Festival : పండుగ సీజన్.. వీటి ధరలకు రెక్కలు

ప్రతి ఏడాది పండుగ సీజన్ లో ప్రాడక్టు కంపెనీలు డిస్కౌంట్స్ ఇస్తుంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం రేట్లు పెంచేందుకు సిద్ధమయ్యాయి కంపెనీలు.

Festival : పండుగ సీజన్.. వీటి ధరలకు రెక్కలు

Festival

Festival : పండుగ సీజన్ వచ్చిందంటే.. ప్రోడక్ట్ ల అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయి. కంపెనీలు వినియోగదారులకు భారీ డిస్కౌంట్స్ ఇస్తుంటాయి. డిస్కౌంట్స్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుంటాయి. దీంతో పండుగ సీజన్ లో సేల్ విపరీతంగా పెరుగుతుంటుంది. కొత్త వస్తువులు కొనాలి అనుకునే వారు పండుగ సీజన్ వరకు ఆగి కొనుగోలు చేస్తారు. అయితే ఈ ఏడాది మాత్రం దానికి బిన్నంగా కనిపిస్తోంది. మునుపటిలా డిస్కౌంట్ ఇచ్చేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదు సరికదా భారీగా రేట్లు పెంచేందుకు సిద్ధమయ్యాయి. వివిధ రకాల ఉత్పత్తుల ధరల్ని 8 శాతం పెంచేందుకు పలు కంపెనీలు సిద్ధమయ్యాయి.

Read More : Telangana : ఏపీ వదిలేస్తా..తెలంగాణకు వస్తా – జేసీ దివాకర్ రెడ్డి

రానున్న దసరా, దీపావళి క్రిస్ట్మస్ పండుగల సందర్బంగా కార్లు, బైక్‌, స్మార్ట్‌ ఫోన్స్‌, ల్యాప్‌ ట్యాప్‌, టీవీ, రిఫ్రిజిరేటర్‌, ఎయిర్‌ కండీషనర్‌ ప్రాడక్ట్‌ల ధరల్ని పెంచనున్నట్లు ఎకనమిక్‌ టైమ్స్‌ తన నివేదికలో తెలిపింది. వీటిలో కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై 8శాతం వరకు, టూవీలర్లరపై 1 నుంచి 2శాతం వరకు పెరగనున్నాయి. బాష్, సిమెన్స్, హిటాచీ బ్రాండ్లు ధరలను 3 శాతం నుంచి 8 శాతానికి పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని సంస్థలు ఉత్పత్తుల ధరల్ని పెంచనున్నాయి.

Read More : Love Story Review : ‘లవ్ స్టోరీ’ రివ్యూ..

ఇక ఇదే అంశంపై ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ ఇండియా రీసెర్చ్ డైరెక్టర్ నవకేందర్ సింగ్ మాట్లాడుతూ..కొన్ని కంపెనీలు వచ్చే నెల ప్రారంభంలో ఇంట్లో వాడే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు 3శాతం నుంచి 7శాతం పెంచేలా నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. ఇక ఇప్పటికే ఆటోమొబైల్ రంగానికి చెందిన కార్లు, బైక్ ల ధరలు పెరిగాయి. కార్ల ధరలను కంపెనీలు జూన్ నెలలోనే పెంచాయి. ఆయా మోడల్‌ని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఉన్న కార్ల ధర రూ.50వేల నుంచి రూ.2.5లక్షల వరకు పెరిగింది. అదే విధంగా బైక్ ల ధరలు కూడా 2 వేల నుంచి 15 వేల రూపాయలవరకు పెరిగాయి.

ఇక గృహ నిర్మాణ దారులపై కూడా భారం పడేలా కనిపిస్తోంది. స్టీల్ ధరలు, అల్యూమినియం, రాగి ధరలు 20 నుంచి 25 శాతం పెరిగాయి. సెమికండక్టర్ల కొరత ఆటోమొబైల్ రంగాన్ని వేధిస్తోంది. ఇక వీటిపై కూడా 25 నుంచి 75 శాతం ధర పెరిగే అవకాశం ఉన్నట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. ఫ్యూయల్ రేట్ల పెరుగుదల తయారీ, రవాణాపై పడటంతో ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో క్రమంగా అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతూ వస్తున్నాయి.