Divorce Law: విడాకుల నమోదును తప్పనిసరి చేస్తూ చట్టాన్ని తీసుకురానున్న కేరళ

రాష్ట్రంలో విడాకుల నమోదును తప్పనిసరి చేస్తూ చట్టాన్ని తీసుకురావాలనే యోచనలో కేరళ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది.

Divorce Law: విడాకుల నమోదును తప్పనిసరి చేస్తూ చట్టాన్ని తీసుకురానున్న కేరళ

Keraal

Divorce Law: రాష్ట్రంలో విడాకుల నమోదును తప్పనిసరి చేస్తూ చట్టాన్ని తీసుకురావాలనే యోచనలో కేరళ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. మహిళలు, పిల్లలు, ట్రాన్స్‌జెండర్లు మరియు వికలాంగుల సంక్షేమంపై ఇటీవల కేరళ శాసనసభ కమిటీ సిఫార్సు మేరకు ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి ఎంవీ గోవిందన్ తెలిపారు. ఇందుకు అవసరమైన చట్టాలు, సవరణలు సిద్ధం చేయనున్నట్లు ఆయన తెలిపారు. మంత్రి ఎంవీ గోవిందన్ గురువారం మీడియాతో మాట్లాడుతూ “విడాకుల నమోదు” తప్పనిసరి అని భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ చట్టం లేదని, ఈ విషయంలో కేరళ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. వివాహం, విడాకులు రాజ్యాంగం యొక్క ఉమ్మడి జాబితాలో చేర్చబడ్డాయి, కాబట్టి విడాకుల నమోదు కోసం చట్టం చేసే అధికారం రాష్ట్రానికి ఉందని మంత్రి తెలిపారు.

Also read: Glass Tumbler: సీక్రెట్ ప్లేస్‌లో వాటర్ గ్లాస్ చొప్పించుకున్న మహిళ

“భారతీయ లా కమిషన్ 2008 నివేదిక ప్రకారం వివాహాలు విడాకులను నమోదు చేయవలసిన అవసరాన్ని తెలిపారు. మతం లేదా వ్యక్తిగత చట్టంతో సంబంధం లేకుండా భారతదేశం అంతటా పౌరులందరికీ ఇది వర్తింపజేయాలని ఆ నివేదికలో సిఫార్సు చేశారు. అయినప్పటికీ, దీనిపై ఇప్పటివరకు ఎటువంటి చట్టం రూపొందించబడలేదు” అని కేరళ మంత్రి అన్నారు. కేరళ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ రూల్స్, 2008ని సవరించడం ద్వారా ప్రతిపాదిత విడాకుల నమోదు చట్టం అమలులోకి వస్తుందని ఎంవీ గోవిందన్ తెలిపారు.

Also read: Bjp vs Trs: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మాట ఒక్కటే..!

విడాకుల నమోదు సమయంలో దంపతులకు పిల్లలు ఉన్నట్లయితే, వారి సంరక్షణ గురించిన వివరాలు కూడా చేర్చబడతాయి. దంపతులు మళ్లీ పెళ్లి చేసుకుంటే పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించేలా చట్టం తీసుకురానున్నారు. విడాకుల నమోదు చట్టం ఆమోదం పొందితే, చట్టం ద్వారా విడాకుల నమోదును తప్పనిసరి చేయడంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా కేరళ నిలువనుంది.

Also read: Child Safe : విశాఖలో కిడ్నాపైన పాప క్షేమం- శ్రీకాకుళంలో ఆచూకీ లభ్యం