Mt Everest : ఆమె గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి.. పేస్‌మేకర్‌తో ఎవరెస్టు ఎక్కి రికార్డ్ కొట్టాలనుకుంది.. చివరికి..

సుజానే 59 ఏళ్ల మహిళ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. గుండెకు పేస్ మేకర్ అమర్చినా ఎవరెస్ట్ ఎక్కి రికార్డు సాధించాలని కల గన్నారు. అదే లక్ష్యంతో ముందుకు సాగారు. కల నెరవేరకుండానే అనారోగ్యంతో చనిపోయారు.

Mt Everest  :  ఆమె గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి.. పేస్‌మేకర్‌తో ఎవరెస్టు ఎక్కి రికార్డ్ కొట్టాలనుకుంది.. చివరికి..

Mt Everest

female climber died near Everest Base Camp : ఎవరెస్టు అధిరోహించడం ఆమె కల. ఆ కల నెరవేరకుండానే ఆమె మరణించింది. పేస్‌మేకర్‌తో గుండె ధైర్యం తెచ్చుకున్నా ఆమె ఆశలు ఆవిరైపోయాయి.

China : ఎవరెస్ట్‌ శిఖరంపై వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన చైనా

భారత్ కు చెందిన 59 ఏళ్ల సూజానే లియోపోల్డినా జీసస్ కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నారు. వైద్యులు ఆమెకు పేస్‌మేకర్ అమర్చారు. ఎవరెస్ట్ ఎక్కడం సుజానే కల. అయితే పేస్‌మేకర్‌తో ఎవరెస్టు అధిరోహించిన మహిళగా రికార్డు కొట్టాలని ఆమె డిసైడ్ అయ్యారు. అదే పట్టుదలగా ముందుకు వెళ్లారు. బేస్ క్యాంపు దగ్గర జరిగిన శిక్షణలో ఆరోగ్యం సహకరించకపోవడంతో సిబ్బంది ఆమెను ముందుకు వెళ్లవద్దని హెచ్చరికలు సైతం జారీ చేశారు. అయినా వారి మాటలు ఆమె లెక్క చేయలేదు తన లక్ష్యం నెరవేరే దాకా అడుగు వెనక్కి వేసేది లేదని తేల్చి చెప్పారు.

Neeraj Chaudhary : కరోనాను జయించి..ఎవరెస్ట్ శిఖరంపై భారత జెండాను రెపరెపలాడించి..

సాధారణంగా 250 మీటర్ల ఎత్తు చేరుకోవడానికి 15 నుంచి 20 నిముషాలు పడుతుంది. అయితే సుజానేకి ఐదు గంటలు పట్టింది. బేస్ క్యాంపు నుంచి 5,800 కిలోమీటర్లు ఎత్తుకు చేరడం అంటే ఆషామాషీ కాదు. అలాంటి పరిస్థితుల్లో ఆమెను నేపాల్‌లోని లుక్లా అసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సుజానే కన్నుమూశారు. ఎలాగైనా రికార్డు సాధించాలనుకున్న సుజానే కల అనారోగ్యం కారణంతో మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఈ సీజన్ లో ఎవరెస్ట్ అధిరోహించడానికి వచ్చిన వారిలో ఎనిమిది మంది చనిపోయినట్లు నేపాల్ పర్యాటక విభాగం తెలిపింది.