Jharkhand CM : సీఎం భార్యతో సహా.. 15 మందికి కరోనా

జార్ఖండ్ సీఎం హేమంత్​ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. సీఎం హేమంత్ సోరెన్​సతీమణి కల్పనా సోరెన్, ఆయన కుమారులు నితిన్, విశ్వజిత్ సహా మొత్తం 15 మంది కోవిడ్‌ బారినపడ్డారు.

Jharkhand CM : సీఎం భార్యతో సహా.. 15 మందికి కరోనా

Jharkhand Cm

Jharkhand CM : దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఆదివారం కేసుల సంఖ్య లక్ష 50 వేలు దాటింది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవరిని వదలడం లేదు ఈ వైరస్. ప్రస్తుతం దేశంలో థర్డ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. థర్డ్ వేవ్ లో సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతో మంది కోవిడ్‌ బారిన పడ్డారు.. తాజాగా, జార్ఖండ్ సీఎం హేమంత్​ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. సీఎం హేమంత్ సోరెన్​సతీమణి కల్పనా సోరెన్, ఆయన కుమారులు నితిన్, విశ్వజిత్ సహా మొత్తం 15 మంది కోవిడ్‌ బారినపడ్డారు.

చదవండి : Jharkhand : మోదీని దూషించిన యువకుడిపై దాడి.. గుంజీలు తీయించి.. ఉమ్మి నాకించి..!

వీరిలో సోరెన్ మరదలు సరళ మర్ముకూ కూడా ఉన్నారు. సీఎంకి పరీక్షలు నిర్వహించగా కరోనా నెగటివ్ అని తేలింది. సీఎం ఇంట్లో మొత్తం 62 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్టు రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ తెలిపారు. వీరిలో 15 మందికి కరోనా నిర్దారణ అయినట్లు తెలిపారు.

చదవండి : Jharkhand: ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మంది మృతి.. 26 మందికి గాయాలు

ఇదిలా ఉంటే జార్ఖండ్​లో కొత్తగా 5,081 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,74,000కు చేరుకోగా.. ఇప్పటి వరకు 5,164 మంది మృతిచెందారు.. 347,866 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు..