Himachal: హిమాచల్ ప్రదేశ్ లో 100 కోట్ల ఖర్చుతో ఫిల్మ్ సిటీ

అభివృద్ది దిశగా అడుగులు వేస్తున్న హిమాచల్ ప్రదేశ్ రూ.100 కోట్ల ఖర్చుతో ఫిల్మ్ సిటీ నిర్మాణం చేపట్టనుంది.

Himachal: హిమాచల్ ప్రదేశ్ లో 100 కోట్ల ఖర్చుతో ఫిల్మ్ సిటీ

Filmcity In Himachalpradesh (1)

Himachalpradesh : ధవళవర్ణంతో మెరిసిపోతు..చల్లటి వాతావరణంలో మైమరపించే హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధి దిశగా పయనిస్తోంది. దీంట్లో భాగంగా పితారా టీవీ రాష్ట్రంలో ఫిల్మ్ సిటీ ఏర్పాటు కోసం రూ.100 కోట్ల విలువైన భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసింది. అలాగే పలు పారిశ్రామిక రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటోంది. దీంట్లో భాగంగా రూ.3,307 కోట్ల పెట్టుబడుల కోసం 27 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. దీని వల్ల రాష్ట్రంలోని దాదాపు 15 వేల మందికి ప్రత్యక్షంగాను..పరోక్షంగాను ఉపాధిని కలగనుంది.

పరిశ్రమల మంత్రి బిక్రమ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రంలో రూ. 1000 కోట్ల వ్యయంతో ఇథనాల్ ఉత్పత్తి కోసం మొత్తం 6 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ట్రైడెంట్ కంపెనీ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు కోసం 800 కోట్ల రూపాయల విలువైన ఎంఓయూపై సంతకం చేసింది. బెటర్ టుమారో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం రూ. 490 కోట్ల విలువైన భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసింది. అలాగే మాధవ్ ఆగ్రో ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్, హిమాలయన్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్‌లు సంయుక్తంగా తొలి నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం రూ. 400 కోట్ల విలువైన ఎంఓయూలపై సంతకం చేశాయి.

ఈ సందర్భంగా పరిశ్రమల మంత్రి బిక్రమ్ సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు సరసమైన రేట్లు, నిరంతర విద్యుత్ సరఫరా మౌలిక సదుపాయాల ఏర్పాట్లతో పాటు విశిష్ట ప్రయోజనాలను అందిస్తుందని తెలిపారు. ఈక్రమంలో మరికొందు రాష్ట్రంలో ఇథనాల్ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారనీ..వైద్య పరికరాలు, విద్య,నైపుణ్యాభివృద్ధి, ఫార్మాస్యూటికల్స్, పేపర్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్, హెల్త్‌కేర్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ తయారీ వంటి పారిశ్రామిక రంగాలలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి తామ సిద్ధంగా ఉన్నమని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో థీమ్ పార్కులను అభివృద్ధి చేయడానికి కొంతమంది పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

film city developed in himachal pradesh