కేంద్ర బడ్జెట్ 2020-21 : ఇది సామాన్యుల బడ్జెట్ – నిర్మలా

  • Published By: madhu ,Published On : February 1, 2020 / 05:25 AM IST
కేంద్ర బడ్జెట్ 2020-21 : ఇది సామాన్యుల బడ్జెట్ – నిర్మలా

అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కేంద్ర బడ్జెట్ 2020 – 21ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. 2020, ఫిబ్రవరి 01వ తేదీ ఉదయం 11.00గంటలకు ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం ఈమెకు ఇది రెండోసారి. ఇది సామాన్యుల బడ్జెట్‌గా అభివర్ణించారు. ఆర్థిక ప్రగతికి సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. ప్రజల ఆదాయం పెంచేందుకు సత్వరచర్యలు తీసుకుంటున్నట్లు, ప్రజల ఆదాయం పెంచడమే బడ్జెట్ లక్ష్యమన్నారు. 

* పసుపు రంగుతో ఉన్న చీరను ధరించిన నిర్మలా..ఎప్పటిలాగానే ఎర్రటి వస్త్రం..రాజముద్ర ఉన్న సంచిలో బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చారు. 
* పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికంటే ముందు..రాష్ట్రపతితో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అనురాగ్ ఠాగూర్ భేటీ అయ్యారు. 
* అనంతరం పార్లమెంట్‌కు వారిద్దరూ చేరుకున్నారు. 
* తర్వాత జరిగిన కేంద కేబినెట్ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. 
* పార్లమెంట్‌కు బడ్జెట్ ప్రతులు చేరుకున్నాయి. వీటిని డాగ్ స్వ్కాడ్, బాంబు స్క్వాడ్‌లు క్షుణ్ణంగా పరీక్షించాయి. 

Read More : Budget 2020 Bahi khata : పసుపు రంగు చీర..ఎర్రటి సంచితో సీతమ్మ