Drdo : డిఆర్డిఓ డైపాస్ లో డిప్లోమా అప్రెంటిస్ ఖాళీల భర్తీ

ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

Drdo : డిఆర్డిఓ డైపాస్ లో డిప్లోమా అప్రెంటిస్ ఖాళీల భర్తీ

Drdo

Drdo : ఢిల్లీలోని డీఆర్‌డీఓ డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజియాలజీ అండ్‌ అల్లైడ్‌ సైన్సెస్ లో వివిధ విభాగాల్లో అప్రెంటి్‌సల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌, మెడికల్‌ లాబొరేటరీ టెక్నాలజీ, లైబ్రరీ సైన్స్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, మోడర్న్‌ ఆఫీస్‌ ప్రాక్టీస్, ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 2019 తరవాత ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.8000 చెల్లిస్తారు. అకడమిక్‌ మెరిట్‌ ప్రాతిపదికన అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తులకు పంపేందుకు చివరి తేదీ డిసెంబరు 14గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:portal.mhrdnats.gov.in/