షాకింగ్ : పెట్రోల్ బంక్ లో తప్పిన ఘోర ప్రమాదం

అది ఓ పెట్రోల్ బంకు. వాహనాల్లో పెట్రోల్ పడుతున్నారు. క్యూలో వస్తున్న వాహనాల్లో ఇంధనం నింపుతున్నారు. అదే సమయంలో ఓ బైక్ పై ముగ్గురు వ్యక్తులు వచ్చారు. అందులో

  • Published By: veegamteam ,Published On : September 3, 2019 / 08:30 AM IST
షాకింగ్ : పెట్రోల్ బంక్ లో తప్పిన ఘోర ప్రమాదం

అది ఓ పెట్రోల్ బంకు. వాహనాల్లో పెట్రోల్ పడుతున్నారు. క్యూలో వస్తున్న వాహనాల్లో ఇంధనం నింపుతున్నారు. అదే సమయంలో ఓ బైక్ పై ముగ్గురు వ్యక్తులు వచ్చారు. అందులో

అది ఓ పెట్రోల్ బంకు. వాహనాల్లో పెట్రోల్ పడుతున్నారు. క్యూలో వస్తున్న వాహనాల్లో ఇంధనం నింపుతున్నారు. అదే సమయంలో ఓ బైక్ పై ముగ్గురు వ్యక్తులు వచ్చారు. అందులో పెట్రోల్ నింపాలని చెప్పారు. సిబ్బంది బైక్ లో పెట్రోల్ నింపుతున్న సమయంలో ఊహించని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెట్రోల్ పోస్తున్న సిబ్బంది.. బైక్ మీదున్న ముగ్గురు అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తారు. బైక్ ని అక్కడే పడేసి ఆ ముగ్గురూ దూరంగా వెళ్లిపోయారు. 

ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అంతా భయపడ్డారు. ఇంతలో కొందరు సిబ్బంది ధైర్యం చేసి ముందుకొచ్చారు. కాలిపోతున్న బైక్ ని పెట్రోల్ డబ్బా నుంచి దూరంగా లాగేశారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఒక వేళ పెట్రోల్ బంకుకి మంటలు అంటుకుని ఉంటే భారీ ప్రమాదమే జరిగేది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లో ఈ ఘటన జరిగింది. మంటలు చెలరేగడానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో చూసిన వారంతా బాబోయ్ అంటున్నారు.