CAAపై బహిరంగ చర్చకు సిద్ధమే : షా సవాల్‌పై మాయావతి, అఖిలేష్!

  • Published By: sreehari ,Published On : January 23, 2020 / 01:35 AM IST
CAAపై బహిరంగ చర్చకు సిద్ధమే : షా సవాల్‌పై మాయావతి, అఖిలేష్!

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బహిరంగ చర్చకు విపక్షాలు సై అంటున్నాయి. సీఏఏపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నట్టు బీఎస్పీ సుప్రిమో మాయావతి, సమాజ్ వాదీ పార్టీ చీప్ అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఏ ఫోరమ్‌లోనైనా, ఏ ప్రాంతంలోనైనా బహిరంగ చర్చ జరిపేందుకు సిద్ధమని, వేదికను ఖరారు చేయమని ప్రతి సవాల్ విసిరారు.

‘చర్చకు సంబంధించినంతవరకు.. వేదికను ఖరారు చేయండి.. మీకు నచ్చిన ఛానళ్లు, యాంకర్లను ఎంపిక చేసుకోండి.అభివృద్ధిపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం’ అని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. దేశ ఆత్మను అర్థం చేసుకునే వారంతా సవరించిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని, మతం ఆధారంగా బిజెపి వివక్ష చూపుతోందని ఆయన ఆరోపించారు. అంతకుముందు బీఎస్పీ చీఫ్ మాయావతి కేంద్రంపై విరుచుకుపడ్డారని, ఏ వేదికపైనా అయిన సరే చర్చకు ఆమె పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు.

వివాదాస్పదమైన CAA, NRC, NPR కు వ్యతిరేకంగా ప్రభుత్వానికి అడుగడుగునా దేశవ్యాప్తంగా నిరసనల సెగ ఎదురువుతోంది.ముఖ్యంగా యువత, మహిళలు ఈ వ్యవహారంపై చర్చించాలని ప్రతిపక్షాలకు సవాలు విసురుతున్నారు. ఏ ఫోరమ్‌లోనైనా, ఏ ప్రదేశంలోనైనా చర్చించే సవాలును బీఎస్పీ స్వీకరిస్తుంది’ అని మాయావతి ట్వీట్ చేశారు. లక్నోలో జరిగిన ర్యాలీలో అమిత్ షా ప్రసంగిస్తూ.. సవరించిన పౌరసత్వ చట్టంపై ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని షా అన్నారు. అవసరమైతే దీనిపై పబ్లిక్ ఫోరమ్‌లో చర్చించేందుకు సిద్ధమేనా అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ , మాయావతిలకు షా సవాలు విసిరారు.

మరోవైపు.. మమతా బెనర్జీ డార్జిలింగ్ హిల్స్ లో CAAకు వ్యతిరేకంగా 4 కిలోమీటర్ల సుదీర్ఘ నిరసన ప్రదర్శనను నిర్వహించారు. బిజెపియేతర పాలిత రాష్ట్రాల్లో మాత్రమే CAAను అమలు చేసేలా కేంద్రం యత్నిస్తోందని ఆమె ఆరోపించారు.మరోవైపు, సుప్రీంకోర్టు కేంద్రాన్ని విచారించకుండా CAAపై ఎలాంటి స్టే ఇవ్వదని, అభ్యర్ధనలను విచారించడానికి ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. పార్లమెంటు ఉభయ సభలలో గత నెలలో ఆమోదించిన సిఎఎకు వ్యతిరేకంగా 140 పిటిషన్లను కోర్టు విచారించింది.

పిటిషనర్లలో కాంగ్రెస్ ఎంపి జైరామ్ రమేష్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, దాని ఎంపిలు, లోక్ సభ ఎంపి, AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసి, టిఎంసి ఎంపి మహువా మొయిత్రా , ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, త్రిపుర రాయల్ సియోన్ ప్రడోత్ కిషోర్ దేబ్ బర్మాన్ ఉన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుండి 2014 డిసెంబర్ 31 న లేదా అంతకు ముందు దేశానికి వలసగా వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, క్రిస్టియన్, జైన, పార్సీ వర్గాలకు చెందిన వలసదారులకు పౌరసత్వం ఇవ్వడానికి CAA అనుమతిస్తుంది. ఈ చట్టంలో ముస్లింలను మినహాయించడంతో వివాదాస్పదమైంది.