డీజీపీపై ఐపీఎస్ మహిళా ఆఫీసర్ లైంగిక వేధింపుల కేసు

డీజీపీపై ఐపీఎస్ మహిళా ఆఫీసర్ లైంగిక వేధింపుల కేసు

fir against dgp

FIR against Tamil Nadu DGP: డీజీపీ రాజేశ్ దాస్, ఎస్పీ డీ కణ్ణన్ అనే వ్యక్తులపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఓ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ తనపై లైంగిక దాడి జరిగిందంటూ లిఖిత పూర్వకంగా అధికారిక కంప్లైంట్ చేశారు. ఈ క్రమంలో స్పెషల్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) రాజేశ్ దాస్, చెంగలపట్టు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డీ కణ్నన్ లపై సెక్షన్ 354, సెక్షన్ 3, సెక్షన్ 4ప్రకారం కేసు నమోదైంది.

తమిళనాడు ప్రభుత్వం దీనిపై ఫిబ్రవరిలో ఆరుగురితో కూడిన కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేయాలని ఆదేశించింది. దీనికి అడిషనల్ చీఫ్ సెక్రటరీ జయశ్రీ రఘునాథన్ లీడ్ గా వ్యవహరించారు.

‘వర్క్ ప్లేస్ లో జరిగిన లైంగిక వేధింపుల కారణంగా ఆ మహిళపై కమిటీ తప్పనిసరి చర్యలు తీసుకోవాలని’ తమిళనాడు హోం డిపార్ట్ మెంట్ ఆదేశించింది. ప్రస్తుతం స్సెషల్ డీజీపీ రాజేశ్ దాస్ ను కంపల్సరీ వెయిట్ (డ్యూటీలోనే) ఉన్నారు.

కొందరు ఐపీఎస్ ఆఫీసర్లు చెంగల్పట్టు ఎస్పీ డీ కణ్నన్ తన బలగాన్ని ఉపయోగించి రాజేశ్ దాస్ పై కంప్లైంట్ చేయకుండా అడ్డుకున్నాడని చెప్తున్నారు. అంతేకాకుండా బాధితురాలిని రాజేశ్ దాస్ తో మాట్లాడాలని బలవంతపెట్టాడు.

దీనిపై స్పందించిన ఎస్పీ డీ కణ్నన్ తనకు ఏం తెలియదని రాజేశ్ దాస్ చెప్పినట్లుగా ఐపీఎస్ మహిళా ఆఫీసర్ అడ్డుకున్నాను మాత్రమేనని చెప్తున్నాడు. అంతకుముందే వారిద్దరి మధ్య జరిగిన ఘటన గురించి తెలియదని వెల్లడించాడు.