Fifa World Cup-2022: ఫ్రాన్స్, అర్జెంటీనా ఫుట్‌బాల్ షర్టులు ధరించి పెళ్లి చేసుకున్న అమ్మాయి, అబ్బాయి

పెళ్లి సమయంలోనూ వారు తమకు ఇష్టమైన జట్లకు మద్దతు తెలుపుతూ ఆ దేశాలకు సంబంధించిన షర్టులను ధరించారు. పెళ్లి సమయంలో ఎన్నో విషయాలను మాట్లాడుకుంటారు. ఎన్నో అంశాలపై ఏకాభిప్రాయానికి వస్తారు. అయితే, తమకు ఇష్టమైన జట్ల విషయంలో మాత్రం ఈ పెళ్లికూతురు, పెళ్లికొడుకు రాజీ పడలేదు. ఇద్దరూ ఒకే జట్టుకు సంబంధించిన జెర్సీలు వేసుకోలేదు. పెళ్లికొడుకు అర్జెంటీనా స్టార్ మెస్సికి సంబంధించిన జెర్సీ వేసుకుంటే, పెళ్లికూతురు మాత్రం ఫ్రాన్స్‌ స్టార్‌ ఆటగాడు ఎంబాపె జెర్సీని ధరించింది.

Fifa World Cup-2022: ఫ్రాన్స్, అర్జెంటీనా ఫుట్‌బాల్ షర్టులు ధరించి పెళ్లి చేసుకున్న అమ్మాయి, అబ్బాయి

Fifa World Cup-2022

Fifa World Cup-2022: కేరళలో ఫుట్‌బాల్ అభిమానులు అధికంగా ఉంటారు. ఆ ఆటపై తమకు ఉన్న అభిమానాన్ని ఏదో రూపంలో బయటపెడుతుంటారు. గత రాత్రి అర్జెంటీనా-ఫ్రాన్స్ మధ్య ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మెస్సి సారథ్యంలోని అర్జెంటీనా జట్టు విజయం సాధించింది. ఇదే రోజున కేరళకు చెందిన సచిన్.ఆర్, ఆర్.అథిరా పెళ్లి జరిగింది.

అయితే, పెళ్లి సమయంలోనూ వారు తమకు ఇష్టమైన జట్లకు మద్దతు తెలుపుతూ ఆ దేశాలకు సంబంధించిన షర్టులను ధరించారు. పెళ్లి సమయంలో ఎన్నో విషయాలను మాట్లాడుకుంటారు. ఎన్నో అంశాలపై ఏకాభిప్రాయానికి వస్తారు. అయితే, తమకు ఇష్టమైన జట్ల విషయంలో మాత్రం ఈ పెళ్లికూతురు, పెళ్లికొడుకు రాజీ పడలేదు.

ఇద్దరూ ఒకే జట్టుకు సంబంధించిన జెర్సీలు వేసుకోలేదు. పెళ్లికొడుకు అర్జెంటీనా స్టార్ మెస్సికి సంబంధించిన జెర్సీ వేసుకుంటే, పెళ్లికూతురు మాత్రం ఫ్రాన్స్‌ స్టార్‌ ఆటగాడు ఎంబాపె జెర్సీని ధరించింది. మెడలో పూలదండ, నుదిటిపై బొట్లతో పాటు పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఫుట్ బాల్ జట్ల జెర్సీలు ధరించడం అందరినీ ఆకర్షించింది. పెళ్లిలో ఒకే జట్టుకు సంబంధించిన జెర్సీలు ధరించాలన్న రాజీపడకుండా ఎవరికి ఇష్టం వచ్చిన జట్టు జెర్సీని వారు ధరించారు.

పెళ్లికొడుకు సచిన్ కు అర్జెంటీనా స్టార్ మెస్సి అంటే చాలా ఇష్టం. అందుకే ఆ దేశ రంగులో ఉన్న జెర్సీపై మెస్సి అని రాసి ఉన్న జెర్సీ ధరించాడు. పెళ్లికూతురికి ఫ్రాన్స్ జట్టు అంటే ఇష్టం. అందుకే ఆమె ఆ దేశ రంగు జెర్సీని ధరించింది. వీరి పెళ్లి కొచ్చిలో జరిగింది. ఖతర్ లో జరిగిన ప్రపంచ కప్ మ్యాచుకు కొన్ని గంటల ముందే వీరి పెళ్లి ముగిసింది. అనంతరం వారు మ్యాచు చూశారు.

Messi Income: లెజెండ్ ఫుట్‭బాలర్ లియోనెల్ మెస్సీ సంపాదన.. ఈ భూమ్మీద మరే ఆటగాడికీ లేదట!