Children’s Hospital: ఆసుపత్రిలో పిల్లల వార్డులో మంటలు.. నలుగురు మృతి

మధ్యప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని కమలా నెహ్రూ ఆసుపత్రిలో పిల్లల వార్డులో మంటలు చెలరేగాయి.

Children’s Hospital: ఆసుపత్రిలో పిల్లల వార్డులో మంటలు.. నలుగురు మృతి

Children

Children’s Hospital: మధ్యప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని కమలా నెహ్రూ ఆసుపత్రిలో పిల్లల వార్డులో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ పాల్గొన్నారు.

ఈ ఘటనలో నలుగురు చిన్నారులు చనిపోగా.. పలువురు చిన్నారులు గాయపడ్డారు. 3-4 గంటలైనా తమ పిల్లల గురించి ఎటువంటి సమాచారం లేదని కమలా నెహ్రూ ఆసుపత్రి బయట తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆస్పత్రి భవనంలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయని ఫతేఘర్ అగ్నిమాపక కేంద్రం ఇన్‌ఛార్జ్ జుబేర్ ఖాన్ తెలిపారు. 8-10 ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.

ఈ విషయాన్ని ధృవీకరిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. ఆసుపత్రిలోని పిల్లల వార్డులో అగ్నిప్రమాదం జరగడం చాలా బాధాకరం. రెస్క్యూ టీమ్ ఆపరేషన్ వేగంగా జరిగింది. మంటలు అదుపులోకి వచ్చాయి. దురదృష్టవశాత్తు ముగ్గురు పిల్లలు చనిపోయినట్లుగా ముఖ్యమంత్రి చెప్పారు.

ఘటన జరిగిన సమయంలో వార్డులో 40 మంది చిన్నారులు ఉండగా.. 36 మంది చిన్నారులు ప్రాణాలతో బయటడినట్లు పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనపై సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.