Jharkhand: ఝార్ఖండ్‌లో విషాదం.. పోలీసుల బూట్లకింద నలిగి నవజాత శిశువు మృతి

ఇద్దరు నిందితులను పట్టుకొనేందుకు పోలీసులు వారింటికి వెళ్లారు. నిందితులను పట్టుకొనే క్రమంలో పెనుగులాట చోటుచేసుకుంది. దీంతో పక్కనే ఉన్న నవజాత శిశువు (నాలుగు రోజుల పసికందు)ను పోలీసులు తొక్కారు. పోలీసుల బూట్ల కిందపడి శిశువు మరణించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు ఉన్నతాధికారులు ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.

Jharkhand: ఝార్ఖండ్‌లో విషాదం.. పోలీసుల బూట్లకింద నలిగి నవజాత శిశువు మృతి

newborn baby

Jharkhand: ఝార్ఖండ్  (Jharkhand) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. పోలీసుల అత్యుత్సాహం ఓ పసికిందు ప్రాణాలు తీసింది. వ్యక్తిని అరెస్టు చేసేందుకు ఐదురుగురు పోలీసులు అతని నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో పెనుగులాట జరగడంతో పోలీసులు బూట్ల కింద నలిగి ఓ నవజాత శిశువు  (newborn baby) మరణించింది. ఇందుకు బాధ్యులైన ఆరుగురు పోలీసు అధికారులను సస్సెండ్ చేసి వారిపై ఎఫ్ఐఆర్  (FIR) నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తరువాత బాధ్యులపై చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు తెలిపారు.

Crime News: ధాబాలోని ఫ్రీజర్ లో యువతి మృతదేహం లభ్యం.. ఆమెను ప్రేమించిన వ్యక్తి అరెస్ట్

ఝార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడీహ్ జిల్లా (Giridih District) లో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. డియోరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోశోడింఘి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడానికి పోలీసులు వారి ఇంటికి వెళ్లారు. నవజాత శిశువు తాతతో పాటు, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని పట్టుకొనే క్రమంలో పెనుగులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో అనుకోకుండా పోలీసులు పక్కనే ఉన్న నాలుగు రోజుల శిశువును కాళ్లతో తొక్కారు. దీంతో శిశువు అక్కడికక్కడే మరణించింది.

Cyber crime : లాటరీలో కారు గెలిచారంటూ మెసేజ్..మహిళ ఎకౌంట్ నుంచి రూ.14 లక్షలు మాయం

నవజాత శిశువు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసు ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ విచారణలో బాధ్యులైన వారిపై చర్యలకు పూనుకున్నారు. స్టేషన్ ఇన్‌ఛార్జి సహా మొత్తం ఆరుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేసి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తరువాత బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇదిలాఉంటే, నవజాత శిశువు మరణానికి కారణమైన పోలీసుల పేర్ల వివరాలను వెల్లడించలేదు.