Imran Khan: పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ఖాన్‌పై కాల్పులు.. స్పందించిన భారత్ ..

పాకిస్థాన్‌లో ఇమ్రాన్ పై కాల్పుల ఘటన తరువాత జరిగిన పరిణామాలపై భారత్ స్పందించింది. పాకిస్థాన్ లో పరిస్థితులపై ఓ కన్నేసి ఉంచామని, అక్కడి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది.

Imran Khan: పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ఖాన్‌పై కాల్పులు.. స్పందించిన భారత్ ..

IMran Khan

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌పై దుండగుడు కాల్పులకు పాల్పడిన విషయం విధితమే. ఆయన తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. లాంగ్‌మార్చ్ పేరిట ర్యాలీలో భాగంగా వజీరాబాద్‌లో అల్లాహో చౌక్ కు చేరుకోగానే ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Firing On Imran Khan : ‘ఇమ్రాన్ ఖాన్‌ని అందుకే చంపాల‌నుకున్నా’.. పోలీసుల విచారణలో వెల్లడించిన నిందితుడు

ఈ కాల్పుల ఘటనలో ఇమ్రాన్ కాలికి గాయాలైనట్లు పీటీఐ నేత ఫవాద్ చౌధురి తెలిపారు. ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పుల ఘటన నేపథ్యంలో పాకిస్థాన్‍లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిరసనలు చెలరేగాయి, ఇమ్రాన్ ఖాన్ కంటైనర్ దగ్గర కాల్పులు జరిపిన కొన్ని గంటల తర్వాత ప్రజలు ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని పెషావర్‌లోని కార్ప్స్ కమాండర్ హౌస్ ముందు నిరసనలు చేపట్టారు. ఇమ్రాన్ పై దాడిని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై తక్షణమే నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారు. ఇమ్రాన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపాడు.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో కాల్పులు.. ఇమ్రాన్ ఖాన్‌కు గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

ఇమ్రాన్ పై కాల్పుల ఘటన తరువాత పాకిస్థాన్‌లో జరిగిన పరిణామాలపై భారత్ స్పందించింది. పాకిస్థాన్ లో పరిస్థితులపై ఓ కన్నేసి ఉంచామని, అక్కడి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి వెల్లడించారు.