అగ్నిప్రమాదం.. ప్రధాని మోడీ నివాసంలో కాదు : PMO ట్వీట్

  • Published By: sreehari ,Published On : December 30, 2019 / 02:37 PM IST
అగ్నిప్రమాదం.. ప్రధాని మోడీ నివాసంలో కాదు : PMO ట్వీట్

అగ్నిప్రమాదం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కాదని PMO కార్యాలయం ప్రకటించింది. ప్రధాని నివాసంలో అగ్ని ప్రమాదమంటూ వస్తున్న వార్తలపై PMO ట్విట్టర్ వేదికగా స్పందించింది. అగ్నిప్రమాదం జరిగింది ప్రధాని నివాసంలో కాదని, లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద ఎస్‌పీజీ రిసెప్షన్‌లో మాత్రమేనని స్పష్టం చేసింది.

‘లోక్ కల్యాణ్ మార్గ్ 9 దగ్గర షాట్ సర్క్యూట్ కారణంగా స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రాంతం ప్రధాని నివాసం లేదా ఆఫీస్ ఏరియా కాదు. కానీ, LKM కంప్లెక్స్ లోని SPG రిసెప్షన్ ఏరియాలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ప్రస్తుతం.. మంటలు అదుపులోనే ఉన్నాయి’ అంటూ PMO కార్యాలయం ట్వీట్ చేసింది.

అంతకుముందు.. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో అగ్నిప్రమాదం జరిగిందంటూ వార్తలు వచ్చాయి. సోమవారం (డిసెంబర్ 30, 2019) ప్రధాని నివాసమైన 7 లోక్ కల్యాణ్ మార్క్‌ దగ్గర రాత్రి 7.25 నిమిషాలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 9 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అది కేవలం స్వల్ప ప్రమాదమేనని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు.