IMD : అరేబియా సముద్రంలో తొలి తుపాన్, ఈ రాష్ట్రాల్లో ప్రభావం

అరేబియా సముద్రంలో తుపాన్ ఏర్పడబోతోంది. ఈ విషయాన్ని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేస్తోంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో మే 14వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఐఎండీ వెల్లడించింది.

IMD : అరేబియా సముద్రంలో తొలి తుపాన్, ఈ రాష్ట్రాల్లో ప్రభావం

Cyclone

First Cyclone  : అరేబియా సముద్రంలో తుపాన్ ఏర్పడబోతోంది. ఈ విషయాన్ని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేస్తోంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో మే 14వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఇదే నిజమైతే..ఈ సంవత్సరం ఏర్పడే తొలి తుపాన్ ఇదే అవుతుందని తెలిపింది.

దీనికి మయన్మార్ సూచించిన ‘తౌకతీ’ అని నామకరణం చేయనున్నారు. మయన్మార్ లో దీని అర్థం బల్లి లేదా ..ఆ జాతికి చెందిన జీవి. ఇక తుపాన్ ప్రభావం భారతదేశ పశ్చిమ తీరంలో కనిపిస్తుందని, ఈనెల 16వ తేదీ నాటికి తుపాన్ వస్తుందని హెచ్చరించింది. లక్షద్వీప్, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలో తుపాన్ ప్రభావం ఉంటుందని తెలిపింది. 15, 16 తేదీల మధ్య లక్షద్వీప్ లోని లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతాయని హెచ్చరించింది.

15వ తేదీ నాటికి లక్షద్వీప్ కు చేరుకుని..16వ తేదీన తుపాన్‌గా మరింత తీవ్ర రూపం దాలుస్తుందని, అంచనా వేసింది. అది వాయువ్య దిశగా ప్రయాణీస్తూ..మరింత తీవ్రమయ్యే..అవకాశం ఉందని అంటోంది. 17వ లేదా 18వ తేదీ తుపాన్ గమనం మార్చుకోవచ్చని, ఇది కచ్, దక్షిణ పాకిస్థాన్ దిశగా..ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది.

Read More : Financial Problem: కరోనా దెబ్బకు ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య