Kedarnath Husky Case : కేదార్‌నాథ్‌ లో నందిని తాకి ఆశీర్వాదం తీసుకున్న కుక్క..యజమానిపై కేసు పెట్టిన ఆలయ కమిటీ | FIR against man and his husky for praying at Kedarnath temple

Kedarnath Husky Case : కేదార్‌నాథ్‌ లో నందిని తాకి ఆశీర్వాదం తీసుకున్న కుక్క..యజమానిపై కేసు పెట్టిన ఆలయ కమిటీ

ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ లో నందిని తాకి ఆశీర్వాదం తీసుకుంది ఓ పెంపుకు కుక్క..దీంతో ఆ కుక్క యజమానిపై ఆలయ కమిటీ కేసు నమోదు చేశారు.

Kedarnath Husky Case : కేదార్‌నాథ్‌ లో నందిని తాకి ఆశీర్వాదం తీసుకున్న కుక్క..యజమానిపై కేసు పెట్టిన ఆలయ కమిటీ

FIR against man and his husky for praying at Kedarnath temple : ఓ కుక్క ఉంది.. దానికో పేరుంది.. ఆ పేరు మీద ఇన్ స్టా గ్రామ్ పేజ్ ఉంది.. దానికి మాంఛి ఫాలోయింగ్ ఉంది. అయితే.. ఆ పెట్‌తో వ్లాగింగ్ ఓ చేసే ఓ వ్యక్తి.. ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాడు. ఏకంగా.. అతనిపై కేసు కూడా ఫైల్ అయింది. అది కాస్తా.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అతను చేసిన తప్పేంటని.. అంతా ట్వీటడం మొదలుపెట్టారు. మేం.. అతనికే సపోర్ట్ చేస్తామంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ.. ఏం జరిగింది?

నోయిడాకు చెందిన రోహన్ త్యాగి అనే ఓ వ్లాగర్.. చార్ ధామ్ యాత్రలో భాగంగా తన నాలుగున్నరేళ్ల పెంపుడు కుక్క నవాబ్‌ను తీసుకొని.. పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌కు వెళ్లాడు. పెట్ డాగ్ నవాబ్.. ఆలయ వెలుపల ఉన్న నందిని తాకి.. ఆశీర్వాదం తీసుకుంది. అక్కడే ఆ కుక్కకు తిలకం కూడా దిద్దారు. కొంత సేపు.. దానిని ఎత్తుకొని అక్కడక్కడే తిరిగాడు. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని.. వీడియో తీసి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో.. గ్రామ్ కూడా తక్కువ కాకుండా పోస్ట్ చేశాడు. అది కాస్తా.. వైరల్ అయింది.

ఈ వైరల్ వీడియోపై.. బద్రీనాథ్-కేదార్ నాథ్ ఆలయ కమిటీ ఫైర్ అయింది. ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వ్లాగర్‌పై కేసు పెట్టింది. పెట్ డాగ్‌తో చేసిన ఈ వ్లాగ్.. కించపరిచే చర్యగా అభివర్ణించారు. ఇలాంటి వ్లాగర్లు భక్తితో రారని.. వీడియోలు షూట్ చేసేందుకు మాత్రమే వస్తారని.. ఆలయ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియో యాత్రికుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని కమిటీ అభిప్రాయపడింది.

అయితే.. నవాబ్ త్యాగి అనే ఈ హస్కీ డాగ్.. తన ఓనర్‌తో కలిసి నాలుగేళ్లుగా ఆలయాలను సందర్శిస్తోంది. ఈ సిరీస్‌లోనే.. కేదార్‌నాథ్ ఆలయానికి తీసుకొచ్చానని తెలిపాడు వ్లాగర్ రోహన్. అయినా.. కుక్కలు దేవుని అవతారమని తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. హస్కీఇండియాజీరో పేరుతో ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి.. అందులో తన పెట్ డాగ్స్‌ చేసే అల్లరికి సంబంధించిన వీడియోలన్నీ పోస్ట్ చేస్తుంటారు. దీనికి.. దాదాపు లక్ష మంది
ఈ వీడియోతో.. కుక్కే తన అనుభవాన్ని రాస్తున్నట్లుగా.. చిన్న టెక్ట్స్ కూడా పోస్ట్ చేశారు. తనను పెంచుకున్నవారు.. తనను అన్ని చోట్లకి తీసుకెళ్తున్నారని.. కానీ వారు దాంతో ఇబ్బందులు పడుతుంటారని.. రాసుకొచ్చారు. తాను నవాబ్ అని.. తన వయస్సు నాలుగురన్నరేళ్లని.. ఈ నాలుగేళ్లలో తాను ప్రయాణించినంతగా.. 70 ఏళ్ల వ్యక్తి కూడా ప్రయాణం చేయలేరని గర్వంగా చెబుతున్నట్లు.. రాసుకొచ్చారు. తన పేరెంట్స్.. తనను ప్రతి చోటకు తీసుకెళ్లడం వల్లే ఇది సాధ్యమైందని.. హస్కీ డాగ్ చెబుతున్నట్లుగా క్యాప్షన్ రాశారు.
స్పాట్..
బద్రీనాథ్-కేదార్ నాథ్ ఆలయ కమిటీ కేసు పెట్టడంపై.. చాలా మంది సోషల్ మీడియా యూజర్స్.. వ్లాగర్ రోహన్.. పెట్ డాగ్ నవాబ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. వీ సపోర్ట్ నవాబ్ త్యాగి అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. కుక్కను.. కాలభైరవుడితో పోలుస్తారు. శివుని.. ఐదో ముఖంగా వర్ణిస్తారు. అలాంటి కుక్క.. కేదారేశ్వరుడిని దర్శించుకుంటే తప్పేంటని ట్వీట్లు పెడుతున్నారు. ఇందులో.. వ్యతిరేకించడానికేముంది.. కుక్క భగవంతుడు సృష్టించిన జీవి కాదా? అని అడుగుతున్నారు. హిందూ పురాణాల్లో.. అన్ని జంతువులు భాగమేనని గుర్తు చేస్తున్నారు. వ్లాగర్ రోహన్‌పై పెట్టిన కేసుని.. వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

×