh : జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరు ఖరారు

తండ్రి మాటల ప్రభావంతో :

తన తండ్రి మాటలు తననెంత ప్రభావం చేశాయో కూడా పవన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తండ్రి తరచుగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలను ఉత్తేజపరిచే బలమైన జాతీయ నాయకుడి అవసరం గురించి చెప్పేవారని అన్నారు. ఆ దృష్టితోనే తాను దేశాన్ని ఏకం చేయగల నాయకుడిని వెతుకుతున్న సందర్భంలో గుజరాత్ సీఎంగా మోదీ చేసిన పనిని తాను నిశితంగా గమనించినట్టు పవన్ గుర్తు చేసుకున్నారు.

మోదీ 12ఏళ్ల పాలన అద్భుతం :

మోదీ నేతృత్వంలో ఆర్టికల్ 370 రద్దు, సరిహద్దు భద్రతను బలోపేతం చేసే ప్రయత్నాలను ఆయన సంకల్పానికి ఉదాహరణలుగా పవన్ పేర్కొన్నారు. గత పన్నెండేళ్ల మోదీ పాలనను “అద్భుతమైన విజయం”గా అభివర్ణించారు. దేశంలోని విభిన్న ప్రాంతాల ప్రజలతో మోదీ కలిసే విధానం కూడా అసాధారణమని చెప్పారు.

మోదీ వంటి నాయకుడు లేరు :

“ఆయన ఢిల్లీలో కూర్చున్నా.. దేశంలోని మారుమూల ప్రాంతాల ప్రజలతో అనుబంధం ఏర్పరచుకుంటారు. ఏ భాష, ఏ సంస్కృతి అయినా ఆయనతో కనెక్ట్ అవుతారు. గతంలో ఏ ప్రధానికి కూడా ఇలాంటి అనుబంధం ప్రజలతో లేదు” అని పవన్ మోదీని కొనియాడారు.

ప్రధాని మోదీ పట్ల తనకు స్థిరమైన నిబద్ధత వ్యక్తిగతమైనదే కాదని, రాజకీయ విశ్వాసమని కూడా ఇంటర్వ్యూలో పవన్ స్పష్టంగా చెప్పారు. “కష్టసుఖాల్లో నేను ఆయనకు అండగా ఉంటాను” అని తన మద్దతును పవన్ ప్రకటించారు.

Annamalai : అన్నామలై రాజీనామాను ఆమోదించిన బీజేపీ అధిష్టానం.. కొత్త పార్టీ పేరు అదేనా?
Annamalai : తమిళనాడు బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఇటీవల పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆమోదించారు. అయితే, అన్నామలై కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Also Read : Karnataka Politics : కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ టెన్షన్.. మొన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం.. నేడు రాజీనామా.. డీకే సర్కారుకు ఆదిలోనే కుదుపు

త్వరలో అన్నామలై కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారని, ఆ పార్టీకి తమిళగ మక్కల్ కళగం లేదంటే తమిళగ మక్కల్ కట్చి అనే పేర్లలో ఏ ఒకటి పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతుంది. తమిళ రాజకీయ వర్గాల్లో మరో ప్రచారం కూడా సాగుతోంది.. అన్నామలై ఆయన నిర్వహిస్తున్న వియ్ లీడర్స్ అనే ట్రస్టు కార్యకలాపాలు విస్తరింపచేసి దాన్ని రాజకీయ ఉద్యమంగా మార్చే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, తన కొత్త పార్టీపై ఇప్పటి వరకు అన్నామలై ఎక్కడా ప్రకటన చేయలేదు. ప్రస్తుతం తన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించడంతో త్వరలో కొత్త పార్టీపై అన్నామలై కీలక ప్రకటన చేస్తారని తమిళ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

కర్ణాటక కేడర్ కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై.. పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. పార్టీ అధిష్టానంసైతం అతి తక్కువ కాలంలోనే తమిళనాడు బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అన్నామలైకు అప్పగించింది. కేంద్ర పార్టీ అధిష్టానం సూచనలతో.. తనదైన శైలిలో తమిళనాడు రాజకీయాల్లో కీలక నేతగా అన్నామలై ఎదిగారు. ముఖ్యంగా యువతలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అదే సమయంలో ద్రవిడ రాజకీయాల కోటలో బీజేపీకి కొత్త ఊపుతెచ్చిన యువ నాయకుడిగా అన్నామలై దేశ రాజకీయాల్లో పేరుగడించారు.

తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హైకమాండ్ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంది. ఆ తరువాత అన్నామలైను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష స్థానం నుంచి కేంద్ర పార్టీ అధిష్టానం తప్పించింది. అదే సమయంలో పళనస్వామి డిమాండ్ మేరకు అన్నామలైకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే – బీజేపీ కూటమి మూడో స్థానానికే పరిమితమైంది.

RBI Repo Rate : లోన్లు తీసుకున్న వారికి లడ్డూ లాంటి న్యూస్.. ఆర్బీఐ కీలక నిర్ణయం..
లోన్లు తీసుకున్న వారికి ఉపశమనం

ఆర్‌బీఐ వడ్డీరేటు యధాతథం

వివరాలు వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా

RBI Repo Rate : లోన్లు తీసుకున్న వారికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) లడ్డూ లాంటి న్యూస్ చెప్పింది. కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ఈమేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. ఆరుగురు సభ్యులతో కూడిన ఎంపీసీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read : Karnataka Politics : కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ టెన్షన్.. మొన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం.. నేడు రాజీనామా.. డీకే సర్కారుకు ఆదిలోనే కుదుపు

సంక్షోభం వేళ వడ్డీ రేట్లు పెరగొచ్చనే అంచనాలు తలకిందులు చేస్తూ ప్రస్తుతానికి వడ్డీలో ఎలాంటి మార్పు లేదని ఆర్బీఐ ప్రకటించింది. దీంతో లోన్లు తీసుకున్న వారికి ఉపశమనం లభించినట్లయింది. ప్రస్తుతానికి పాత ఈఎంఐలే కొనసాగనున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ముడిచమురు ధరల పెరుగుదల, రూపాయి బలహీనత, పశ్చిమ ఆసియా ప్రాంతంలోని భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినట్లు ఆర్‌బీఐ తెలిపింది. దీంతో రెపో రేటు 5.25శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో జరిగిన సమీక్షలోనూ వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచిన విసయం తెలిసిందే.

రెపో రేటులో మార్పులు లేకపోవడంతో గృహ రుణాలు, వాహన రుణాలు వంటి ఫ్లోటింగ్ వడ్డీ రుణాలపై ఈఎంఐలు తక్షణ ప్రభావానికి గురికావని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో రుణగ్రహీతలకు ప్రస్తుతం ఉపశమనం లభించినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, అంతర్జాతీయ పరిస్థితులు, చమురు ధరల పెరుగుదల, రూపాయి మారక విలువలో ఒత్తిడి వంటి అంశాలపై ఆర్‌బీఐ అప్రమత్తంగా ఉందని, భవిష్యత్‌లో పరిస్థితులను బట్టి విధాన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి.

కర్ణాటక కేబినెట్ రచ్చ.. మొన్న ప్రమాణం.. ఈ రోజు రాజీనామా చేసిన మంత్రి.. కారణం ఇదే..
కర్ణాటక కాంగ్రెస్‌లో కీలక పరిణామం

మంత్రి పదవికి రాజీనామా చేసిన రామలింగారెడ్డి

తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తితో రాజీనామా

Ramalinga Reddy : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ (DK Shivakumar) బుధవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు హాజరుకాగా.. అట్టహాసంగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డీకే శివకుమార్‌తోపాటు 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల్లోనే కీలక పరిణామం చోటు చేసుకుంది.

Also Read : Telangana Govt : తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 1597 పోస్టుల భర్తీకి సిద్ధమైన టీజీపీఎస్సీ.. ఈ నెలలోనే నోటిఫికేషన్..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డీకే శివకుమార్ తన క్యాబినెట్‌లోని సహచర మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ క్రమంలో ఆర్థిక శాఖ, క్యాబినెట్ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్ విభాగంతోపాటు పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన జి.పరమేశ్వరకు రెవెన్యూ, క్రీడా శాఖలను కేటాయించారు. అలాగే మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడా శివకుమార్ క్యాబినెట్‌లో చోటు దక్కించుకోగా.. ఆయనకు పట్టణాభివృద్ధి  (అర్బన్ డెవలప్‌మెంట్) శాఖను కేటాయించారు. అయితే, శాఖల కేటాయింపుపై కర్ణాటక కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు తెరపైకి వచ్చాయి.

సీనియర్ నేత, మంత్రి రామలింగారెడ్డి తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రామలింగారెడ్డికి భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖను కేటాయించారు. అయితే, ఆయన బెంగళూరు అభివృద్ధి శాఖను ఆశించారని సమాచారం. దానికి భిన్నంగా శాఖను కేటాయించడంతో రామలింగారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇష్టం లేని శాఖ కేటాయించారని అసహనం వ్యక్తం చేస్తూ నీటిపారుదల శాఖ మంత్రి రామలింగారెడ్డి శుక్రవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. నగరాభివృద్ధి శాఖ ఇవ్వాలని విన్నవించినా.. తనకు అవగాహన లేని నీటిపారుదల శాఖ ఇచ్చారంటూ కాంగ్రెస్ నేతల వద్ద ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

రాజీనామా అనంతరం రామలింగారెడ్డి మాట్లాడారు. ఇక తాను ఏ మంత్రిత్వ శాఖను ఆఫర్ చేసినా తీసుకోను. కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాను. ఎమ్మెల్యేగా కొనసాగుతానని వెల్లడించారు.

Punjab Man Stabs: మాజీ ప్రేయసి ఆపీస్‌కు వెళ్లి కత్తితో 20సార్లు పొడిచి హత్య.. ఆ తరువాత తాను కత్తితో పొడుచుకొని..
Punjab Man Stabs: మాజీ ప్రేయసిని కార్యాలయంలోనే 20సార్లకు పైగా కత్తితో పొడిచిన యువకుడు.. అనంతరం ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో చోటు చేసుకుంది. ప్రేమ విఫలమవడంతో ఓ యువకుడు అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. తన మాజీ ప్రేయసిపై కక్ష పెంచుకున్న అతడు ఆమె పనిచేస్తున్న కార్యాలయానికి వెళ్లి 20 సార్లకు పైగా కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం అదే కత్తితో తనను తాను గాయపరుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read – TG Doctors Strike : డాక్టర్ల సమ్మెబాట.. నేటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్.. వైద్యుల డిమాండ్లు ఇవే! జీవో నంబర్ 38 అంటే ఏమిటి?

పోలీసుల వివరాల ప్రకారం.. 30ఏళ్ల డింపుల్ మొహాలీలోని సెక్టార్-66లో ఉన్న ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తోంది. గతంలో ఆమెకు హర్జిందర్ సింగ్ మాన్‌తో ప్రేమ సంబంధం ఉండేది. అయితే కొంతకాలం క్రితం ఇద్దరూ విడిపోవడంతో హర్జిందర్ సింగ్ మాన్ తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది.

గురువారం సాయంత్రం కార్యాలయానికి చేరుకున్న నిందితుడు మహిళతో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

గురువారం సాయంత్రం కార్యాలయానికి చేరుకున్న నిందితుడు మహిళతో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. మహిళపై 20 సార్లకుపైగా కత్తిపోట్లు పొడవడంతో ఆమె తీవ్ర రక్తస్రావానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది.

ఘటన అనంతరం నిందితుడు కూడా అదే కత్తితో తనను తాను గాయపరుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్థానికులు అతన్ని అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రేమ వ్యవహారం, విడిపోవడానికి గల కారణాలు, హత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టారు. మాజీ భాగస్వాముల మధ్య తలెత్తే వివాదాలు ఎంతటి విషాదాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తుచేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Dmk Party: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. ఢిల్లీ సమావేశం బహిష్కరణ
ఇండియా కూటమి భేటీ బహిష్కరణ నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ తీవ్ర ద్రోహం చేసింది

ఢిల్లీ సమావేశానికి డీఎంకే పూర్తి దూరం

Dmk Party: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్రంలో ఊహించని రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయి. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ‘ఇండియా’ (INDIA) కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే (Dmk Party) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 8వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరగబోయే ఇండియా కూటమి అత్యవసర సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు డీఎంకే అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ పాల్గొనే ఈ భేటీకి తాము వెళ్లే ప్రసక్తే లేదని చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం గురువారం స్పష్టం చేసింది.

Pawan Kalyan: తెలంగాణపై నా వైఖరి ఇదే.. పాత వీడియో షేర్ చేసిన పవన్ కళ్యాణ్.. వివాదానికి చెక్

తమిళనాడు ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ తమకు తీవ్ర ద్రోహం చేసిందని డీఎంకే నిప్పులు చెరిగింది. కాంగ్రెస్ అనుసరించిన వైఖరి వల్ల తమ పార్టీ శ్రేణులు తీవ్ర మనస్తాపానికి గురయ్యాయని, వారి భావోద్వేగాలను గౌరవిస్తూనే ఈ సమావేశానికి దూరంగా ఉండాలని డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ నిర్ణయించారని పార్టీ పేర్కొంది. కూటమి భాగస్వామ్య పక్షాల నుండి ఆహ్వానం అందినప్పటికీ, తమ కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని క్షమించేది లేదని డీఎంకే అధిష్ఠానం ఖచ్చితంగా తేల్చిచెప్పింది.

కూటమి ఏర్పడినప్పటి నుంచి స్టాలిన్ ఎంతో కీలక పాత్ర పోషించినప్పటికీ, తాజా వివాదంతో కాంగ్రెస్-డీఎంకే బంధంలో తీవ్ర అగాధం ఏర్పడింది. అయితే కూటమి భేటీని బహిష్కరించినప్పటికీ.. నీట్, వక్ఫ్ చట్టం, మరియు ‘ఒక దేశం-ఒకే ఎన్నికలు’ వంటి ప్రజా వ్యతిరేక విధానాలపై పార్లమెంట్‌లో తమ పోరాటం కొనసాగుతుందని డీఎంకే స్పష్టం చేసింది. ఇలాంటి అంశాలపై ఇతర పార్టీలు చేసే పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని చెబుతూనే, జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమికి డీఎంకే గట్టి షాక్ ఇచ్చింది.

Supreme Court: వారికి ఉద్యోగాలు ఇస్తే అర్హులకు అన్యాయమే.. సుప్రీం కోర్టు కీలక తీర్పు
ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే ఉద్యోగానికి అన్యాయం

విద్యార్హతలు దాచిపెడితే ఉద్యోగం ఊడటం ఖాయం

తక్కువ చదివిన సామాన్యుల కోసమే పోస్టులు

Supreme Court: నిర్ణీత విద్యార్హతల కంటే ఎక్కువ చదువుకున్న అభ్యర్థులను ఆయా ఉద్యోగాల్లోకి అనుమతించడం వల్ల, వాస్తవంగా ఆ పోస్టులకు అర్హులైన వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. గతంలో ఒక బ్యాంకు అటెండెంట్‌ను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. జస్టిస్‌ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్‌ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ, నిబంధనల ఉల్లంఘనలను సహించేది లేదని తేల్చిచెప్పింది.

KVP Ramachandra Rao: వైఎస్సార్‌పై అసత్య ఆరోపణలు.. నిరూపిస్తే రూ.10 కోట్లు.. పవన్‌ కళ్యాణ్ కు కేవీపీ సవాల్

ఈ కేసులో సదరు ఉద్యోగి తాను గ్రాడ్యుయేట్ (డిగ్రీ) పూర్తి చేసిన నిజాన్ని దాచిపెట్టి, కేవలం పదో తరగతి అర్హతగా ఉన్న అటెండెంట్ పోస్టును దక్కించుకున్నాడు. ఈ మోసాన్ని గమనించకుండా హైకోర్టు అతనికి అనుకూలంగా ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు(Supreme Court) తప్పుపట్టింది. విద్యార్హతలను దాచిపెట్టి తక్కువ స్థాయి పోస్టుల్లో చేరిన ఉద్యోగిని తొలగిస్తూ సదరు బ్యాంకు తీసుకున్న నిర్ణయం పూర్తిగా సమర్థనీయమేనని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఉద్యోగ నియామకాల్లో విద్యార్హతలకు గరిష్ట పరిమితి విధించడం వెనుక బలమైన, న్యాయమైన సామాజిక కారణాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. విభిన్న పరిస్థితుల వల్ల ఉన్నత చదువులు చదవలేకపోయిన అట్టడుగు వర్గాల వారికి ఉపాధి కల్పించడమే ఈ పరిమితుల ముఖ్య ఉద్దేశమని తెలిపింది. ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నవారితో పోటీ పడే అవకాశం లేని సామాన్యుల కోసమే ప్రభుత్వం కొన్ని పోస్టులను ప్రత్యేకంగా కేటాయిస్తుందని, ఈ విధానాన్ని కోర్టులు ఎల్లప్పుడూ గౌరవిస్తాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

Bomb Threat: పంజాబ్‌లో హై అలర్ట్.. ఐదు ప్రముఖ దేవాలయాలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన భద్రతా యంత్రాంగం
ఐదు ప్రముఖ ఆలయాలకు బాంబు బెదిరింపు

పంజాబ్ వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్

బ్లూ స్టార్ వార్షికోత్సవం వేళ కలకలం

Punjab Bomb Threat: పంజాబ్‌లో బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలోని ఐదు ప్రముఖ దేవాలయాలతో పాటు కొన్ని ప్రభుత్వ సంస్థలను బాంబులతో పేల్చివేస్తామంటూ గురువారం వచ్చిన ఒక ఈమెయిల్ సంచలనంగా మారింది. అమృత్‌సర్‌లోని దుర్గియానా ఆలయం, జలంధర్‌లోని దేవీ తలాబ్‌ మందిర్‌, పటియాలాలోని మాతాకాళీ ఆలయం, భటిండాలోని మైసర్ ఖానా, పఠాన్‌కోట్‌లోని ముక్తేశ్వర్‌ ధామ్ ఆలయాలకు ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆలయాల వద్ద ముమ్మర తనిఖీలు చేపట్టారు. జలంధర్ ఆలయంలో ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని భద్రతా బలగాలు స్పష్టం చేశాయి.

*Army Captain Proposal: ప్రేమ గెలిచింది.. కానీ ప్రోటోకాల్ తప్పింది.. ఆర్మీ కెప్టెన్ రొమాన్స్ పై రక్షణ శాఖ సీరియస్

ఆపరేషన్ బ్లూ స్టార్ వార్షికోత్సవం వేళ హై అలర్ట్:

1984 జూన్‌లో అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో దాక్కున్న ఉగ్రవాదులను ఏరివేయడానికి భారత సైన్యం ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ పేరిట భారీ సైనిక చర్య చేపట్టిన విషయం తెలిసిందే. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాలతో మేజర్ జనరల్ బ్రార్ నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో వేర్పాటువాద నేత భింద్రన్‌వాలే హతమవగా, 83 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ చారిత్రక సైనిక చర్య జరిగి సరిగ్గా 42 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలోనే ఈ బాంబు బెదిరింపులు రావడం పంజాబ్‌లో తీవ్ర ఆందోళనకు దారితీసింది.

అప్రమత్తమైన భద్రతా యంత్రాంగం:

ఆపరేషన్ బ్లూ స్టార్ వార్షికోత్సవం కారణంగా పంజాబ్‌(Punjab)లో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత అమల్లో ఉండగా, ఈ మెయిల్‌తో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకే ఎవరో ఇలాంటి నకిలీ ఈమెయిల్ పంపి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా రాష్ట్రవ్యాప్తంగా నిఘా వర్గాలను రంగంలోకి దించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు అధికారులు.

Army Captain Proposal: ప్రేమ గెలిచింది.. కానీ ప్రోటోకాల్ తప్పింది.. ఆర్మీ కెప్టెన్ రొమాన్స్ పై రక్షణ శాఖ సీరియస్
వైరల్ ప్రపోజల్ పై మిలిటరీ సీరియస్

ప్రేమలో పడి రూల్స్ తప్పిన కెప్టెన్

నాసిక్ ఆర్మీ అకాడమీలో వింత సంఘటన

Army Captain Proposal: మనం ఇప్పటివరకు చాలారకాల లవ్ ప్రపోజల్స్ చూసి ఉంటాం. కానీ, ఇది చాలా కొత్తగా ఉంటుంది. తన ప్రేయసికి సరికొత్తగా తన ప్రేమను వ్యక్తం చేయాలని అనుకున్నాడు ఒక ఆర్మీ అధికారి.కానీ, అందుకోసం చేసిన ప్రయత్నం ఆ అధికారికి కొత్త చుక్కులు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, తాజాగా నాసిక్ లోని ఆర్మీ ఏవియేషన్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఆ పరేడ్ లో కెప్టెన్(Army Captain Proposal) భరత్ భరద్వాజ్ కూడా పాల్గొన్నాడు.

Otzi Mummy: చనిపోయిన శవంలో ‘సజీవ’ సంచలనం.. 5,300 ఏళ్లుగా బతికే ఉన్న బ్యాక్టీరియా.. ఒట్జీ మమ్మీ మరణం లేని మంచు కథ

ఐయితే, ఆ పరేడ్ కార్యక్రమం ముగిసిన వెంటనే తన ప్రేయసి ఆరుషికి అక్కడే మిలిటరీ హెలికాప్టర్ ముందే మోకాళ్లపై నిలబడి ప్రపోజ్ చేసి తన ప్రేమను వ్యక్త పరిచాడు. ఆ అధికారి ప్రేమను ఆ అమ్మాయి కూడా అంగీకరించింది. రొమాంటిక్ సినిమా సీన్‌ను తలపించే ఈ దృశ్యం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారింది. కానీ, ఈ వైరల్ వీడియో ఇప్పుడు ఆ యువ అధికారికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. సాధారణంగా, సైన్యంలో క్రమశిక్షణే పరమావధిగా భావించే ఉన్నతాధికారులు. అందుకే, ఆ యువ ఆర్మీ అధికారిక చేసిన పనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

డిఫెన్స్ ఇన్‌స్టాలేషన్లు, అధికారిక మిలిటరీ వేడుకలు అనేది వ్యక్తిగత వేడుకల కోసం కాదని, ఈ ప్రపోజల్ సైనిక నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే సదరు అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు, ఈ ఘటన దేశవ్యాప్తంగా మిలిటరీ డెకోరమ్, వ్యక్తిగత భావోద్వేగాల మధ్య ఉన్న సరిహద్దులపై పెద్ద చర్చకు దారితీసింది. కొంతమంది, దీనిని ఆ యువకుడి జీవితకాల మైలురాయిగా సమర్థిస్తుండగా, రక్షణ రంగానికి సంబంధించిన సున్నిత ప్రాంతాలలో ఇలాంటి ప్రైవేట్ ఈవెంట్స్ ఆర్మీ గౌరవాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Uttar Pradesh: యూపీలో వైద్యుడి పైశాచికం.. లంచం ఇవ్వలేదని అతికిన ఎముకను మళ్లీ విరగ్గొట్టి.. గిలగిలా కొట్టుకున్న బాలిక
లంచం కోసం కాలు విరిచిన డాక్టర్

ఉత్తరప్రదేశ్‌లో అమానుష వైద్యుడి పైశాచిక ప్రవర్తన

బాధిత బాలికకు తక్షణ న్యాయం కావాలి

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రాణాలు కాపాడాల్సిన డాక్టరే పైశాచికంగా ప్రవర్తించాడు. రేష్మ అనే నిరుపేద మహిళకు చెందిన 14 ఏళ్ల మానసిక వికలాంగురాలైన కుమార్తె కాలు విరగడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే, అక్కడి సిబ్బంది సర్జరీ కోసం రూ. 25 వేల లంచం డిమాండ్ చేశారు. అంత డబ్బు ఇచ్చుకోలేని స్థితిలో ఉన్న ఆ తల్లి జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించగా, ఉచిత వైద్యం అందించాలని ఆదేశాలు వచ్చాయి. అయినా వినని సిబ్బంది ఒత్తిడి చేయడంతో ఆమె అతికష్టంపై రూ. 8 వేలు చెల్లించింది. దాంతో డాక్టర్ చతుర్వేది ఆ బాలికకు శస్త్రచికిత్స పూర్తి చేశాడు.

Massive Fire Breaks Out : అమీర్‌పేటలో అగ్నిప్రమాదం.. భవనం అంతటా వేగంగా వ్యాపించిన మంటలు.. భారీగా ట్రాఫిక్ జామ్

మిగిలిన లంచం డబ్బులు తీసుకురావాలని సదరు వైద్యుడు ముందే హెచ్చరించాడు. తదుపరి పరీక్షల సమయానికి రేష్మ మిగతా డబ్బులు చెల్లించలేకపోయింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ డాక్టర్, బాలిక నడకను పరీక్షిస్తాననే నెపంతో ఆమె కాలిని గట్టిగా మెలితిప్పాడు. ఆ చిన్నారి నొప్పితో అల్లాడిపోతున్నా వదలకుండా, ఎముకను సరిచేస్తున్నానంటూ నమ్మబలికి క్రూరంగా ప్రవర్తించాడు. ఇంటికి వెళ్ళాక కూడా బాలిక బాధ భరించలేకపోవడంతో, తల్లి ఆమెను మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి ఎక్స్-రే తీయించింది. అప్పుడు అసలు నిజం బయటపడింది.

వైద్యుడు లంచం ఇవ్వలేదనే కక్షతో సర్జరీ చేసి అతికించిన ఎముకను ఉద్దేశపూర్వకంగానే మళ్లీ విరగ్గొట్టినట్లు ఎక్స్-రే రిపోర్టులో తేలింది. సమాజంలో దేవుడిలా భావించే వైద్యుడే ఇలాంటి పైశాచికత్వానికి ఒడిగట్టడంపై బాధితురాలి బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ అమానుష ఘటనపై ముజఫర్‌నగర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) స్పందిస్తూ, సదరు వైద్యుడిపై తక్షణమే విచారణకు ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Massive Fire At Delhi Restaurant : ఢిల్లీలోని రెస్టరెంట్‌లో అగ్నిప్రమాదం.. 20మంది సజీవదహనం.. పలువురికి గాయాలు
Massive Fire At Delhi Restaurant : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. మాలవీయనగర్‌లోని లెమన్ గ్రీన్ రెస్టరెంట్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20మందికిపైగా సజీవదహనం అయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉదయం 8.50గంటల సమయంలో రెస్టరెంట్ బేస్మెంట్‌లో మంటలు చెలరేగాయి. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు.

#UPDATE | The death toll rises to 21 in Malviya Nagar restaurant fire incident, confirms Delhi Police.

— ANI (@ANI) June 3, 2026

#DELHI-साकेत प्रेस एन्क्लेव के सामने, मालवीय नगर के हौज रानी स्थित एक होटल में लगी भीषण आग ।

लाल डोरा क्षेत्र में तेजी से बन रहे बहुमंजिला होटलों की अग्नि सुरक्षा, आपातकालीन पहुंच और नियामक निगरानी पर गंभीर सवाल खड़े कर दिए हैं।#DelhiFire #MalviyaNagar #Saket #FireSafety pic.twitter.com/2gtCHzJfg9

— Payall Singhh (@PayallSingh13) June 3, 2026

ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ.. షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది. మృతుల్లో.. సౌతాఫ్రికా, గల్ఫ్ వాసులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.

మరోవైపు.. ఢిల్లీలోని మాలవీయ నగర్ లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇక గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు.

The loss of lives due to a fire incident in Malviya Nagar, Delhi is tragic. My condolences to those who have lost their loved ones. Wishing a speedy recovery to the injured. Authorities are providing all possible assistance to those affected.

An ex-gratia of Rs. 2 lakh from…

— PMO India (@PMOIndia) June 3, 2026

Compassionate Appointment : భారీ ఊరట.. పెళ్లయిన కుమార్తెలూ అందుకు అర్హులే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
కారుణ్య నియామక అర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

పెళ్లయిన కుమార్తెలకు కారుణ్య నియామకం

యూపీ మహిళ పిటీషన్ పై సుప్రీంకోర్టు తీర్పు

Supreme Court : కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న వివాహితులైన కూతుళ్లకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే, వారి స్థానంలో ఇచ్చే కారుణ్య నియామకాలకు పెళ్లి చేసుకున్న కూతుళ్లు కూడా అర్హులేనని తేల్చిచెప్పింది. పెళ్లియిందన్న ఒక్క కారణంతో వారి హక్కులను కాలరాయలేరని కోర్టు స్పష్టం చేసింది. పెళ్లి అనేది ఒక మహిళ అర్హతను లేదా ఆమె తన తల్లిదండ్రులపై ఆధారపడే స్థిని మార్చలేదని అభిప్రాయపడింది.

Also Read – India Gold Imports : దేశంలో ప్రజల వద్ద 32వేల టన్నుల బంగారం నిల్వలు.. అందులో కేవలం 1శాతం రీసైక్లింగ్ చేస్తేచాలు.. ఆ తరువాత ఏం జరుగుతుంది?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంకు చెందిన వివాహిత మహిళ దాఖలు చేసిన పిటిషన్ నుంచి ఈ కేసు మొదలైంది. తన తల్లి మరణం తరువాత రేషన్ షాపు లైసెన్సు కోసం దరఖాస్తు చేసిన ఆమెకు వివాహిత కూతురు అనే కారణంతో లైసెన్సును ప్రభుత్వం నిరాకరించింది. ఆమె తన వికలాంగ సోదరిని చూసుకుంటూ, కుటుంబంతోనే నివసిస్తూ తల్లికి సహాయం చేస్తూ షాపు నడిపేది. దీంతో ప్రభుత్వం ఉత్తర్వులను సవాల్ చేస్తూ రేషన్ షాపు డీలర్ కుమార్తె హైకోర్టులో సవాల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. సుప్రీంకోర్టు ఆమెకు ఊరట కలిగిస్తూ కీలక తీర్పును వెలువరించింది.

వివాహమైనంత మాత్రాన కుమార్తెతో కుటుంబ బంధం ముగిసిపోదని, కొనసాగుతూనే ఉంటుందని ధర్మాసనం తెలిపింది. వివాహమైన కుమారుడు విడిగా దూరంగా ఉంటున్నప్పటికీ కుటుంబ సభ్యుడిగా పరిగణిస్తూ.. కుమార్తె విషయంలో భిన్నంగా ఆలోచించడం లింగ వివక్షేనని ధర్మాసనం అభిప్రాయ పడింది. కుటుంబ నిర్వచనం పరిధి నుంచి వివాహిత కుమార్తెను మినహాయించడం ఏకపక్షం, అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. కారుణ్య నియామకాలకు వివాహిత కుమార్తెలు కూడా అర్హులేనంటూ జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ ఆలోక్‌ ఆరాధే ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.

India Gold Imports : దేశంలో ప్రజల వద్ద 32వేల టన్నుల బంగారం నిల్వలు.. అందులో కేవలం 1శాతం రీసైక్లింగ్ చేస్తేచాలు.. ఆ తరువాత ఏం జరుగుతుంది?
India Gold Imports : బంగారంతో భారతదేశానికి ఉన్న అనుబంధాన్ని ఎంత చెప్పినా తక్కువే. పెండ్లిళ్లు, పండుగల నుండి వారసత్వం, పెట్టుబడి వరకు భారతీయుల ఇండ్లలో ఈ బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే, భారతీయులు ప్రతి సంవత్సరం బంగారం కొంటూనే ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా ఇండ్లలో ఇప్పటికే భారీ మొత్తంలో వాడని బంగారం నిల్వలు ఉన్నాయి. అయితే, గత నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేవలం కొత్తగా దిగుమతి చేసుకున్న బంగారంపై ఆధారపడకుండా నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని తిరిగి వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. ప్రధాని మోదీ సూచన వెనుక ఉన్న ఆలోచన చాలా సులభం. దేశంలోకి బంగారం దిగుమతులను తగ్గించడం.

Also Read : Telangana Govt : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మూడు నోటిఫికేషన్లు జారీ.. దరఖాస్తు, పరీక్షల తేదీలు ఇవే.. ఈ నెలలోనే మరో 1800 పోస్టులు..

భారతీయ కుటుంబాలు, దేవాలయాలు వద్ద మొత్తం కలిపి సుమారు 32వేల టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లు కేంద్రం అంచనా. ఈ బంగారం విలువ సుమారు 3.8 ట్రిలియన్ డాలర్ల వరకు ఉంటుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఎక్కువ భాగం లాకర్లలో, అలమరాల్లో ఉపయోగం లేకుండా ఉంది. ప్రస్తుతం దేశంలోని ప్రజల వద్ద ఉన్న బంగారంలో కొంతభాగం అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తిరిగి వచ్చినా.. దాని ప్రభావం గణనీయంగా ఉండవచ్చు.

బంగారం రీసైక్లింగ్ అంటే సరిగ్గా ఏమిటి?

పాత నగలు, విరిగిన ఆభరణాలు, నాణేలు, బంగారు బార్లు లేదా ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లోని బంగారాన్ని సేకరించి శుద్ధి చేసి మళ్లీ స్వచ్ఛమైన బంగారంగా మార్చడాన్ని గోల్డ్ రీసైక్లింగ్ అంటారు. ఈ ప్రక్రియలో బంగారాన్ని 99.9% స్వచ్ఛత వరకు శుద్ధి చేసి మళ్లీ నగలు లేదా ఇతర ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా భారతదేశంలో బంగారం దిగుమతులు తగ్గుతాయి. తద్వారా ఆర్థిక భారం తగ్గి, బంగారం ధరలు అదుపులోకి వస్తాయి.

ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తోంది?

2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ బంగారం దిగుమతుల కోసం సుమారు 72.4 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. బంగారం దిగుమతులకు విదేశీ మారక నిల్వలు (Forex Reserves) వినియోగించాల్సి వస్తుంది. దీంతో దేశపు ప్రస్తుత ఖాతా లోటు (Current Account Deficit), విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది. సులభంగా చెప్పాలంటే.. రీసైకిల్ చేసిన ప్రతి గ్రాము బంగారం ఇతర దేశాల నుంచి భారత దేశంలోకి బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సిన అవసరాన్ని ఒక గ్రాము తగ్గిస్తుంది. “బంగారం నగదీకరణ పథకం, అత్యవసరం కాని బంగారు కొనుగోళ్లను వాయిదా వేయాలన్న ప్రధానమంత్రి మోదీ బహిరంగ విజ్ఞప్తి ద్వారా.. ప్రభుత్వం ఈ నిద్రాణమైన సంపదను సమీకరించడం, కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) ను తగ్గించడం, విదేశీ మారకపు ఒత్తిడిని తగ్గించడం, ఇప్పటికే ఉన్న గృహ నిల్వల నుండి దేశీయ సరఫరా గొలుసును సృష్టించడం ద్వారా దిగుమతులపై భారతదేశం ఆధారపడటాన్ని మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది’’ అని ఛాయిస్ బ్రోకింగ్‌లోని కమోడిటీ అనలిస్ట్ కావేరి మోర్ ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో చెప్పారు.

కేవలం 1శాతం బంగారం రీసైకిల్ చేసినా..

నిపుణుల అంచనా ప్రకారం.. ఇండ్లలో, దేవాలయాల్లో ఉన్న బంగారంలో కేవలం ఒక శాతం మాత్రమే ప్రతి సంవత్సరం రీసైకిల్ చేసినా, భారతదేశ బంగారం దిగుమతులు 25శాతం నుంచి 30శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. దీనిద్వారా విదేశీ మారక నిల్వలు ఆదా అవుతాయి. దేశ ఆర్థిక స్థిరత్వానికి మేలు జరుగుతుంది. వాస్తవానికి.. భారతీయ సంస్కృతిలో బంగారం సంపదకు, భద్రతకు, వారసత్వానికి ప్రతీక. పెండ్లిళ్లు, బహుమతులు, వారసత్వ సంపద రూపంలో వచ్చిన బంగారం చాలా కుటుంబాల్లో సంవత్సరాల నుంచి ఉపయోగించకుండా పలు విధాల్లో భద్రతపర్చి ఉంది. అయితే, పాత డిజైన్ల నగలను కొత్తవిగా మార్చుకోవడం ద్వారా లేదంటే నగదుగా మార్చుకోవడం ద్వారా ఆ బంగారం మళ్లీ ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది. దీని ద్వారా భారతదేశంలోకి బంగారం దిగుమతులు తగ్గుతాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది బలోపేతం అవుతుంది.

Annamalai : బీజేపీకి అన్నామలై రాజీనామా.. నితిన్ నబిన్‌కు రాజీనామా లేఖ అందజేత..?
Annamalai : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిసింది. ఈ మేరకు మంగళవారం జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు తన రాజీనామా లేఖను సమర్పించినట్లు సమాచారం. అయితే, ఇవాళ సాయంత్రం కేంద్ర మంత్రి అమిత్ షాతో అన్నామలై భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ తరపున రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేసినప్పటికీ అన్నామలై తిరస్కరించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే, అన్నామలై రాజీనామా విషయంపై ఇప్పటి వరకు ఆ పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

Also Read : Trump – Netanyahu : ఇదెక్కడి ట్విస్ట్.. నెతన్యాహుని బండబూతులు తిట్టిన ట్రంప్.. నేను రక్షించకపోతే..

అన్నామలై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో 2020లో బీజేపీలో చేరారు. వెంటనే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఏడాది తర్వాత ఎల్. మురుగన్ కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్లడంతో ఆయన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పదోన్నతి పొందారు. సాంప్రదాయకంగా ద్రావిడ ప్రధాన పార్టీల ఆధిపత్యంలో ఉన్న తమిళనాడులో అన్నామలై బీజేపీ ప్రాబల్యాన్ని గణనీయంగా పెంచారు. ఉధృతమైన ప్రచారాలు, విస్తృతమైన క్షేత్రస్థాయి పర్యటనలు, సోషల్ మీడియా ద్వారా ప్రజలను చేరుకోవడం ద్వారా, ఆయన పార్టీ సంస్థాగత విస్తరణకు సాయ పడటంతో పాటు, గణనీయమైన వ్యక్తిగత అనుచర వర్గాన్ని కూడా నిర్మించుకున్నారు.

అయితే, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తమిళనాడు బీజేపీలో అధ్యక్ష మార్పు జరగాలని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి పట్టుబట్టడంతో అన్నామలై స్థానంలో నూతన అధ్యక్షుడిని బీజేపీ అధిష్టానం నియామకం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలై బరిలోకి దిగుతారని అందరూ భావించారు. కానీ, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అలాగే బీజేపీ ప్రచారంలో కూడా అన్నామలై ప్రముఖ పాత్ర పోషించలేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘోర ఓటమి తరువాత అన్నామలై బీజేపీ వీడి కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే, తాజాగా.. అన్నామలై బీజేపీకి రాజీనామా చేశారని, రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడికి అందజేసినట్లు సమాచారం. అయితే, ఇవాళ సాయంత్రం అమిత్ షాతో అన్నామలై భేటీ అవుతారని తెలిసింది. ఆ భేటీ తరువాత అన్నామలై నిర్ణయంలో ఏమైనా మార్పు ఉంటుందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది.

బీజేపీకి రాజీనామా చేసిన తరువాత అన్నామలై మొదట ఒక ఉద్యమాన్ని, ఆ తర్వాత పార్టీని ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ఒకే రకమైన భావాలు గల వ్యక్తులను చేర్చుకోవడం, బలమైన స్వచ్ఛంద కార్యకర్తల నెట్‌వర్క్‌ను నిర్మించడం అన్నామలై లక్ష్యం అని చెబుతున్నారు. ఈ కొత్త ఉద్యమం పెద్ద ఎత్తున పని చేస్తుందని, విభిన్న వృత్తిపరమైన సామాజిక నేపథ్యాల నుండి స్వచ్ఛంద కార్యకర్తలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుందని భావిస్తున్నారు.

Annamalai: అన్నామలై సంచలనం..! బీజేపీకి గుడ్ బై? త్వరలో సొంత పార్టీ?
Annamalai: అన్నామలై బీజేపీని వీడనున్నారా? సొంత పార్టీని ప్రారంభించబోతున్నారా? ఇప్పుడీ వ్యవహారం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అన్నామలై ఇష్యూ తమిళ రాజకీయాల్లో హీట్ పెంచాయి. బీజేపీలో తనకు అవకాశం, భవిష్యత్తు లేవని తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై పేర్కొన్నారని, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌తో సమావేశం అనంతరం ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. అన్నామలైకు బీజేపీ హైకమాండ్ రాజ్యసభ సీటును ఆఫర్ చేసిందని.. అయితే, అన్నామలై ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది.

బీజేపీని వీడి మొదట ఒక ఉద్యమాన్ని, ఆ తర్వాత పార్టీని అన్నామలై ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ఒకే రకమైన భావాలు గల వ్యక్తులను చేర్చుకోవడం, బలమైన స్వచ్ఛంద కార్యకర్తల నెట్‌వర్క్‌ను నిర్మించడం అన్నామలై లక్ష్యం అని చెబుతున్నారు. ఈ కొత్త ఉద్యమం పెద్ద ఎత్తున పని చేస్తుందని, విభిన్న వృత్తిపరమైన సామాజిక నేపథ్యాల నుండి స్వచ్ఛంద కార్యకర్తలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుందని భావిస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో 2020లో బీజేపీలో చేరారు అన్నామలై. వెంటనే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఏడాది తర్వాత ఎల్. మురుగన్ కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్లడంతో ఆయన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పదోన్నతి పొందారు.

సాంప్రదాయకంగా ద్రావిడ ప్రధాన పార్టీల ఆధిపత్యంలో ఉన్న తమిళనాడులో అన్నామలై బీజేపీ ప్రాబల్యాన్ని గణనీయంగా పెంచారు. ఉధృతమైన ప్రచారాలు, విస్తృతమైన క్షేత్రస్థాయి పర్యటనలు, సోషల్ మీడియా ద్వారా ప్రజలను చేరుకోవడం ద్వారా, ఆయన పార్టీ సంస్థాగత విస్తరణకు సాయ పడటంతో పాటు, గణనీయమైన వ్యక్తిగత అనుచర వర్గాన్ని కూడా నిర్మించుకున్నారు.

గత కొన్నేళ్లుగా బీజేపీకి ఉన్న ఊపును ఆధారంగా చేసుకుని, ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని అన్నామలై భావించారు. అయితే, బీజేపీ నాయకత్వం ఏఐఏడీఎంకేతో తమ పొత్తును పునరుద్ధరించింది. అధికారంలో ఉన్న డీఎంకేకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఓట్లను ఏకీకృతం చేయడానికి తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంగా ఈ చర్యను చాలామంది భావించారు.

తమిళనాడు బీజేపీలో నాయకత్వ మార్పులు జరగాలని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి పట్టుబట్టడంతో, అన్నామలై స్థానంలో రాష్ట్ర అధ్యక్షుడిని నియమించడంతో ఈ కూటమి పునరాగమనం జరిగింది. పార్టీలో తనను పక్కన పెడుతున్నారనే ఊహాగానాలకు ఆజ్యం పోస్తూ, అన్నామలై 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అలాగే బీజేపీ ప్రచారంలో కూడా ప్రముఖ పాత్ర పోషించలేదు.

Also Read: 8వ వేతన సంఘంపై బిగ్ అప్‌డేట్.. 338 శాతం పెరగనున్న ఉద్యోగుల జీతాలు? 5 ఫ్యాక్టర్ ఫార్ములా లెక్కలివే..!

Char Dham Yatra: చార్ ధామ్.. ట్రాఫిక్ జామ్.. 30 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
Char Dham Yatra: పర్యాటకులు, భక్తులు ఉత్తరాదికి పోటెత్తారు. సెలవులు కావడంతో టూరిస్టుల రాకతో పర్యాటక ప్రాంతాలు భక్తుల రాకతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. చార్ ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్ కు భక్తులు పోటెత్తారు. కేదార్ నాథ్ కు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆ మార్గం మొత్తం భక్తులతో నిండిపోయింది.

బద్రీనాథ్ యాత్ర మార్గంలో కీలకమైన జోషి మఠ్ ప్రాంతంలో ఊహించని స్థాయిలో వాహనాల రద్దీ పెరిగిపోయింది. దీంతో దాదాపు 30 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. టూరిస్టులు వాహనాల్లో చిక్కుకుపోయారు. ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు నడక మార్గంలోని భీంబలి, లించోలి, జంగ్లీ చట్టి వంటి కీలక ప్రాంతాల్లో దారి అత్యంత ఇరుక్కుగా ఉండటం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలతో ప్రయాణించే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు గుర్రాలు, పల్లకీలు, స్థానిక సేవా కార్యకర్తల రాకపోకలు వివిధ ప్రదేశాల్లో రద్దీని మరింత పెంచుతున్నాయి. ఫలితంగా భక్తులు గంటల తరబడి రద్దీలో చిక్కుకుపోయారు. ముందుకు సాగేందుకు మార్గం సుగమం అయ్యేంత వరకు వీరంతా వేచి ఉండక తప్పని పరిస్థితి.

ఉత్తరాఖండ్ లోని ముస్సోరికి సైతం టూరిస్టులు క్యూ కట్టారు. వేసవి కాలం కావడం, వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. డెహ్రాడూన్, ముస్సోరి రహదారిపై పర్యాటకుల రద్దీతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హిమాచల్ ప్రదేశ్ లోనూ ఇవే సీన్లు కనిపిస్తున్నాయి. వీకెండ్ సందర్భంగా కులు ప్రాంతానికి పర్యాటకులు రాక ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో పాల్చాన్ నుంచి మనాలీ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Also Read: క్రెడిట్ కార్డుదారుడు మరణిస్తే బిల్లు ఎవరు కడతారు? బ్యాంకు ఎలా వసూలు చేస్తుంది?

Bihar Teacher : ఇంత నమ్మక ద్రోహమా.. కూలి పని చేసి భార్యను చదివిస్తే.. ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక
Bihar Teacher : పెళ్లి తర్వాత చదువుకుంటాను, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతాను, ఉద్యోగం చేస్తాను అంటే వద్దనే భర్తలు నేటి కాలంలో కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. తన భార్యకు చదువుకోవాలని కోరిక ఉందని తెలిసి అతడు ఆమెను ఆ దిశగా ప్రోత్సహించాడు. పైగా భార్యను చదివించేందుకు ఆ భర్త కూలి పనులకు వెళ్లి.. ఉన్న పొలం సైతం అమ్మాడు. మరి అంతలా కష్టపడి చదివించి.. తనను ప్రయోజకురాలిని చేసిన భర్త పట్ల ఎంత ప్రేమ, అభిమానం, విశ్వాసం ఉండాలి? కానీ సదరు భార్య మాత్రం.. బాగా చదువుకుని ఉద్యోగం వచ్చాక.. కట్టుకున్న భర్తను, కన్న కొడుకును గాలికి వదిలేసి.. మరో వ్యక్తితో వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న భర్త.. దీని గురించి భార్యను ప్రశ్నించడానికి వెళ్లగా అక్కడ.. చూడకూడని రీతిలో భార్య కనిపించేసరికి అతడి గుండె ముక్కలైంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అలాగే దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

బీహార్‌లోని వైశాలి జిల్లా హాజీపూర్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. భర్త అమన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అతడికి 2013లో గుంజన్ కుమారి అనే మహిళతో వివాహం అయ్యింది. అప్పటికే ఆమె ఇంటర్ పూర్తి చేసింది. అయితే పెళ్లి తర్వాత టీచర్ కావడమే తన లక్ష్యమని గుంజన్ తన భర్తకు చెప్పింది. భార్యను చదివించేందుకు తన ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా సరే అమన్ మాత్రం వెనకడుగు వేయలేదు. తాను కూలి పనులు చేస్తూ గుంజన్‌ను చదివించాడు. డిగ్రీ, బీఈడీ పూర్తి చేయడంతో పాటు బీపీఎస్సీ (BPSC) టీచర్ నియామక పరీక్ష సన్నద్ధత కోసం పొలం అమ్మి డబ్బులు సమకూర్చాడు.

సర్కార్ కొలువు వచ్చాక..

ఇదిలా ఉంటే గుంజన్ కుమారి BPSC TRE-02 నియామక ప్రక్రియలో టీచర్ కొలువు సాధించింది. శిక్షణ తర్వాత.. ఆమెకు బిదుపూర్ బ్లాక్‌లోని ఒక సర్కార్ బడిలో పోస్టింగ్ ఇచ్చారు. అయితే ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత గుంజన్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. మరో వ్యక్తితో సన్నిహితంగా మెలగడం ప్రారంభించింది. ఈ క్రమంలో 2025 జనవరిలో గుంజన్ తమ 10 ఏళ్ల కుమారుడు ఆరుష్ ఆర్యను తన భర్త అమన్ వద్దకు పంపించి, తాను తన తోటి టీచర్లు అందరితో కలిసి డార్జిలింగ్ వెళ్తున్నానని భర్తకు చెప్పింది.

ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గుంజన్ చెప్పినట్లు.. ఇతర టీచర్లు ఎవరూ కూడా డార్జిలింగ్ వెళ్లలేదని అమన్‌కు తెలిసింది. దీంతో గుంజన్‌పై అతడికి అనుమానం మొదలయ్యింది. దీని గురించి ఆరా తీయగా.. టీచర్ ట్రైనింగ్ సమయంలో గుంజన్‌కు ప్రేమ్ ప్రకాశ్ జైస్వాల్ అనే మరో టీచర్‌తో సంబంధం ఏర్పడిందని.. అందుకే కుటుంబానికి దూరంగా ఉంటుందని అమన్‌కు తెలిసింది.

చూడకూడని స్థితిలో భార్య

ఈ క్రమంలో వారం రోజుల క్రితం, అంటే మే 23న అమన్.. హాజీపూర్‌లోని లిచ్ఛవి నగర్ ప్రాంతంలో గుంజన్ నివాసం ఉంటున్న అద్దె ఇంటి వద్దకు వెళ్లాడు. అతడు వెళ్లేసరికే.. గుంజన్, ప్రేమ్ ప్రకాశ్‌తో కలిసి ఉండడాన్ని చూసి అమన్ షాకయ్యాడు. ఏం చేయాలో పాలుపోక వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అమన్ రాక గురించి తెలుసుకున్న గుంజన్.. బయటకు వచ్చి అతడితో గొడవపడింది. ఈ క్రమంలో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Betrayal of Sacrifices: Wife Leaves Husband After BPSC Success

The shocking case of Aman Kumar from Hajipur, Bihar, exposes a bitter reality of changing attitudes after financial independence.

Aman worked day and night, selling ancestral land to fund the education of his… pic.twitter.com/jryTz01uer

— Ramesh Tiwari (@rameshofficial0) May 29, 2026

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక, ఈ వివాదంలో వారి కుమారుడు కూడా కేంద్ర బిందువుగా మారాడు. గుంజన్.. మరో వ్యక్తిని “అంకుల్” అని పిలవాలని తనని ఒత్తిడి చేసిందని, తనకు తల్లితో కలిసి ఉండాలని లేదని ఆ బాలుడు చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి.

Madhya Pradesh Farmer : ఇదేం పోయే కాలం రా నాయనా.. బాబాగా మారాలని.. గొడ్డలితో ప్రైవేట్ పార్ట్ నరుక్కున్న వ్యక్తి
మధ్యప్రదేశ్ లో దారుణం

బాబాగా మారాలని రైతు దారుణ నిర్ణయం

ప్రైవేట్ పార్ట్ నరుక్కున్న వ్యక్తి

Madhya Pradesh Farmer : కొందరు జనాల తీరు చూస్తే అసలు వాళ్లకి బుర్ర, బుద్ధి ఉందా లేదా అనే ఆలోచన రాకమానదు. అంత ఆలోచన లేకుండా అలా ఎలా ప్రవర్తిస్తారో అర్థం కాదు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ దారుణ సంఘటన వెలుగుచూసింది. బాబాగా మారాలని నిర్ణయించుకున్న ఓ వ్యక్తి.. దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. గొడ్డలితో తన ప్రైవేట్ పార్ట్‌ను నరుక్కున్నాడు. పాపభీతి నుంచి విముక్తి పొందడం కోసం ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఆ వివరాలు..

ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్ జిల్లాలో వెలుగుచూసింది. బాబాగా మారాలని భావించిన ఒక రైతు (42) గొడ్డలితో తన జననాంగం నరుక్కుని బావిలో విసిరేశాడు. ఈ సంఘటన మహారాజ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం వెలుగుచూసింది. కుటుంబ బాధ్యతల నుంచి బయటకు వచ్చి.. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించి.. పాపభీతి నుంచి విముక్తి పొందాలని భావించిన బాధితుడు.. బాబాగా మారాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో శరీరంలోని జననాంగమే మనిషిలోని కోరికలకి ప్రధాన కారణమని.. పాపం చేయడానికి ప్రేరేపించే ఈ అవయవం తన శరీరంలో ఉండకూడదని భావించి.. ఆ నిర్దిష్ట భాగాన్ని తొలగించాలని అనుకున్నాడు.

*రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

ఈ క్రమంలోనే పొలంలోని బావి వద్దకు వెళ్లిన బాధితుడు.. ఈ దారుణ చర్యకు పూనుకున్నాడు. గొడ్డలితో ప్రైవేట్ భాగాన్ని నరుక్కుని దాన్ని బావిలోకి పడేశాడు. అనంతరం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. పొలం దగ్గరకు వచ్చి చూసేసరికి రక్తస్రావంతో పడి ఉన్న అతడిని గమనించారు. వెంటనే ఆయన్ను ఛతర్‌పుర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు.

*21కేసులు.. 14ఏండ్లుగా పరారీ.. మోస్ట్ వాంటెండ్ రౌడీ షీటర్‌ను పట్టించిన గ్యాస్ కనెక్షన్..

బాధితుడికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం ఉన్నారు. పెద్ద కుమార్తెకు వచ్చే నెల, అనగా జూన్ 25న వివాహం జరగాల్సి ఉంది. ఇదిలా ఉంటే బాధితుడి భార్య గత కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. భార్య అనారోగ్యం, కుటుంబంలో ఆర్థిక సమస్యల వల్ల బాధితుడు గత కొద్దిరోజులుగా తీవ్రమైన మానసిక వేదనతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఇలాంటి ఓ దారుణ నిర్ణయం తీసుకున్నాడని భావిస్తున్నారు. బాధితుడు చేసిన పని వల్ల రక్తస్రావం తీవ్రంగా జరిగిందని, ప్రస్తుతం చికిత్స కొనసాగిస్తున్నట్లు డాక్టర్ వెల్లడించారు.

Abhishek Banerjee Attacked: మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడిపై దాడి.. రాళ్లు, గుడ్లు, చెప్పులతో అటాక్..
Abhishek Banerjee Attacked: వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీపై దాడి జరిగింది. రాళ్లు, కోడి గుడ్లు, చెప్పులతో ఆయన పై అటాక్ చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

రాష్ట్రంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో బాధితులను పరామర్శించేందుకు ఎంపీ అభిషేక్ బెనర్జీ సోనార్ పూర్ కు వెళ్లారు. ఈ పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. స్థానికులు తిరగబడ్డారు. కోపంతో ఊగిపోయారు. అభిషేక్‎పై దాడి చేశారు. రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. ఆయన చొక్కా పట్టుకుని లాగారు. కొందరు చేయి చేసుకున్నారు. అభిషేక్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాడి నుంచి కాపాడుకునేందుకు అభిషేక్ బెనర్జీ క్రికెట్ ప్లేయర్లు వాడే హెల్మెట్ ధరించాల్సి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఆయన సిబ్బంది.. అభిషేక్ ను చుట్టుముట్టి రక్షణగా నిలిచారు.

స్థానికుల దాడితో అభిషేక్ బెనర్జీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు బీజేపీనే కారణమని ఆయన ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే తనపై దాడి జరిగిందన్నారు. వాళ్లు తనను చంపేందుకు ప్రయత్నించారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తనపై దాడి సమయంలో పోలీసులు అక్కడ కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ ఘటనపై న్యాయ పోరాటం చేస్తానని అభిషేక్ బెనర్జీ తెలిపారు. అదృష్టవశాత్తూ హెల్మెట్ ధరించడం వల్ల తన తలకు ఏమీ కాలేదన్నారు. తన బట్టలు చించి, కళ్లజోడు పగలగొట్టారని వాపోయారు. దాడిలో గాయపడ్డ అభిషేక్ బెనర్జీ కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. మమతా బెనర్జీ ఆసుపత్రికి వెళ్లి అభిషేక్‎ను పరామర్శించారు.

అభిషేక్ బెనర్జీపై దాడి ఘటనపై టీఎంసీ తీవ్రంగా స్పందించింది. ఈ దాడికి అధికార బీజేపీనే కారణమని ఆరోపించింది. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు కరెక్ట్ కాదంది. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయంది. కాగా, అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ ఎంపీగా ఉన్నారు. ఇక, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్నారు.

Here’s a longer video of Abhishek Banerjee being pelted with eggs.

Enjoy 3 minutes and 19 seconds of pure retribution https://t.co/F02GyepZzg pic.twitter.com/pV6AIrkTNH

— Nupur J Sharma (@UnSubtleDesi) May 30, 2026

Here’s a longer video of Abhishek Banerjee being pelted with eggs.

Enjoy 3 minutes and 19 seconds of pure retribution https://t.co/F02GyepZzg pic.twitter.com/pV6AIrkTNH

— Nupur J Sharma (@UnSubtleDesi) May 30, 2026

BIG NEWS  Abhishek Banerjee lost his cool on Media

“You all are asking 1 question 10 times”

“They threw eggs at me”

“Look at what’s happened to my glasses”

“See, People are still meeting us and still greeting us with lots of respect”

“We will let the Calcutta high… https://t.co/kEhhiSi8yk pic.twitter.com/h7EjRg79g4

— News Algebra (@NewsAlgebraIND) May 30, 2026

CM Vijay Wife Joins In BJP : బీజేపీలోకి సీఎం విజయ్ భార్య సంగీత.. అబ్బో ఇది మాములు ట్విస్ట్ కాదు భయ్యా..!
తమిళ నాట ఆసక్తికర చర్చ

బీజేపీలోకి సీఎం విజయ్ భార్య సంగీత

త్వరలోనే చేరికపై ప్రకటన అంటూ ప్రచారం

Sangeetha Joins BJP : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీవీకే విజయ్ కి త్వరలోనే భారీ షాక్ తగలబోతుందని జోరుగా ప్రచారం సాగుతుంది. కారణం విజయ్ భార్య సంగీత సోర్నలింగం త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారంటూ తమిళనాట బలంగా ప్రచారం అవుతోంది. ఎన్నికలకు ముందు నుంచే విజయ్, సంగీత మధ్య విభేదాలు తెర మీదకు వచ్చాయి. అతడికి త్రిషతో సంబంధం ఉందని.. ఆ కారణంగానే సంగీత విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. చివరకు అవి నిజమే అని తెలిసాయి. విజయ్ విజయం సాధించి.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేళ కనీసం ఆయన పిల్లలు కూడా వేదిక వద్ద కనిపించలేదు. తండ్రికి అభినందనలు తెలపలేదు. అదే రోజు త్రిష తీరు నెట్టింట భారీ స్థాయిలో విమర్శలకు దారి తీసింది.

ఇదిలా ఉంచితే ఇప్పటికే సంగీత-విజయ్ ల మధ్య విభేదాలను దృష్టిలో పెట్టుకుని.. విజయ్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టే వ్యూహంలో భాగంగా.. సంగీతను కాషాయ పార్టీలో చేర్చుకోబోతున్నారని సమాచారం. బీజేపీకి చెందిన ఓ ప్రముఖ సినీ నటి, జాతీయ నాయకురాలు సంగీతను పార్టీలోకి తీసుకురావడానికి తెరవెనుక గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే.. విజయ్ కి ఇబ్బందులు తప్పవని.. ప్రత్యక్షంగా వ్యక్తిగత విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. బీజేపీ పార్టీ సంగీతను ముందు పెట్టి విజయ్ ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తుందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

*విజయ్ డివోర్స్ కేసు.. 250 కోట్లతో క్లోజ్ చేయాలనుకుంటున్నాడా?

ఇదిలా ఉంటే గత కొన్నేళ్లుగా విజయ్, సంగీతల మధ్య దూరం పెరిగిందని.. నటి త్రిషతో విజయ్ కు ఉన్న సాన్నిహిత్యంపై సంగీత అభ్యంతరం తెలపడం, విడాకులకు దరఖాస్తు చేయడం, పైగా అందుకు ఆమె భారీగా భరణం కోరడం వంటి కథనాలు గతంలో తమిళ మీడియాలో హల్‌చల్ చేశాయి. ప్రస్తుతం సంగీత తన పిల్లలతో కలిసి విదేశాల్లో ఉంటున్నారు.

ఎన్నికల ముందు ఈ వివాదాలు తెర మీదకు వచ్చాయి. ఈ వ్యక్తిగత వివాదాల ప్రభావం ఎన్నికలపై పడుతుందని భావించినా, ప్రజలు విజయ్‌కే పట్టం కట్టారు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ సంగీత, పిల్లలు హాజరుకాకపోవడం గమనార్హం. విజయ్ ని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందని.. అందుకే సంగీత బీజేపీలో చేరతారని రాజకీయ ఊహాగానాలు తెరపైకి వచ్చాయని చెన్నై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీనిపై అటు బీజేపీ, ఇటు సంగీత ఎవరూ స్పందించలేదు.

*విజయ్ కి షాక్ ఇచ్చిన కొడుకు.. తండ్రి పేరును తొలగించిన జాసన్ సంజయ్.. తల్లికి సపోర్ట్ గానే

శ్రీలంక తమిళ వ్యాపార కుటుంబానికి చెందిన సంగీత, లండన్‌లో స్థిరపడ్డారు. విజయ్‌కు అభిమాని అయిన ఆమె, 1999లో ఆయనను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు జేసన్ సంజయ్, దివ్య సాషా ఉన్నారు. ప్రస్తుతం పిల్లలతో కలిసి సంగీత విదేశాల్లో ఉంటున్నారు.

Rajasthan Sand Storm: రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
Rajasthan Sand Storm: ఎడారి రాష్ట్రం రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. చురు, బికనీర్ లో భారీ ఇసుక తుఫాన్ చోటు చేసుకుంది. ఇసుక తుఫాన్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. అనేక చెట్లు నేలకూలాయి. అరగంట పాటు ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది.

చురు, బికనీర్, భరత్ పూర్ తదితర ప్రాంతాలపై ఈ ఇసుక తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు 100 అడుగుల ఎత్తు నుంచి ఇసుక తుఫాన్ నగరాలను కమ్మేసింది. ఇళ్లు, వ్యవసాయ పొలాలు, రోడ్లు అన్నీ ఇసుకతో నిండిపోయాయి. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇసుక తుఫాన్ బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. అందులో ఇసుక తుఫాన్ సృష్టించిన బీభత్సం చూసి అంతా భయపడిపోతున్నారు.

శనివారం రాజస్థాన్‌లోని చురులో భారీ నలుపు-పసుపు ధూళి తుఫాను వీచింది. దట్టమైన ఇసుక మేఘాలు భూభాగాన్ని కప్పేయడంతో, ఆ ప్రాంతం మొత్తం అంధకారం కమ్ముకుంది. విజిబులిటీ తీవ్రంగా తగ్గిపోయింది. మధ్యాహ్నం బికనీర్‌లో కూడా ఒక తీవ్రమైన తుఫాను భారీ ధూళి గోడను సృష్టించింది. ఎడారి రాష్ట్రంలో మరోసారి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి.

పశ్చిమ ఆటంకం (వెస్ట్రన్ డిస్ట్రబెన్స్) ప్రభావం కారణంగా రాబోయే కొద్ది రోజుల్లో రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, దుమ్ము తుఫానులు, వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) తెలిపింది. గత 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ధోల్పూర్‌లోని బారిలో అత్యధికంగా 58 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

బికనీర్, జైపూర్, అజ్మీర్, భరత్‌పూర్, కోటా, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్ డివిజన్‌లలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని జైపూర్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే నాలుగైదు రోజుల పాటు అస్థిర వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని కారణంగా, చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44°C కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు.

Also Read: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్..

VIDEO | Rajasthan: Massive black-and-yellow sandstorm dust storm engulfs Churu during the day. Near-zero visibility as massive clouds of sand sweeps across the landscape.

(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/yXgwdbECnW

— Press Trust of India (@PTI_News) May 30, 2026

#WATCH | Rajasthan: A severe storm kicked up a massive wall of dust in Bikaner this afternoon. pic.twitter.com/qc9DiZwL3c

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 30, 2026