అందరిక‌న్నా ముందుగా, కార్పొరేట్ ఉద్యోగులకు క‌రోనా వ్యాక్సిన్ ?

  • Published By: madhu ,Published On : October 4, 2020 / 12:08 PM IST
అందరిక‌న్నా ముందుగా, కార్పొరేట్ ఉద్యోగులకు క‌రోనా వ్యాక్సిన్ ?

First corona vaccine : ఇప్పుడిప్పుడే పారిశ్రామిక‌, కార్పొరేట్ రంగం
కుదుట‌పడుతోంది. త‌మ ఉద్యోగుల కోసం క‌రోనా వ్యాక్సిన్ ను ఎక్క‌డి నుంచైనా కొన‌డానికి పలు కీలక సంస్థలకు అనుమ‌తినివ్వ‌డానికి సానుకూలంగా ఉంది. ప్ర‌ధాన ఆర్థిక రంగాలు క‌రోనాతో ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని కోరుకొంటోంది ప్ర‌భుత్వం. కీల‌క‌మైన వ్యాపార రంగాల్లోని కంపెనీలు వ్యాక్సిన్ ల‌ను వీలైనంత త్వ‌ర‌గా కొనుగోలు చేయాల‌నుకొంటున్నాయి.



దేశంలో క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల‌ని అనుకోవడం లేదని తెలుస్తోంది. ర‌ష్యా, అమెరిక లాంటి దేశాల్లో ముందుగా దొరికే Covid-19 వ్యాక్సిన్ ల‌ను ఎంత ఖరీదైనా కొనాల‌న్న‌ది ప్లాన్. దీనికి అనుకూలంగా కేంద్రం నిర్ణ‌యం తీసుకొనబోతోందని మీడియా క‌థ‌నం.
విదేశీ సంస్థలు దేశంలో పెట్టుబ‌డులు పెడుతున్నాయి. అమెరికా నుంచి అరేబియా వ‌ర‌కు పెట్టుబ‌డి సంస్థ‌ల‌ను సూదంటురాయిలా ఆక‌ట్టుకొంటున్నాయి రిలయెన్స్ లాంటి దిగ్గ‌జాలు.



ఆర్థిక వ్య‌వ‌స్థకు వ్యూహాత్మ‌మైన కీల‌క‌మైన రంగాల్లో సంస్థల ప‌నితీరు దెబ్బ‌తిన‌కూడ‌దు. ఉత్ప‌త్తి ప్ర‌క్రియ ఆగ‌కూడ‌దు. అందుకే కేంద్రం కూడా విదేశీ వ్యాక్సిన్ ల‌ను ఆయా సంస్థ‌లు కొనాల‌ని అనుకున్న‌ప్పుడు అడ్డుపెట్ట‌డం అంత స‌బ‌బుకాద‌న్న‌ది వాద‌న‌. ఈ ప్ర‌తిపాద‌న ఇప్పుడు ప్ర‌ధాన‌ మంత్రి కార్యాల‌యం ద‌గ్గ‌ర అనుమ‌తి కోసం వెయిట్ చేస్తోంది. ప్ర‌ధాని ఒకే అంటే, విదేశీ వ్యాక్సిన్ ల కోసం ఒప్పందాలు మొద‌ల‌వుతాయి.



వ్యాక్సిన్ త‌యారీ ప్ర‌క్రియ మాత్ర‌మే కాదు, పంపిణీకీ కూడా ప్ర‌పంచ ఆరోగ్య‌ సంస్థ కొన్ని ప్ర‌మాణాల‌ను నిర్దేశించింది. ముందు ఎవ‌రికి వ్యాక్సిన్ ఇవ్వాలో ప్ర‌తి దేశానికి కొన్ని ప్ర‌ియార్టీలున్నాయి. దేశీయ అవ‌స‌రాలు తీరిన త‌ర్వాత‌నే ఇత‌ర దేశాల‌కు అవి పంపిణీ చేస్తాయి. డబ్బున్న దేశాలు ఇప్ప‌టికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.



ముందు కోవిడ్ వారియ‌ర్లు, హెల్త్ వ‌ర్క‌ర్లు, క్రిటిక‌ల్ గా ఉన్న రోగులు, 75 ఏళ్లు దాటిన వారికి ముందు వ్యాక్సిన్ ఇవ్వాల‌న్న‌ది అంత‌ర్జాతీయంగా వినిపిస్తున్న ప్ర‌తిపాద‌న‌. కేంద్రం ద‌గ్గ‌ర‌ కూడా క‌రోనా వ్యాక్సిన్ ప్ర‌యార్టీ లిస్ట్ ఉంది. 23.9శాతం మేర కుదించుకుపోయిన ఆర్థిక వ్య‌వ‌స్థను లేపి, ప‌రుగులెత్తించాలంటే తమకు క‌రోనా వ్యాక్సిన్ త్వ‌రంగా అందుబాటులోకి తీసుకొని రావ‌డం ముఖ్య‌మ‌ని పారిశ్రామిక దిగ్గ‌జాలు ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర ప్ర‌తిపాద‌న పెట్టాయి. మీరు ఇవ్వండి. లేటైతే, మేమే వేరే చోట నుంచి కొనుక్కొంటాం. దానికి అనుమ‌తినివ్వండి. ఇదీ కార్పొరేట్, పారిశ్రామిక రంగ ప్ర‌తిపాద‌న‌.



ప్ర‌తీ ప్రభుత్వం ఇప్ప‌టికే దాదాపు దేశాలను అన్ లాక్ చేశాయి. అన్ని పారిశ్రామిక రంగాలు ప‌ని మొద‌లుపెట్టినా, డిమాండ్ త‌క్కువ‌గా ఉంది కాబ‌ట్టి ఉత్ప‌త్తి కొద్దిగానే ఉంది. త్వ‌ర‌లో డిమాండ్ పెరుగుతుందని అంచనా. ఈ రంగాలు ఊపందుకోవాలంటే వైర‌స్ టెన్స‌న్ ఉండ‌కూడ‌దు. ఈ ఆగ‌స్టుకే వ్యాక్సిన్ వస్తుంద‌ని కేంద్రం ఆరాట‌ప‌డినా, వచ్చేయేడు మొద‌ట్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంద‌ని అంచాన‌ వేస్తోంది. వ్యాక్సిన్ డెలివ‌రీకి కావాల్సిన స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డానికి సిద్దమ‌వుతోంది. ఇప్ప‌టికే ప్లాన్ రెడీ అయ్యిందని సమాచారం.



పెద్ద కంటైన‌ర్ ల్లో వ్యాక్సిన్ ను ర‌వాణా చేయాలి. ఇదేమంత సులువుకాదు. ఖ‌ర్చుకూడా అనే వాదనలున్నాయి. ఎక్కువ‌ మందికి frozen formతో వ్యాక్సిన్ ను ర‌వాణా చేయాలి. కొంద‌రికి refrigeration సరిపోతుంది. బ్రిటిష్ స్వీడిష్ కంపెనీ AstraZeneca, భార‌త‌దేశానికి చెందిన‌ సీరం ఇన్ స్టిట్యూట్ తో క‌ల‌సి University of Oxford త‌యారుచేస్తున్న వ్యాక్సిన్ లు మూడో ఫేజ్ లో ఉన్నాయి.



మరో భార‌తీయ ఔష‌ద దిగ్గ‌జం Zydus Cadila phase 2 trials మొద‌లుపెట్టింది. Bharat Biotech కూడా రెండో ఫేజ్ ట్ర‌యిల్స్ ను సెప్టెంబ‌ర్ లోనే మొద‌లుపెట్టింది. ఏది ముందొచ్చినా, ఆరునెల‌ల్లోనే క‌రోనా వ్యాక్సిన్ వ‌స్తుంద‌న్న‌ది అంచానా. అందుకే భార‌త‌దేశ కార్పొరేట్, పారిశ్రామిక రంగాలు తొందరపడుతున్నాయి.