Odisha Train Smoke: ఒడిశాలో మరో ఘటన.. సికింద్రాబాద్-అగర్తలా రైలులో పొగలు

బెర్హంపూర్ స్టేషన్ రాకముందే కోచ్‌లోని ఎయిర్ కండిషనింగ్ యూనిట్ నుంచి పొగలు వెలువడుతున్నాయని ప్రయాణికులు రైల్వే అధికారులను అప్రమత్తం చేయడంతో సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్ రైలును మంగళవారం మధ్యాహ్నం ఒడిశాలోని బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు

Odisha Train Smoke: ఒడిశాలో మరో ఘటన.. సికింద్రాబాద్-అగర్తలా రైలులో పొగలు

Secunderabad-Agartala Express: కొద్ది రోజుల క్రితం ఒడిశాలోని బాలాసోర్‭లో జరిగిన రైలు ప్రమాదంతో దేశమే తీవ్ర దిగ్భ్రాంతిలోకి వెళ్లిపోయింది. ఆ ఘటన ఇంకా మరువక ముందే అదే రాష్ట్రంలో మరో ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న బెర్హంపూర్ స్టేషన్‭లోని రైలు షార్ట్ సర్క్యూట్ కి గురైంది. ఇది తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే సికింద్రాబాద్-అగర్తలా రైలు కావడం గమనార్హం.

CM KCR: నాగర్‌కర్నూల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. భారీ బహిరంగ సభ.. షెడ్యూల్ ఇలా..

బెర్హంపూర్ స్టేషన్ రాకముందే కోచ్‌లోని ఎయిర్ కండిషనింగ్ యూనిట్ నుంచి పొగలు వెలువడుతున్నాయని ప్రయాణికులు రైల్వే అధికారులను అప్రమత్తం చేయడంతో సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్ రైలును మంగళవారం మధ్యాహ్నం ఒడిశాలోని బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. అధికారులు వెంటనే పొగలను అదుపు చేసినప్పటికీ, మళ్లీ ఏదైనా జరగొచ్చనే భయాందోళనకు గురైన ప్రయాణికులు.. ఆ కోచ్‌లో ప్రయాణించడానికి నిరాకరించారు. కోచ్‌ను మార్చాలని డిమాండ్‌ చేశారు.

Bandi Sanjay: పంతాలు, పట్టింపులకు పోయి సమస్యను పరిష్కరించకుంటే చూస్తూ ఊరుకోం..

కొంతమంది ప్రయాణికులు మొదట బి-5 కోచ్‌లో పొగను గమనించి అలారం ఎత్తారు. దీంతో చాలా మంది ప్రయాణికులు కిందకు దిగి మళ్లీ రైలు ఎక్కేందుకు నిరాకరించారని ఓ అధికారి తెలిపారు. “సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్‌లోని బెర్హంపూర్ స్టేషన్ సమీపంలోని కోచ్ నెంబర్ B-5లో చిన్న విద్యుత్ సమస్య సంభవించినట్లు సమాచారం అందింది. డ్యూటీలో ఉన్న సిబ్బంది వెంటనే ఆ సమస్యను సరిచేశారు” అని ఈస్ట్ కోర్ట్ రైల్వే అధికారి తెలిపారు.