ఇద్దరికీ పాజిటివ్..యువతిపై డాక్టర్ లైంగిక వేధింపులు

  • Published By: madhu ,Published On : July 28, 2020 / 02:40 PM IST
ఇద్దరికీ పాజిటివ్..యువతిపై డాక్టర్ లైంగిక వేధింపులు

కరోనా వచ్చిన వారిపై కనికరం చూపాల్సింది పోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అందులో వైద్యులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

కొంతమంది వైద్యులు చేస్తున్న తప్పుడు పనులకు వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు. దేశ రాజధానిలో కరోనాతో చికిత్స పొందుతున్న యువతిపై ఓ డాక్టర్ లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆ డాక్టర్ కూడా కరోనాతో చికిత్స పొందుతున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇరవై ఏళ్ల యువతికి కరోనా వైరస్ సోకింది. నోయిడాలోని ఓ ప్రైవేటు ఆసుప్రత్రిలో చేరింది. కోవిడ్ పేషెంట్లను పరీక్షించిన డాక్టర్ కు వైరస్ సోకింది. దీంతో ఆయన్ను కూడ యువతితో పాటు ఒకే ఐసోలేషన్ వార్డులో ఉంచారు.