Female Covid cases: మహిళలపై కరోనా ప్రభావం.. గతంలో కంటే పెరిగిన కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉంది. ఓ పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతుండటం.. మరో పక్క కేసుల సంఖ్య పెరుగుతుండంటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంతో పోల్చితే సెకండ్ వేవ్ ప్రభావం మహిళలపై అధికంగా పడింది. తెలంగాణ మహిళల్లో కోవిడ్ - 19 వ్యాప్తి ఎక్కువగా ఉందని తాజా గణాంకాలు చెబుతున్నాయి.

Female Covid cases: మహిళలపై కరోనా ప్రభావం.. గతంలో కంటే పెరిగిన కేసులు

Female Covid Cases

Female Covid cases: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉంది. ఓ పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతుండటం.. మరో పక్క కేసుల సంఖ్య పెరుగుతుండంటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంతో పోల్చితే సెకండ్ వేవ్ ప్రభావం మహిళలపై అధికంగా పడింది. తెలంగాణ మహిళల్లో కోవిడ్ – 19 వ్యాప్తి ఎక్కువగా ఉందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది జులై నెలలో కరోనా బారిన పడుతున్న మహిళలు 34 శాతం ఉండగా, ఆ సంఖ్య ఇప్పుడు 38.5 శాతానికి చేరింది. తాజాగా ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.

ICU లో చేరే మహిళా రోగుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోందని తెలుస్తుంది. గతంలో ICU అడ్మిషన్లు 33 శాతంగా ఉండగా ఇప్పుడు 39 శాతానికి చేరింది. ఇక వైరస్ బారినపడిన మహిళల సంఖ్య పెరగడానికి వైరస్ లో వచ్చిన మార్పే కారణం అంటున్నారు నిపుణులు. సాధారణంగా మహిళలు పురుషుల లాగా బయటకు వెళ్లే అవకాశం తక్కువ. అయితే యువతులు ఎక్కువగా బయటకు వెళ్లడం వల్ల ప్రస్తుతం వారికి కరోనా సోకుతుంది.

అందువల్ల బయటకు వెళ్లే మహిళలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఐదు పొరలు ఉన్న నాణ్యమైన మాస్క్ వాడాలి. సాధారణ గుడ్డలు, చున్నీలు, సర్జికల్ మాస్కులు, బురఖాల వంటివి కరోనాను ఆపలేవని డాక్టర్లు చెబుతున్నారు. రెండు మాస్కులు తరించడం తప్పనిసరి అని డాక్టర్లు తేల్చి చెబుతున్నారు.

దేశ వ్యాప్తంగా ఉన్న గణాంకాలను ఒక సారి పరిశీలిస్తే.. మే 1 నాటికి దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి పురుషుల్లో 64.6 శాతం, మహిళల్లో 35.4 శాతంగా ఉంది. మే9 నాటికి ఈ సంఖ్య 61.5, 38.4 శాతానికి చేరింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మహిళల్లో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. సెకండ్ వేవ్ సమయంలోనే మహిళలు అధిక సంఖ్యలో కరోనా బారినపడినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక 21 నుంచి 40 సంవత్సరాల వయసు మధ్య మహిళలు అధికంగా అధికంగా కరోనా బారినపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

ఇక గతేడాది జూన్ – జులై నెలల్లో మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలు విడుదల చేసిన లింగవారీ డేటాను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రంలో కరోనా బారినపడిన మహిళల సంఖ్య అధికంగా ఉంది. ఇక్కడ 42 శాతం మంది మహిళలు కరోనా బడినపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (38), కర్ణాటక (36) తమిళనాడు (32) శాతాలతో ఉన్నాయి. అత్యల్పంగా జార్ఖండ్‌లో 25 శాతం కేసులు బయటపడ్డాయి.